వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ హిట్ డైరెక్టర్ కార్తీక్ రాజు
5 months ago | 5 Views
ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం టాప్-మోస్ట్ బ్యానర్‌తో కలిసి పనిచేయబోతున్న కార్తిక్ రాజు
కార్తిక్ రాజు...ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ పేరు మారుమ్రోగిపోతుంది. ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ #సింగిల్ సినిమాతో ఈ దర్శకుడి పేరు ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ రాజు తమిళ సినిమా ప్రయాణం మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన "తిరుదన్ పోలీస్" సినిమా బ్లాక్ బస్టర్ విజయంతో ప్రారంభమైంది. ఆ తర్వాత "ఉల్కుతు" మరియు రెజీనా కాసాండ్రా నటించిన ద్విభాషా చిత్రం "నేనే నా" తో తన విజయ పరంపరను కొనసాగించాడు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన "నిను వీడని నీడను నేనే` సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమై మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు.
ఇక రీసెంట్‌గా ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బేనర్లో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన #సింగిల్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించడంతో టాలీవుడ్‌లో అత్యంత విజయవంతమైన దర్శకులలో ఒకరిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. "నిను వీడని నీడను నేనే" మరియు శ్రీ విష్ణు నటించిన తాజా బ్లాక్‌బస్టర్ "సింగిల్" వంటి వరుస హిట్‌లతో, కార్తీక్ రాజు పరిశ్రమలో తన సత్తా నిరూపించుకున్నాడు. #సింగిల్ సినిమా విజయం తర్వాత, ప్రముఖ హీరోలతో కొత్త ప్రాజెక్టుల కోసం అగ్ర నిర్మాణ సంస్థలు కార్తీక్ రాజును సంప్రదిస్తున్నాయని తెలుస్తోంది. ప్రముఖ హీరోతో భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం ఆయన టాప్-మోస్ట్ బ్యానర్‌తో కలిసి పనిచేయబోతున్నారు.
త్వరలో ఆ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు. కార్తిక్ రాజు తన విజన్ మరియు డిఫరెంట్ మేకింగ్ స్టైల్ తో భవిష్యత్తులో మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్‌లను సాధిస్తాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతిభ మరియు అంకితభావంతో కార్తిక్ రాజు భారతీయ చలనచిత్ర పరిశ్రమపై శాశ్వత ప్రభావాన్ని చూపడం ఖాయం.
ఇంకా చదవండి: సుహాస్ కొత్త చిత్రం ప్రారంభం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




