డ్రామా, డిస్ఫంక్షన్, డ్యామేజ్ – రానా నాయుడు ప్రపంచంలో తన రాకతో అల్లకల్లోలాన్ని రేపిన సునీల్ గ్రోవర్
6 months ago | 5 Views
ఒకే వేదికపై బలవంతుడైన రానా నాయుడు, భయంకరమైన జిత్తులమారిలాఆలోచనలు చేసే సునీల్ గ్రోవర్ తలపడుతుంటే... అసలు సిసలైన దుమ్ము దులిపే దృశ్యం మన ముందు ప్రత్యక్షమవుతుంది. దీన్ని ఆవిష్కరిస్తూ ఓ వీడియోను ఎవరి ఉహకు అందని విధంగా నెట్‌ఫ్లిక్స్ సిద్ధం చేసి విడుదల చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, సునీల్ గ్రోవర్ ఇద్దరూ కనిపించారు.సీరియస్‌గా, కఠినంగా కనిపించే రానా నాయుడు ప్రపంచంలోకి తనదైన మార్క్ ఉన్మాదంతో ఉన్న సునీల్ ప్రవేశించాడు. ఇతను ఎప్పుడూ నిశ్శబ్దాన్ని కోరుకునే వ్యక్తి కాదు. దీంతో పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. నిజానికి ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనటానికి సిద్ధంగా లేడు.
సునీల్ గ్రోవర్ మాట్లాడుతూ, “రానా దగ్గుబాటి మరియు నేను ఒకే ఫ్రేమ్‌లో? నేను కూడా ఊహించలేదు. ‘రానా నాయుడు’ అనేది పవర్ మూవ్స్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌లతో నిండిన తీవ్రమైన, గట్టి ప్రపంచం. అలాంటి లోకంలో నేను నా స్టైల్ అల్లకల్లోలంతో ప్రవేశించాను. నెట్‌ఫ్లిక్స్ ఈ ఐడియా చెప్పగానే, ఇది ఖచ్చితంగా మైండ్‌బ్లోయింగ్ అనిపించింది. మేము షూట్ చేసినది వైల్డ్, అన్‌ప్రెడిక్టబుల్, అంతెక్కువ ఫన్‌తో కూడినది. అది రెండు వేర్వేరు లోకాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నట్లు అనిపించింది – కానీ ఏదో ఒక విధంగా అది ‘క్లిక్’ అయిపోయింది. ‘రానా నాయుడు’ సీజన్ 2 డ్రామా తీసుకొస్తుంది… అంతేకాదు కొంచెం మాయహెమ్ కూడా.”
సునీల్ గ్రోవర్ మాట్లాడుతూ ‘‘నేను, రానా దగ్గుబాటి ఒకే ఫ్రేమ్? దీన్ని నేను అస్సలు ఊహించలేదు. ‘రానా నాయుడు’ పవర్‌ఫుల్ మలుపులు, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌తో కూడిన తీవ్రమైన, కఠినమైన ప్రపంచం. అలాంటి లోకంలోకి నా ఎంట్రీ అనేది నా స్టైల్లోనే ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ ఈ ఐడియా గురించి నాకు చెప్పగానే నాకు అద్భుతంగా అనిపించింది. వైల్డ్, ఎవరూ ఊహించని, ఫన్ కలగలిపిన కథాంశంతో తెరకెక్కించాం. రెండు వేర్వేరు లోకాలు ఢీ కొన్నట్లుగా నాకు అనిపించింది. రానా నాయుడు సీజన్2 కల్లోలంతో కూడా డ్రామాను మీ ముందుకు తీసుకు వస్తుంది. ఇందులో నేను చేసింది అతిథి పాత్ర కాదు. సాధారణంగా మీరు చూసే కలయికలా మాత్రం ఇది కనిపించదు. మిమ్మల్ని నవ్విస్తూనే అసలేం జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తూ మరింతగా చూడాలనిపించేలా ఉండే సందర్భం’’ అన్నారు.
రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘‘సునీల్ గ్రోవర్ కనిపించగానే మీరు ఊహించలేని పరిస్థితులను చూస్తామనే భావమనైతే కలుగుుతుంది. రానా నాయుడులా చక్కటి యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తాను. పంచ్‌లనే కాదు పంచ్ లైన్‌లను కూడా తప్పించుకుంటాను. ఇలాంటి ఓ వైల్డ్ ఎక్స్‌పీరియెన్స్‌ను మీకు అందించటానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధమైంది. మీరు ఊహించని కల్లోలాన్ని చూడబోతున్నారనైతే నేను కచ్చితంగా చెప్పగలను. మేం సహనటులం కాకపోయినా కొన్ని నిమిషాల పాటు వింతగా ఉండే మా ప్రపంచాలు ఢీ కొంటాయి. అది చూడటానికి హాస్యంతో నిండి ఉంటుంది కూడా. కచ్చితంగా రానా నాయుడు సీజన్2 అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తుంది’’ అన్నారు.
కరణ్ అన్షుమన్ సృష్టించిన రానా నాయుడు సీజన్2ను లోకో మోటివ్ బ్యానర్‌పై సుందర్ అరోన్ నిర్మించారు. ముగ్గురు డైరెక్టర్ల త్రయం – కారణ్ అషుమన్, సుపర్ణ్ ఎస్. వర్మ, అభయ్ చోప్రా దీన్ని తెరెక్కికెక్కించారు. వెంకటేష్ దగ్గుబాటితో రానా దగ్గుబాటి మళ్లీ రంగప్రవేశం చేశారు. అర్జున్ రాంపాల్, సురవీన్ చావ్లా, కృతి ఖర్భందా, సుశాంత్ సింగ్, అభిషేక్ బెనర్జీ, మరియు డినో మోరియా తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. చూస్తుంటే డ్రామా, డిస్ఫంక్షన్, డ్యామేజ్ ఈ సీజన్‌లో మరింత ఎక్కువగా కనిపించనున్నాయి.
జూన్13 నుంచి రానా నాయుడు సీజన్2ని నెట్ ఫ్లిక్స్‌లో చూసి ఎంజాయ్ చేయండి
ఇంకా చదవండి: జాకీ చాన్ – అజయ్ దేవగణ్ మాస్ కలయిక! బాలీవుడ్‌లో కలిసి పనిచేస్తారా?
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రానా నాయుడు 2 # విక్టరీ వెంకటేష్ # రానా దగ్గుబాటి




