సమంత కొత్త జీవితంలో అడుగు—ఫ్యాన్స్ షాక్!
2 days ago | 5 Views
ఎట్టకేలకు సమంత మళ్ళీ పెళ్ళి చేసుకుంది. తిరుపతి పట్టణానికి కోడలు అయ్యింది. అయితే అందరూ అనుకున్నట్లు తన ఫ్యాషన్ డిజైనర్ ను కాకుండా ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ నిర్మాత దర్శకుడు రచయిత రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈషా కేంద్రంలోని లింగ భైరవ ఆలయంలో సమంత - రాజ్ నిడిమోరు పెళ్లి జరిగింది. పెళ్లిలో సమంత ఎర్రచీర, రాజ్ క్రీమ్ - గోల్డ్ కలర్ కుర్తాతో చూడముచ్చటగా ఉన్నారు. ఈ మేరకు సమంత సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో సమంత నటించినప్పుడు ఇద్దరు ప్రేమలో పడినట్లు సమాచారం. కొంతకాలంగా ఇద్దరూ ముంబై లో సహజీవనం చేస్తున్నారు. సమంత మొదటి పెళ్ళి అక్కినేని నాగ్ చైతన్యతో 2017లో జరిగింది. 2021లో విడిపోయారు. 2015 లో రాజ్ వివాహం శ్యామలతో అయ్యింది. 2022లో విడిపోయారు. ఇవాళ రాజ్ మొదటి భార్య శ్యామల తన ఇష్టాగ్రామ్ లో "బరి తెగించిన వ్యక్తులు" అని పోస్ట్ చేసింది. రాజ్ నిడిమోరు తిరుపతి వాస్తవ్యులు. వెంకటేశ్వర యూనివర్సిటీ లో పిజి చేసి సినిమా రంగంలోకి వచ్చి 8 సినిమాలకు దర్శకుడుగా రచయితగా పని చేశారు. అతను తీసిన స్త్రీ సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇటీవల సమంత నిర్మించిన శుభం చిత్రానికి రాజ్ సహ నిర్మాతగా ఉన్నారు.

సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టడడంతో సమంత-రాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఈశా ఫౌండేషన్ ప్రకటన విడుదల చేసింది. అందులో వీరు భూత శుద్ధి వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. దీంతో ఈ వివాహ విధానం గురించి అందరూ వెతుకుతున్నారు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకను అనాదిగా వస్తున్న యోగ సంప్రదాయం ప్రకారం నిర్వహించారు. ఆలోచనలు, భావోద్వేగాలు లేదా భౌతికతకు అతీతంగా, దంపతుల మధ్య లోతైన బంధాన్ని ఏర్పరచడానికి రూపొందించిన విశిష్ఠమైన ప్రక్రియే ఈ ‘భూత శుద్ధి వివాహం’. లింగ భైరవి ఆలయాల్లో, ఎంపిక చేసిన ప్రదేశాల్లో నిర్వహించే ఈ వివాహ క్రతువు.. వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. వారి దాంపత్య ప్రయాణంలో సామరస్యం, శ్రేయస్సు, ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా దేవి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని ఈశా ఫౌండేషన్ తమ ప్రకటనలో వివరించింది. గతకొంతకాలంగా సమంత - రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే రాజ్‌తో సమంత క్లోజ్‌గా ఉన్న ఫొటోలను పంచుకున్నారు. దీంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. రాజ్- డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ‘ది ఫ్యామిలీమ్యాన్ సీజన్ 2’, ‘సిటడెల్: హనీ బన్నీ’లో సమంత నటించిన సంగతి తెలిసిందే. ఆయా ప్రాజెక్ట్‌ల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే రాజ్‌కు, ఆమెకు మధ్య స్నేహం ఏర్పడింది.
సమంత నిర్మించిన ‘శుభం’ చిత్రానికి రాజ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేశారు. ఆ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో వీరి ఫొటోలు వైరల్ అయ్యాయి. తాజాగా వివాహ ఫొటోలు ఆమె షేర్ చేయడంతో నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇటీవల సమంత తన జీవితంలో వచ్చిన మార్పుల గురించి పోస్ట్ పెట్టారు. ‘‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సమక్షంలో.. గత ఏడాదిన్నరగా నా కెరీర్‌లో సాహసోపేతమైన అడుగులు వేశా. రిస్క్ తీసుకున్నా. ముందుకు ఎలా వెళ్లాలో నేర్చుకున్నా. చిన్న విజయాలను ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నా. ప్రతిభావంతులైన, కష్టపడి పనిచేసే వారితో కలిసి వర్క్ చేస్తున్నందుకు కృతజ్ఞురాలిని. ఇది కేవలం ఆరంభమే’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఆమె రాజ్ నిడిమోరుతో ఉన్న ఫొటో పంచుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇంకా చదవండి: అఖండ2 ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం: హర్షాలి మల్హోత్రా గురించిన వివరాలు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




