సమంతకు చేదు అనుభవం - చీర కొంగు లాగిన ఆకతాయిలు
1 month ago | 5 Views
హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ శారీ షోరూమ్ ప్రారంభోత్సవానికి స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు హాజరయ్యారు . పెళ్లి తర్వాత ఆమె తెలంగాణలో హాజరైన మొదటి బహిరంగ కార్యక్రమం కావడంతో, ఆమెను చూసేందుకు అభిమానులు, జనాలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమం ముగించుకుని సమంత తన కారు వద్దకు వెళ్తున్న సమయంలో పరిస్థితి అదుపు తప్పింది. జనాలు ఒక్కసారిగా ఆమెపైకి దూసుకురావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఈ తోపులాటలో కొంతమంది ఆకతాయిలు సమంత చీర కొంగును లాగడంతో ఆమె అసౌకర్యానికి గురయ్యారు. సెక్యూరిటీ సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ, జనాలు అదుపుకాకపోవడంతో సమంత చాలా కస్టపడి తన కారులోకి చేరుకోగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు , అభిమానులు ఆకతాయిల ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల పట్ల కనీస మర్యాద లేకుండా జంతువుల్లా ప్రవర్తిస్తున్నారంటూ మండిపడుతున్నారు. ఇటీవల 'ది రాజా సాబ్' ఈవెంట్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్‌కు కూడా ఇలాంటి అనుభవమే ఎదురవగా, ఇప్పుడు సమంత విషయంలో కూడా అది పునరావృతం కావడం చర్చనీయాంశంగా మారింది.
ఇంకా చదవండి: యష్ ‘టాక్సిక్' నుంచి కియారా ఫస్ట్ లుక్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సమంత # సమంత రూత్ ప్రభు




