'పెద్ది' సినిమా కోసం నెవర్ బిఫోర్ అవతార్ లోకి రామ్ చరణ్
4 months ago | 5 Views
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'పెద్ది' కోసం తన బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో విజనరీ వెంకట సతీష్ కిలారు తన ప్రతిష్టాత్మక బ్యానర్ వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం కీలకమైన, లెన్తీ షెడ్యూల్ ప్రారంభం అయింది.
ఈ కీలకమైన ఫేజ్ కి ముందు రామ్ చరణ్ ఈ పాత్ర కోసం నెవర్ బిఫోర్ అవతార్ లోకి మారారు. పవర్‌ఫుల్ లుక్‌కి ఫిట్ అవడానికి ఫిజికల్ గా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. కంటిన్యూగా కసరత్తులు చేస్తూ, డెడికేషన్‌తో ఫిజిక్‌ను సాలిడ్ గా తీర్చిదిద్దుకున్నారు. జిమ్‌లో తీసిన ఫోటో చూస్తే... రగ్గ్డ్ బీర్డ్, ముడివేసి వేసిన జుట్టు, స్ట్రాంగ్ బాడీతో లుక్ అదిరిపోయింది. ఈ మార్పు కేవలం లుక్ కోసమే కాదు, పాత్రపై అతని అంకితభావానికి నిదర్శనం. గ్రీక్ గాడ్ లా కనిపిస్తున్న చరణ్ రెగ్యులర్ మోడ్ వదిలేసి బీస్ట్ మోడ్‌లోకి ఫుల్ గా మారిపోయారు. చరణ్ పుట్టిన రోజు మార్చి 27న విడుదల కానున్న పెద్ది, తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులలో ఒకటిగా ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు చరణ్ ఇంటెన్స్ ట్రైనింగ్ చేస్తుండడంతో, ఫ్యాన్స్ లో చాలా క్యురియాసిటీ నెలకొంది. ఈ చిత్రం నుంచి కన్నడ సూపర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవల అతని పుట్టినరోజున విడుదలైంది. ఈ చిత్రంలో జాన్వి కపూర్ కథానాయికగా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ ఆర్ రత్నవేలు డీవోపీగా పని చేస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత మాస్ట్రో ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. రామ్ చరణ్ పుట్టినరోజు మార్చి 27, 2026న ఈ చిత్రం విడుదల కానుంది.
నటీనటులు: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ
సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం: బుచ్చిబాబు సన, సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్
బ్యానర్: వృద్ధి సినిమాస్, నిర్మాత: వెంకట సతీష్ కిలారు, సంగీతం: ఏఆర్ రెహమాన్, డీవోపీ: ఆర్ రత్నవేలు
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.వై.ప్రవీణ్ కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్వో: వంశీ-శేఖర్
ఇంకా చదవండి: ధర్మం కోసం నిలబడే విల్లు... హరిహర వీరమల్లు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




