రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రంలో  'ప్రేమిస్తే' భరత్‌

రాజ్‌తరుణ్‌ ద్విభాషా చిత్రంలో 'ప్రేమిస్తే' భరత్‌

6 months ago | 5 Views

రఫ్ నోట్ ప్రొడక్షన్ పతాకంపై రాజ్‌ తరుణ్‌ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ద్విభాషా చిత్రంలో 'ప్రేమిస్తే' భరత్‌ కీలక పాత్రను పోషించనున్నాడు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ఇప్పటికే భారీ అంచనాలను క్రియేట్‌ చేస్తోంది. కాదల్, పట్టియల్, కాలిదాస్ వంటి చిత్రాలలో తన విభిన్న నటనతో పేరు తెచ్చుకున్న భరత్, ఈ సినిమాలో ఎమోషనల్‌ అండ్‌ ఎనర్జీ నండిన పాత్రను పోషిస్తున్నాడు. కథను ముందుకు నడిపించే కీలక పాత్రగా భరత్‌ కనిపించనున్న ఈ పాత్ర అందర్ని అలరించే విధంగా ఉంటుంది.


తమిళ ప్రేక్షకులతో పాటు, తెలుగులో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్‌ చేరికతో ఈ ద్విభాషా చిత్రానికి పాన్ సౌత్‌ ఇండియన్‌ రేంజ్‌ వచ్చినట్లు అయింది. దర్శకుడు విజయ్ మిల్టన్ మాట్లాడుతూ:“భరత్‌ ఎంతో నిబద్దత గల నటుడు. ఈ సినిమాలో ఆయన పోషిస్తున్న పాత్ర కథలో ఎంతో ఇంపార్టెంట్‌ పాత్ర. కథను మలుపు త్రిప్పే ఈ పాత్ర ఆయన కెరీర్‌కు కూడా ఎంతో ప్లస్‌ అయ్యే విధంగా ఉంటుంది. ఈ సినిమాలో ఇప్పటికే ఆసక్తికరమైన తారాగణం భాగమవుతోంది – నటుడు ఆరి తన కెరీర్‌లో తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించబోతుండగా, రాజ్ తరుణ్ తమిళంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే, సంగీత దర్శకుడు పాల్ డబ్బా నటుడిగా పరిచయమవుతున్నారు. ఇప్పుడు భరత్‌ చేరికతో ఈ కాంబినేషన్ మరింత బలపడింది. సామాజిక నేపథ్యం కలిగిన, గాఢమైన భావోద్వేగ కథనాన్ని అందించడంలో ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచే విజయ్ మిల్టన్‌ ఈ చిత్రంలో కూడా అదే స్థాయిని చూపించబోతున్నారని తెలుస్తోంది.

ఇంకా చదవండి:  ‘రుద్రమదేవి’ చిత్రానికి గద్దర్ అవార్డుని ప్రకటించడం ఎంతో ఆనందంగా, ప్రోత్సాహకరంగా ఉంది : దర్శక, నిర్మాత గుణ శేఖర్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రాజ్‌తరుణ్‌     # భరత్‌    

trending

View More