జూన్ 27న మరో మహాశివుని చిత్రం ‘చంద్రేశ్వర’ గ్రాండ్‌గా విడుదల

జూన్ 27న మరో మహాశివుని చిత్రం ‘చంద్రేశ్వర’ గ్రాండ్‌గా విడుదల

5 months ago | 5 Views

జూన్ 27న మరో శివుని చిత్రం విడుదల కాబోతోంది. ‘కన్నప్ప’తో పాటు మహాశివుడి బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకున్న చిత్రం ‘చంద్రేశ్వర’. ‘అదృశ్య ఖడ్గం’ అనేది ట్యాగ్‌లైన్. శివ బాలాజీ ఫిలింస్ పతాకంపై బేబీ అఖిల సమర్పణలో.. సురేష్ రవి, ఆశా వెంకటేష్ హీరో హీరోయిన్లుగా జీవి పెరుమాళ్ వర్ధన్ దర్శకత్వంలో డాక్టర్ రవీంద్ర చారి నిర్మించిన ఆర్కియాలజీ సస్పెన్స్ అండ్ హారర్ థ్రిల్లర్ చిత్రం ‘చంద్రేశ్వర’.

ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ సాంగ్స్ అన్నీ కూడా ట్రెమండస్ రెస్పాన్స్‌ను రాబట్టుకుని సినిమాపై భారీగా అంచనాలను పెంచేయగా, జూన్ 27న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత రవీంద్ర చారి మాట్లాడుతూ.. ‘‘శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అన్నట్లు ‘చంద్రేశ్వర’ మూవీతో నేను పరిశ్రమలోకి అడుగుపెడుతున్నాను. ఆర్కియాలజీ  నేపథ్యంలో ఎమోషన్స్‌తో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో మన పూర్వీకులు గొప్ప దేవాలయాలు నిర్మించారు. అప్పటి వారి జీనవ విధానం ఎలా ఉండేది? అనే అంశాలు ఆకట్టుకుంటాయి. ఆర్కియాలజీ బ్యాక్‌డ్రాప్‌లో ఇంత వరకు ఇలాంటి సినిమా రాలేదని గర్వంగా చెప్పగలం. ఈ సినిమాకు సంగీతం ప్రధాన హైలెట్‌గా ఉంటుంది. ఇందులో సాంగ్స్ అన్నీ అత్యద్భుతంగా వచ్చాయి.


‘ఈశ్వరా.. నా పరమేశ్వరా’, ‘అఖిల అఖిల’ డ్యూయెట్ సాంగ్, ‘నమస్తే చిదంబరం’ అనే సాంగ్.. ఇలా సాంగ్స్ అన్నీ వండర్‌ఫుల్‌గా వచ్చాయి. ప్రస్తుతం ఈ పాటలు ట్రెండ్ అవుతున్నాయి. సినిమా కూడా సస్పెన్స్‌, హారర్ అంశాలతో అత్యద్భుతంగా వచ్చింది. ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. ఈ వారంలో రెండు భక్తి సినిమాలు ఒకటి ‘కన్నప్ప’, రెండు ‘చంద్రేశ్వర’ పోటాపోటీగా విడుదలవుతున్నాయి. ఈ రెండు సినిమాలు బ్రహ్మాండమైన విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాము. దర్శకుడు అద్భుతంగా ఈ సినిమాను రూపొందించారు. చివరి నిమిషం వరకు ఈ సినిమా అత్యంత ఉత్కంఠ భరితంగా ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. ఎటువంటి అశ్లీలత ఇందులో ఉండదు. సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు తరలివచ్చి బ్రహ్మాండమైన సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాము. ఈ జర్నీలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’’ అని తెలిపారు. 

సురేష్ రవి, ఆశ వెంకటేష్, నిలగల్ రవి, బోసే వెంకట్, అడుకులం మురుగదాస్ గజరాజ్, జె ఎస్ కే గోపి, తదితరులు నటించిన ఈ చిత్రానికి 

సంగీతం: జెరాడ్ ఫిలిక్స్, 

డిఓపి: ఆర్వి సీయోన్ ముత్తు, 

సింగర్స్: సాయి చరణ్, 

లిరిక్స్: వెంకట్, జ్యోతి, 

డిటిఎస్: శ్యామ్, 

ఎడిటర్: నందమూరి హరి, 

పిఆర్వో: బి. వీరబాబు, 

కో ప్రొడ్యూసర్ పి.సరిత, వి. బాలకృష్ణ,

ప్రొడ్యూసర్: డాక్టర్ రవీంద్ర చారి, 

డైరెక్టర్: జీవి పెరుమాళ్ వర్ధన్

ఇంకా చదవండి: ఘనంగా అర్జున్ అంబటి 'పరమపద సోపానం' టీజర్ లాంచ్ వేడుక
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# చంద్రేశ్వర     # శివ బాలాజీ    

trending

View More