నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ అవార్డు

నందమూరి బాలకృష్ణకు ఎన్టీఆర్ అవార్డు

6 months ago | 5 Views

* విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు 

* తెలంగాణ గద్దర్ సినిమా పదేళ్ల పురస్కారాలు


మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు.  ఒక్కటే టార్గెట్ సినీ ఇండస్ట్రీ అంతా గద్దర్ పురస్కారాల ప్రదానోత్సవంలో కనిపించాలి...  అంతే, జ్యూరీ సినిమాలు చూడకుండానే గత పదేళ్లు 30 సినిమాలను ఎంపిక చేసి పడేసారు.  నీకు నీకు నీకు అంతే! గతంతో పోల్చుకుంటే బహుమతుల నగదు కూడా భారీగా పెంచేసారు. కోటిన్నర పైగా నగదు పురస్కారాల బహుమతులకే ఖర్చు చేస్తున్నారు. హైటెక్స్ నాలుగో హాలుకు పది లక్షలు రెంట్.  జూన్ 14న అట్టహాసంగా తెలంగాణ గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరగనున్నది. మొత్తానికి మూడు కోట్ల రూపాయల సినీ సంబరం ఇది. 

విజేతల  వివరాలివిగో... ఎన్టీఆర్ అవార్డు : పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ, కాంతారావు అవార్డు : విజయ్ దేవరకొండ, రఘుపతి వెంకయ్య అవార్డు : యండమూరి వీరేంద్రనాథ్, పైడి జయరాజ్ అవార్డు: మణిరత్నం, బి.యన్.రెడ్డి అవార్డు : సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి అవార్డు : అట్లూరి పూర్ణచంద్రరావు.  2014 నుంచి 2023 వరకు సంవత్సరానికి మూడు ఉత్తమ సినిమాలను మురళీమోహన్ అధ్యక్షతన ఎంపిక చేశారు. 

2014 : రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శ్రీను, 2015 : రుద్రమదేవి, కంచె, శ్రీమంతుడు, 2016 : శతమానం భవతి, పెళ్ళి చూపులు, 

జనతా గ్యారేజ్, 2017 : బాహుబలి 2, ఫిదా, ఘాజీ, 2018 : మహానటి, రంగస్థలం, కేరాఫ్ కంచరపాలెం, 2019 : మహర్షి, జెర్సీ, మల్లేశం

2020 : అల వైకుంఠ పురంలో, కలర్ ఫోటో,  మిడిల్ క్లాస్ మెలోడీస్, 2021 : RRR, అఖండ, ఉప్పెన, 2022 : సీతారామం, కార్తికేయ 2, మేజర్, 2023 : బలగం, హనుమాన్, భగవంత్ కేసరి, సంతోషకరమైన విషయం ఒక్కటే..  గత 12 ఏళ్లుగా నంది పురస్కారాలు లేవు..  రేవంత్ రెడ్డి నందిని మార్చి గద్దర్ పేరిట సినిమా అవార్డులు ఇవ్వడం సంతోషించదగిన విశేషమే!
ఇంకా చదవండి: అత్యంత వైభవంగా కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# గద్దర్ ఫిల్మ్ అవార్డ్     # బాలకృష్ణ    

trending

View More