మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'రన్ ఫర్ యూనిటీ.

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన 'రన్ ఫర్ యూనిటీ.

1 month ago | 5 Views

భారతదేశ ఉక్కు మనిషి, అఖండ భారత్ నిర్మాత సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా ' (జాతీయ ఐక్యతా దినోత్సవం)గా జరుపుకుంటున్న సందర్భంగా, హైదరాబాద్ సిటీ పోలీస్లు ఈరోజు (31.10.2025) ఉదయం 'రన్ ఫర్ యూనిటీ' ని ఘనంగా నిర్వహించారు.

ఈ రన్ ముఖ్యంగా పీపుల్స్ ప్లాజా, నెక్లెస్ రోడ్, హైదరాబాద్‌తో పాటు సిటీ పోలీస్ పరిధిలోని ఏడు జోన్లలో ఘనంగా నిర్వహించారు. భారతదేశ రాజకీయ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన అద్భుతమైన కృషిని స్ఫూర్తిగా తీసుకుని, దేశ సమైక్యత, సమగ్రత మరియు భద్రతకు కట్టుబడి ఉన్నామని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటి చెప్పడం జరిగింది. ఈ 'రన్ ఫర్ యూనిటీ' లో సుమారు 5000 మంది పౌరులు, రన్నర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి మెగాస్టార్ శ్రీ కొణిదెల చిరంజీవి గారు ముఖ్య అతిథి, మరియు శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్,  తెలంగాణ) లు హాజరయ్యారు. వీరితో పాటు శ్రీ. సందీప్ శాండిల్య (రిటైర్డ్ ఐపిఎస్, డైరెక్టర్ ఈగల్), శ్రీ. యం.యం. భగవత్ ఐపిఎస్, (అడిషినల్ డిజిపి ఎల్. అండ్ ఓ తెలంగాణ), శ్రీ వి.సి. సజ్జనార్ (కమిషనర్ ఆఫ్ పోలీస్, హైదరాబాద్), శ్రీ. తఫ్సీర్ ఇకుబాల్ ఐపిఎస్( జాయింట్ సిపి లా ఆండ్ ఆర్డర్), శ్రీ. డి. జోయల్ డెవిస్ ఐపిఎస్( జాయింట్ సిపి ట్రాఫిక్), శ్రీమతి కె. శిల్పావళ్ళి ఐపిఎస్( డిసిపి సెంట్రల్ జోన్), శ్రీమతి కె. అపూర్వారావు ఐపిఎస్( డిసిపి స్పెషల్ బ్రాంచ్), శ్రీమతి ధార కవిత (డిసిపి, సైబర్ క్రైమ్), శ్రీమతి లావణ్య నాయక్ జాదవ్ (డిసిపి, వుమెన్ సేఫ్టీ) మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ: గుడ్ మార్నింగ్, చాలా ఉత్సాహభరితంగా సాగబోతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడానికి కారణం రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి గారు, అలాగే నా స్నేహితులు ఈ కార్యక్రమం దగ్గరుండి చూసుకో చూసుకుంటున్న సజ్జనార్ గారు అలాగే సెక్రటరీ సహా ఇతర ప్రభుత్వ అధికారులు అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఏక్తా దివస్ కార్యక్రమం మన ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు జరుపుకోవడం అనేది, అటువంటి మహానుభావుడికి మనం గౌరవ సూచికంగా ఇస్తున్న ఘనమైన నివాళి అని భావిస్తున్నాను.  హాట్సాఫ్, ఈ కార్యక్రమాన్ని ఎవరు తలపెట్టారో వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను..  "సర్దార్ వల్లభాయ్ పటేల్ ధృడ సంకల్పం, ఆయన విజన్, కార్యదీక్షత, ధైర్యం... ఇవన్నీ మనకు ఆదర్శనీయం. అటువంటి మహానుభావుడి జయంతి రోజున 'ఏక్తా దివస్' నిర్వహించడం ఆయనకు మనం ఇస్తున్న గొప్ప గౌరవం." "560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. మన దేశం 'వన్ నేషన్'గా ఉందంటే అది పటేల్ గారు మనకు అందించిన ఒక గొప్ప వరం. ఈ మహత్తర కృషికి మనం ఆయనకు ఎప్పుడూ కృతజ్ఞతతో ఉండాలి. ఇలా మనందరినీ ఒకటిగా చేసినందుకు ఆయనకు కృతజ్ఞతతో ఉండాలి. మేమందరం ఒకటే అని చెప్పడానికి ఇలా నివాళులర్పించడం అనేది ఒక గొప్ప  కార్యక్రమం. ఆయన ఇచ్చిన 'యూనిటీ ఇన్ డైవర్సిటీ' (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇలా ఒక ర్యాలీ చేయడం ఇప్పుడున్న యువతకు, భావితరాలకు గొప్ప ప్రేరణ.  "హైదరాబాద్‌లో ఈ కార్యక్రమాన్ని పోలీసు డిపార్ట్‌మెంట్ నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఎవరు తలపెట్టారో వారికి, ముఖ్యంగా రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి గారికి, సీపీ సజ్జనర్ గారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి కార్యక్రమాలు తరచూ చేయాలని ఆశిస్తున్నాను." చివరగా, చిరంజీవి గారు ఈ కార్యక్రమంలో భాగం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్రం మొత్తం తలతిప్పి చూసేలా గొప్పగా నిర్వహించారని పోలీసు బృందాన్ని ప్రశంసించారు. ఈ 2K రన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా పాల్గొనడం విశేషం.

శ్రీ బి. శివధర్ రెడ్డి, ఐపీఎస్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP), తెలంగాణ గారు మాట్లాడుతూ: ఇది కేవలం 'పరుగు' మాత్రమే కాదు, అందరూ జాతీయ ఐక్యత కోసం స్ఫూర్తిగా తీసుకోవాల్సిన కార్యక్రమం. సర్దార్ వల్లభాయ్ పటేల్ తన పట్టుదలతో 560కు పైగా ముక్కలైన సంస్థానాలను ఏకతాటిపైకి తెచ్చి దేశాన్ని బలోపేతం చేశారని కొనియాడారు. 

శ్రీ వి.సి. సజ్జనార్, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్ , హైదరాబాద్ గారు మాట్లాడుతూ: యవత సర్దార్ వల్లభాయ్ పటేల్ ను ఆదర్శంగా తీసుకుని మంచి సమాజ నిర్మాణం కోసం పాటుపడాలని తెలిపారు. సైబర్ నేరాల విషయంలో ప్రజలు ఆందోళన చెందవద్దు. ముఖ్యంగా, 'డీప్ ఫేక్' అంశాన్ని సీరియస్‌గా తీసుకుని సైబర్ నేరస్థుల మూలాలపై దృష్టి సారించాము. పిల్లలు 5,000 ,10,000 కోసం సైబర్ నేరస్థులకు మ్యూల్ అకౌంట్స్ ఇవ్వడం వల్ల వారు చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

ఈ కార్యక్రమములో హైదరాబాదు సిటీ పోలీసు అధికారులు మరియు సిబ్బంది అందరు పాల్గోన్నారు.
ఇంకా చదవండి: మాస్ అంశాలతో కూడిన ఓ వినూత్న చిత్రం 'మాస్ జాతర' : చిత్ర దర్శకుడు భాను భోగవరపు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# హైదరాబాద్‌     # కృష్ణమ్మ    

trending

View More