కర్నాటకలో 'థగ్‌ లైఫ్‌' విడుదలకు లైన్‌ క్లీయర్‌సుప్రీంకోర్టులో ఊరట

కర్నాటకలో 'థగ్‌ లైఫ్‌' విడుదలకు లైన్‌ క్లీయర్‌సుప్రీంకోర్టులో ఊరట

5 months ago | 5 Views

'థగ్‌ లైఫ్‌’ చిత్ర బృందానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కమల్‌హాసన్‌ నటించిన ఈ సినిమా కర్ణాటకలోనూ విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కన్నడ భాషపై కమల్‌ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో ఈ సినిమాను కర్ణాటకలో నిషేధించిన సంగతి తెలిసిందే.

దీనిపై చిత్రబృందం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ మేరకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమల్‌హాసన్‌ చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలను సుప్రీం హెచ్చరించింది. అలాంటి బెదిరింపులు చట్టబద్ధం కాదన్న అత్యున్నత న్యాయస్థానం.. థియేటర్‌లలో ఏది ప్రదర్శించాలో నిర్ణయించే అధికారం ఆ సంఘాలకు లేదని స్పష్టంచేసింది. ఎవరైనా ఒక ప్రకటన చేసినప్పుడు దాన్ని మరో కామెంట్‌తో ప్రతిఘటించే స్వేచ్ఛ ఉంది కానీ.. థియేటర్‌లు తగలబెడతామని బెదిరించే అధికారం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యనించింది.

కర్ణాటకలో థగ్ లైఫ్ విడుదలకు లైన్ క్లియర్ - Navatelangana

కర్ణాటక ప్రజలు కమల్‌హాసన్‌తో విభేదించే స్వేచ్ఛను కలిగిఉన్నారని.. అదే సమయంలో ప్రాథమిక హక్కులను కూడా కాపాడాలని కోర్టు పేర్కొంది. ఒక సినిమాకు సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత దాన్ని విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. దాన్ని చూడాలా, వద్దా అనే అధికారం పూర్తిగా ప్రజలకు ఉంటుందని.. బెదిరింపుల ఆధారంగా సినిమాను ఆపకూడదని స్పష్టంచేసింది.చిత్ర నిర్మాతలు దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నుంచి తనకు బదిలీ చేసుకున్న సుప్రీంకోర్టు.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందనను తెలియ జేయాలని ఆదేశించింది. ఈ విషయంలో నటుడు క్షమాపణలు చెప్పాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
ఇంకా చదవండి: మంచులక్ష్మిని ఎకిపారేస్తున్న నెటిజన్లు!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# థగ్‌ లైఫ్‌     # కమల్‌హాసన్‌    

trending

View More