ఆరేళ్ల సక్సెస్ ఫుల్ కెరీర్ కంప్లీట్ చేసుకున్న ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం
5 days ago | 5 Views
సినిమా పరిశ్రమలో మనల్ని ఎదగనివ్వరు, అది వారసులదే అని ప్రచారం చేస్తుంటారు కొందరు. అది పట్టుదలగా ప్రయత్నించని వారి సాకు మాత్రమేనని కిరణ్ అబ్బవరం లాంటి ఔట్ సైడర్స్ తమ సక్సెస్ తో ప్రూవ్ చేస్తుంటారు. షార్ట్ ఫిలింస్ నుంచి కెరీర్ మొదలుపెట్టి ఒక్కో సినిమాతో ఎదుగుతూ ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం..నేటితో సక్సెస్ ఫుల్ గా ఆరేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుకున్నారు. ఏ సపోర్ట్ లేకుండా ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చేవారికి ఆయన జర్నీ ఒక ఇన్సిపిరేషన్. టాలెంట్ ఉన్నవాళ్లదే ఇండస్ట్రీ అని చెప్పే ఒక కేస్ స్టడీ. కిరణ్ అబ్బవరం మొదటి సినిమా రాజావారు రాణిగారు 2019, నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అప్పటికి ఎవరికీ తెలియని హీరో కాబట్టి ఓపెనింగ్స్ లేవు. కానీ పాజిటివ్ మౌత్ టాక్ తో థియేటర్స్ లో ఊపందుకుని ఘన విజయాన్ని దక్కించుకుంది. ఈ సక్సెస్ ను ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమా కొనసాగిస్తూ హీరోగా కిరణ్ అబ్బవరం ఇండస్ట్రీలో వెనక్కి తిరిగిచూడకుండా చేసింది.
రాజావారు రాణిగారు, ఎస్ఆర్ కల్యాణమండపం, సెబాస్టియన్ పి.సి.524, సమ్మతమే, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణుకథ, మీటర్, రూల్స్ రంజన్, క, దిల్ రూబా, కె- ర్యాంప్..ఇలా ఆరేళ్లలో 11 చిత్రాల్లో నటించారు కిరణ్ అబ్బవరం. అందులో సూపర్ హిట్స్ ఉన్నాయి, హిట్స్ ఉన్నాయి, యావరేజ్ లు ఉన్నాయి. ఫ్లాప్ లూ ఉన్నాయి. స్వీట్, బిటర్ ఎక్సిపీరియన్స్ లు ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయాలనే తన ప్రయత్నంలో లోపం లేదు. కథల ఎంపికలో తప్పు జరిగితే ఓపెన్ గా ఒప్పుకుని ఇకపై నిరాశపర్చను అని చెప్పగలిగే గట్స్ ఉన్న హీరో కిరణ్ అబ్బవరం. గతంలో స్టోరీ సెలెక్షన్ లో చేసిన మిస్టేక్స్ ఇ"క" జరగవని ప్రూవ్ చేస్తూ "క", "కె ర్యాంప్" తో రెండు దీపావళి పండుగలకు వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు కిరణ్. ఈ రెండు చిత్రాలు హెవీ కాంపిటీషన్ లో రిలీజై దీపావళి విన్నర్స్ గా నిలవడం విశేషం.
ప్రేక్షకులు, అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారీ యంగ్ హీరో. ఆయన లైనప్ లో ఉన్న చెన్నై లవ్ స్టోరీ మూవీ ఇప్పటికే మూవీ లవర్స్ లో బజ్ క్రియేట్ చేస్తోంది. తను నడిచివచ్చిన దారిని మర్చిపోని కిరణ్... ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్న యంగ్ టాలెంట్ కు తన వంతు హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేశారు. తన కెరీర్ లో మాగ్జిమమ్ కొత్త దర్శకులను పరిచయం చేయడం కిరణ్ ప్రత్యేకత. కేఏ ప్రొడక్షన్స్ లో కొత్త వాళ్లకు అవకాశం కల్పిస్తూ "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాను నిర్మిస్తున్నారు. కొత్త వాళ్లకు సపోర్ట్ చేస్తూ, ఇండస్ట్రీకి న్యూ ఏజ్ సినిమాలు కాంట్రిబ్యూట్ చేస్తూ హీరోగా, ప్రొడ్యూసర్ గా తన కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్నారు కిరణ్ అబ్బవరం.
ఇంకా చదవండి: ‘అఖండ 2’ ప్రీరిలీజ్ లో నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కిరణ్ అబ్బవరం # K-ర్యాంప్




