'కన్నప్ప' హీరోయిన్ అందాల ఆరబోత
5 months ago | 5 Views
టాలీవుడ్‌ను కొత్త అందాలు పలకరిస్తున్నాయి. కొత్త హీరోయిన్స్ చాలా మంది తమ అందంతో నటనతో ఆకట్టుకుంటున్నారు. అలా టాలీవుడ్ కు పరిచయమైన భామే ప్రీతి ముకుందన్. ఈ చిన్నది ఇటీవలే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలో నటిస్తుంది. ప్రీతి ముకుందన్ టీవీ షోలో నృత్య ప్రదర్శనలతో తన కెరీర్ ను ప్రారంభించింది. అందాల భామ ప్రీతి ముకుందన్ మొదటి మ్యూజిక్ ఆల్బమ్ ‘ముత్తు ము2’ యూట్యూబ్ లో 4.2 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి పేరొందినది.

ఆ తర్వాత ఈ చిన్నదానికి సినిమా ఆఫర్స్ వచ్చాయి. శ్రీవిష్ణు సరసన ‘ఓం భీమ్ బుష్’ సినిమాతో హీరోయిన్ గా మారింది.‘ఓం భీమ్ బుష్’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్ అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు 'కన్నప్ప' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంచు విష్ణు తెరకెక్కిస్తున్న 'కన్నప్ప' సినిమాతో మరోసారి ప్రేక్షకులను కవ్వించనుంది. కన్నప్ప సినిమా పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొన్నామధ్య కన్నప్ప సినిమాలో నెమలి పాత్రలో ప్రీతి ముకుందన్ నటిస్తుందని అనౌన్స్ చేస్తూ ఓ అందమైన పోస్టర్ వదిలారు. సోషల్ మీడియాలో అందాల ఆరబోతతో కుర్రాళ్లకు నిద్రపట్టకుండా చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు చుస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. ఈ ఫొటోలకు కుర్రాళ్ళు రొమాంటిక్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: న్యూలుక్‌తో అలరిస్తున్న శివానీ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




