సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని కుటుంబం నుంచి హీరోయిన్‌గా జాన్వి ఘట్టమనేని ఎంట్రీ
1 month ago | 5 Views
సూపర్‌స్టార్ కృష్ణ ఘట్టమనేని వారసత్వం తెలుగు సినీ పరిశ్రమలో విశిష్టమైనది. ఇప్పుడు ఘట్టమనేని లెగసీ నుంచి తొలిసారిగా హీరోయిన్‌గా వెలుగులోకి రానున్నది జాన్వి ఘట్టమనేని. ఆమె తన తాత కృష్ణగారి గ్రేస్, తన మామ మహేష్ బాబు గారి మాగ్నటిజం, తల్లి మంజుల ఘట్టమనేని గారి ఆత్మీయతను తనలో కలుపుకుని గొప్ప వ్యక్తిత్వంగా రూపుదిద్దుకుంది. జాన్వి ఘట్టమనేని క్లాసిక్ బ్యూటీ. ఇటీవల వెలుగుచూసిన ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన తెచ్చుకున్నాయి. ఇండస్ట్రీ వర్గాలు ఆమెను “ఇటీవలి తెరపై కనిపించే అత్యంత అందమైన అమ్మాయి' గా అభివర్ణిస్తున్నాయి. జాన్వి ఎటువంటి హడావుడి లేకుండా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. కొన్ని ఫొటోలు, కొన్ని టెస్ట్ రీల్స్ ద్వారానే తన చార్మ్ చూపించింది. దర్శకులు ఆమె నటనను చూసి “మాటలకన్నా కళ్ళతోనే భావాలను చెప్పగల సహజ నటిగా” వర్ణించారు. ఆమె ప్రతిభతో పాటు క్రమశిక్షణ కూడా ప్రత్యేకం. పెయింటింగ్, డ్యాన్స్, ఫిట్‌నెస్, డ్రైవింగ్, గేమింగ్ ప్రతి విషయంలోనూ సమాన ఆసక్తి చూపిస్తుంది. జిమ్‌లో ట్రైనింగ్ తో మొదలై తన డే, నైట్ తన ఆర్ట్ కార్నర్‌లో ముగుస్తుంది. కొత్తగా సినీ రంగంలోకి వచ్చే వాళ్లు సాధారణంగా ఒకే గుణంతో గుర్తింపుపొందుతారు. కానీ జాన్వి ఘట్టమనేని మాత్రం అందం, మాధుర్యం, ప్రతిభ, వారసత్వం.. ఈ నాలుగింటినీ కలగలిపిన ప్రత్యేక వ్యక్తిత్వం. బ్రాండ్ నిపుణులు ఆమెను “దక్షిణాది శైలి, పాన్-ఇండియా అప్పీల్ కలిగిన పేస్” అని పేర్కొంటున్నారు. సూపర్ స్టార్ కృష్ణగారు, మహేష్ బాబు కుటుంబం నుండి వస్తున్న జాన్వి ఎంట్రీ ఒక విధంగా విధి నెరవేరుతున్న క్షణం. జాన్వి సంప్రదాయ లుక్ నుంచి మోడరన్ గ్లామర్ వరకు సునాయాసంగా మెరిసిపోతుంది. ఇంకా సినిమా రిలీజ్ కాకముందే ఆమెకు గుర్తింపు వచ్చేసింది.
ఒక అద్భుతమైన జ్యువెలరీ క్యాంపెయిన్ తర్వాత, జాతీయ స్థాయి బ్రాండ్లు, దర్శకులు ఆమెను సంప్రదించారు. నిర్మాతలు ఆమెను “ దశాబ్దంలో ఒక్కసారి దొరికే ఆర్టిస్ట్, మాట్లాడకముందే స్క్రీన్‌ను ఆక్రమించే ప్రెజెన్స్” అని చెబుతున్నారు. యాక్టింగ్ ట్రైనింగ్స్, డాన్స్ రిహార్సల్స్, ఫిట్‌నెస్ సెషన్‌లతో ఆమె షెడ్యూల్ ఇప్పటికే ఒక స్టార్ లా వుంటుంది. సినిమా కుటుంబంలో పుట్టినా, ఆమె నటనపై ఉన్న ప్రేమ మాత్రం వారసత్వం కాదు .. సహజ స్వభావం. పదేళ్ల వయసులోనే తల్లి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన మనసుకు నచ్చింది సినిమాలో కెమెరా ముందుకొచ్చిన జాన్వి తన సహజమైన నటనతో అందరినీ ఆశ్చర్యపరిచింది. అప్పటి నుంచి ఆమె నటన, నృత్యం నేర్చుకుంటూ తన ప్రతిభను నైపుణ్యంగా మార్చుకుంది. ఆమె నటించదు, ఫీల్ అవుతుంది. మంజులకి ఇది ప్రత్యేకమైన క్షణం. ఎన్నేళ్ల క్రితం ఆమెకూ నటనపై కలలు ఉండేవి, కానీ ఆ కాలం మహిళలకు అంత అనుకూలంగా ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ప్రపంచం సిద్ధంగా ఉంది, ప్రేమతో ఉంది, ఎదురుచూస్తోంది. “నన్ను అడ్డుకున్న వారే ఇప్పుడు జాన్వి కోసం ప్రార్థిస్తున్నారు. జాన్వి చిరునవ్వు నా ప్రార్థనలకు సమాధానం” అన్నారు మంజుల. జాన్వి ఎదుగుదలతో ఫ్యామిలీ కొత్త అర్ధం సంతరించుకుంది. అడ్డంకులనుంచి ఆమోదం వైపు, నిశ్శబ్దం నుంచి గౌరవం వైపు. “మేము మారాం, మేము అర్థం చేసుకున్నాం, ఇప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తున్నాం” అని తెలుగు ప్రేక్షకులు చెబుతున్నారు. ఘట్టమనేని వారసత్వం, వ్యక్తిత్వం, సంప్రదాయం, ఆధునికత, ఆకర్షణ కు ప్రతిరూపం జాన్వి. జాన్వి ఘట్టమనేని.. వెండితెర ఎదురుచూస్తున్న సరికొత్త స్టార్.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# కృష్ణ # జాన్వి ఘట్టమనేని




