ఆన్-స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్న జాన్వి స్వరూప్ ఘట్టమనేని

ఆన్-స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్న జాన్వి స్వరూప్ ఘట్టమనేని

25 days ago | 5 Views

దక్షిణ భారత సాంస్కృతి సంప్రదాయం, సృజనాత్మకత కలగలిపిన కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ తన తాజా క్యాంపెయిన్‌  లాంచ్ చేసింది. ఈ కొత్త క్యాంపెయిన్‌ లో ఆభరణాల అందానికి జీవం పోసిన జాన్వి స్వరూప్ ఘట్టమనేని తన ఫస్ట్ ఆన్-స్క్రీన్ ప్రజెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. నటి–దర్శకురాలు మంజుల ఘట్టమనేని కుమార్తెగా, సూపర్ స్టార్ కృష్ణ గారి మనవరాలిగా జాన్వి కళాత్మక వారసత్వానికి ప్రతీక. ఆత్మవిశ్వాసంతో, అభిరుచితో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఆమె ప్రజెన్స్ ప్రత్యేకంగా నిలిచింది. బ్రాండ్‌ క్రియేటివ్ టీమ్ మొదట జాన్వి ఫోటోలు సోషల్ మీడియాలో చూసిన వెంటనే  మెస్మరైజ్ అయ్యారు. కౌశిక్ గోల్డ్ & డైమండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కునాల్ మాట్లాడుతూ.. జాన్వి లో ఒక క్లాసిక్ టచ్, డిజైన్ చేయలేని ఒక అరుదైన బ్యూటీ ,అథెంటిసిటీ వుంది. ఆమెను మొదటిసారి పరిచయం చేసే గౌరవం మాకు దక్కడం ఆనందంగా ఉంది. ఇది డెస్టినీ మాకే అప్పగించిన అవకాశంలాగా అనిపించింది. జాన్వి మా బ్రాండ్‌ విలువలన్నింటినీ ప్రతిబింబిస్తుంది.”


సినిమాటిక్ స్టయిల్ లో అద్భుతంగా తెరకెక్కిన ఈ యాడ్ ఫిలింలో జాన్వి, కౌశిక్ ఆభరణాలతో మెరిసిపోతుంది. ప్రతి ఆభరణం ఒక కథ చెబుతుంది, ప్రతి ఫ్రేమ్ భావోద్వేగంతో వెలుగుతుంది. బ్రైడల్,  డైమండ్ కలెక్షన్‌లలో ఆమె అలంకరించుకున్న తీరు కెమెరా కోసం పుట్టిన స్టార్ లా సహజమైన సొగసుతో ఆకట్టుకుంది. ఈ ఫిలిం కేవలం ఆభరణాల గురించి మాత్రమే కాదు.. భావోద్వేగాల గురించి కూడా. ఒక మహిళ తనను తాను ఆభరణాలతో కాకుండా, ఆత్మవిశ్వాసంతో అలంకరించుకునే ఆ క్షణాన్ని ఇది ప్రజెంట్ చేస్తోంది. అద్భుతమైనరంగులు, శాశ్వతమైన స్వరాలు, గ్రేట్ విజువల్స్ ద్వారా ఈ క్యాంపెయిన్ నిజమైన అందం మనసులోంచే వెలుగుతుందనే కౌశిక్ ఫిలాసఫీని ప్రతిబింబిస్తుంది.యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ ఎస్‌.ఎల్‌.ఎన్‌. రాజేష్  మాట్లాడుతూ.. ఈ  యాడ్ ఫిల్మ్ కవితలా అనిపించింది. జాన్వి ఆ కవిత్వానికి జీవం పోసింది. ఆమె నటించదు.. ఆ పాత్రగా మారిపోతుంది. ఆమె ప్రజెన్స్ సెట్లో ఒక ప్రశాంతమైన శక్తిని, ప్రకాశాన్ని నింపింది. ఈ కొలాబరేషన్ శుద్ధత, నాణ్యతలపై నిర్మితమైన కౌశిక్ గోల్డ్ అండ్ డైమండ్స్ , కళ, హృదయంతో రూపుదిద్దుకున్న ఘట్టమనేని కుటుంబం.. రెండు చిరస్థాయి వారసత్వాల కలయికకు గుర్తుగా నిలిచింది. కౌశిక్ గోల్డ్ ఎప్పుడూ తెలుగు నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది, జాన్వి  అందం, విలువలతో నిలిచి ఈ జనరేషన్ బెస్ట్ ని ప్రతిబింబిస్తుంది అని ఈ ప్రాజెక్ట్‌తో అనుబంధమైన సీనియర్ బ్రాండ్ కన్సల్టెంట్ తెలిపారు. జాన్వి కోసం ఈకాంపైయన్  వృత్తిపరంగా వ్యక్తిగతంగా ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. జాన్వి మాట్లాడుతూ.. “ఈ సహకారం నాకు చాలా ప్రత్యేకం. కౌశిక్ జ్యువెలరీలో ఒక సొంతదనం, ఒక ఆత్మీయత ఉంది. వారి డిజైన్లు సంప్రదాయాన్ని, ఆధునికతను ప్రతిబింబిస్తాయి.  జాన్వి తల్లి మంజుల ఘట్టమనేని, తన కుమార్తె సినిమా, గ్లామర్ ప్రపంచంలో మొదటి అడుగు వేస్తున్న క్షణాన్ని చూసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇది ఒక అద్భుతమైన క్షణం. కౌశిక్ గోల్డ్ ఆమె అందాన్ని, ఆత్మను అద్భుతంగా ప్రజెంట్ చేసింది. ఇంత అందంగా, అంతరంగానికి దగ్గరగా ఉండే ప్రాజెక్ట్‌లో ఆమె కనిపించిన తీరు చూసి ఒక తల్లి కల మరోసారి సాకారమైనట్టుంది.
ఇంకా చదవండి: ‘ది గర్ల్ ఫ్రెండ్’ చిత్రం మహిళల హృదయాలను తాకింది – నిర్మాత అల్లు అరవింద్ సంతోషం వ్యక్తం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# కౌశిక్ గోల్డ్     # జాన్వి    

trending

View More