ఇషా చావ్లా మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధం!
5 days ago | 5 Views
ఎన్నో ఆశలు.. ఆశయాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామలు కొన్ని సినిమాలతోనే క్రేజ్ సొంతం చేసుకొని ఆ తర్వాత అడ్రస్ లేకుండా ఇండస్ట్రీలో మాయమవుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ సినిమాలతో క్రేజ్ తెచ్చుకొని ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయిన వారూ ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెబితే.. మరికొంతమంది క్రేజ్ తగ్గి ఇక లాభం లేదనుకొని నిరాశతో సినిమాలకు బై బై చెప్పేశారు. కొందరైతే పరిశ్రమను విడిచిపెట్టలేక సహాయక పాత్రలు చేసుకుంటూ ఎలాగో అలా కెరీర్ ని నెట్టుకొస్తున్నారు. మరికొంతమంది మాత్రం అక్క, వదిన లాంటి పాత్రలు చేస్తూ కెరీర్ ని నెట్టుకొస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హీరోయిన్ కూడా ఒకానొక సమయంలో వరుస సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. 2016వరకు సినిమాలు చేసిన ఆమె సడన్ గా సినిమాల నుంచి మాయమైంది. ఎక్కడ వెతికినా కనిపించలేదు. తీరా చూస్తే రివ్వుమంటూ తాజాగా రీ ఎంట్రీకి సిద్ధమైంది. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు.. ఒకప్పుడు తన కొరకొర చూపులతో కుర్రాళ్లను కవ్వించిన అందాల భామ ఇషా చావ్లా. 'ప్రేమ కావాలి' అనే సినిమాతో వెండితెరకు హీరోయిన్ గా పరిచయమయింది.
తొలి సినిమా 'ప్రేమ కావాలి' హిట్ కావడంతో ఇషాకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో క్లిక్ అయ్యింది. దీంతో ఆ తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వెల్లువలా వచ్చిపడ్డాయి. ప్రేమ కావాలి (2011), పూల రంగడు, శ్రీమన్నారాయణ (2012), మిస్టర్ పెళ్ళికొడుకు (2013), జంప్ జిలాని (2014), విరాట్ (2016-కన్నడ) ఇలా మొత్తం ఐదు తెలుగు, ఒక కన్నడ సినిమాలో త వైవిధ్యమైన క్యారెక్టర్స్ ద్వారా ఎంతగానో అలరించింది. అయితే.. 'ప్రేమ కావాలి' తర్వాత ఆ స్థాయిలో మరో హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఫలితంగా ఈ బ్యూటీకి ఆఫర్స్ తగ్గిపోయాయి. చాలా కాలం పాటు సినిమాలకు బ్రేక్ తీసుకున్న ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీకి సిద్ధమైంది. అదీ.. మెగాస్టార్ సినిమాలో. వివరాల్లోకి వెళితే.. చిరంజీవి హీరోగా నటిస్తున్న 'విశ్వంభర' సినిమాతో ఈ ముద్దుగుమ్మ రీఎంట్రీ ఇస్తుంది. 2014 నుంచి తెలుగులో ఒక్క సినిమా కూడా చేయని ఇషా చావ్లా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తుండడంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చింది. వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాని హీటెక్కించేస్తోంది. ఇప్పుడు ఈ వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎంతో యాక్టివ్ గా ఉండే ఈషా కు సహజంగానే యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి సినిమాతో కంబ్యాక్ ఇస్తోన్న ఈ హాట్ హాట్ బ్యూటీకి రీఎంట్రీ ఎలాంటి కెరీర్ ని ఇస్తుందో చూడాల్సిందే మరి..
ఇంకా చదవండి: సినీ సెలబ్రిటీల మధ్య శ్రీనివాస కళ్యాణం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఇషా చావ్లా # టాలీవుడ్




