కూలీలో నా పాత్రకు ఫుల్ ఉత్సాహం: శ్రుతి హాసన్

కూలీలో నా పాత్రకు ఫుల్ ఉత్సాహం: శ్రుతి హాసన్

4 months ago | 5 Views

సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మక సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన క్రేజీ పాన్ ఇండియా యాక్షన్ మూవీ 'కూలీ'. కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమిర్ ఖాన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, ఉపేంద్ర, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డి. సురేష్ బాబు, దిల్ రాజు, సునీల్ నారంగ్, భరత్ నారంగ్ యాజమాన్యంలోని ఆసియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 14న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ శ్రుతి హసన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.    

కూలీ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?

రజినీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్.

ఈ సినిమాలో నా క్యారెక్టర్ నాకు పర్సనల్ చాలా కనెక్ట్ అయింది. ఆడియన్స్ కూడా తప్పకుండా కనెక్ట్ అవుతుందని నమ్మకం ఉంది. ముఖ్యంగా  అమ్మాయిలు చాలా కనెక్ట్ అవుతారు. ఒక అమ్మాయిగా ఆ క్యారెక్టర్ కి నేను చాలా కనెక్ట్ అయ్యాను. నా క్యారెక్టర్ లో చాలా మంచి ఎమోషన్ ఉంటుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా డిజైన్ చేశారు

మీరు ఈ సినిమాలో రజనీకాంత్ గారి కూతురుగా కనిపిస్తారని వినిపిస్తోంది?

లేదండీ. నేను సత్య రాజ్ గారి అమ్మాయిగా కనిపిస్తాను.  

నాగార్జున గారు ఉపేంద్ర గారు ఇలా చాలామంది స్టార్స్ ఉన్నారు. వాళ్ళ అందరితో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎలా అనిపించింది?

అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పటి వరకు చాలా మంది స్టార్స్ తో కలిసి పని చేశాను. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా డిఫరెంట్. ప్రతి ఆర్టిస్ట్ కి ఇంతమంది సూపర్ స్టార్స్ తో ఒకే సినిమాలో పని చేసే అవకాశం దొరకదు. ఇది చాలా స్పెషల్ మూవీ.  

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు ఈ కథ గురించి చెప్పినప్పుడు మీకు నచ్చిన ఎలిమెంట్ ఏమిటి?

నేను మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఆయన్ని కలవడం జరిగింది. ఆ వర్క్ జరుగుతున్నప్పుడు ఆయన సర్ప్రైజింగ్ గా ఈ క్యారెక్టర్ గురించి చెప్పారు. లోకేష్ గారి సినిమాలు డార్క్,  గన్స్. యాక్షన్ తో ముడిపడి ఉంటాయి.ఈ సినిమాలో ఆయన చెప్పిన స్ట్రాంగ్ విమెన్ క్యారెక్టర్ నాకు చాలా నచ్చింది.

Actor Shruti Haasan's Hyderabad live concert postponed. Here's why - India  Today

రజినీకాంత్ గారి క్యారెక్టర్, నా కారెక్టర్ తో డెఫినెట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు

నాగార్జున గారి క్యారెక్టర్ ఎలా ఉంటుంది?

చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఆయన ఫస్ట్ టైం విలన్ క్యారెక్టర్ చేశారు. తెలుగు ఆడియన్స్ అందరు చాలా సర్ ప్రైజ్  అవుతారు.

డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గురించి?

ఆయన చాలా క్లియర్ విజన్ ఉన్న డైరెక్టర్. ఆయనకి ఏం కావాలో చాలా పర్ఫెక్ట్ గా తెలుసు. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది.

అమీర్ ఖాన్ గారితో మీకు సీన్స్ ఉంటాయా?

వుంటాయి. అమీర్ ఖాన్ గారు ఫ్యామిలీ ఫ్రెండ్స్. నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ ఫేజ్ అమీర్ గారి ఫ్యామిలీ తోడుగా ఉంది.  అమీర్ గారితో కలిసి పనిచేయడం చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్.

నిర్మాతల గురించి?

చాలా పెద్ద స్కేల్లో తీసిన సినిమా ఇది. కథకి అవసరమైన బడ్జెట్ ని ఎక్కడ రాజీ పడకుండా పెట్టారు.  

సినిమా పూర్తిగా చూశారా?

ఇంకా పూర్తిగా చూడలేదు. డబ్బింగ్ ఫినిష్ చేశాను. ఇంకొన్ని పోర్షన్స్ చూశాను. ఇప్పటివరకు చూసినదంతా చాలా అద్భుతంగా ఉంది.

అనిరుథ్ మ్యూజిక్ గురించి?

అనిరుథ్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. తన విషయంలో చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఇప్పుడు తన మ్యూజిక్ సినిమానే ఎలివేట్ చేస్తుంది. ఈ సినిమాల్లో కూడా బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు

డీవోపీ గిరీష్ గురించి?  

గిరీష్ గారు డైరెక్టర్స్ డిఓపి. ఆయన దర్శకుడు మనసులో ఏముందో తెలుసుకుని విజువలైజ్ చేసే టెక్నీషియన్. విక్రమ్  లో ఆయన వర్క్ అందరికీ నచ్చింది. ఈ సినిమాలో కూడా చాలా అద్భుతమైన విజువల్స్ ఉంటాయి.  

రజినీకాంత్ గారు,  కమల్ హాసన్ గారి గురించి అప్పటి  రోజుల గురించి  మీతో షేర్ చేసుకునేవారా?

ఆ రోజుల గురించి నాన్నగారితో ఆయనకున్న స్నేహం గురించి ఆ వర్కింగ్ స్టైల్ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. నిజంగా వారిది యూనిక్ బాండింగ్.  

మీకు డ్రీమ్ రోల్స్ ఉన్నాయా?

డ్రీమ్ రోల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు కానీ. నాకు మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. నేను కూడా ఒక మ్యుజిషియన్ ని .ఎప్పుడైనా ఒక మ్యుజిషియన్ రోల్ ని ప్లే చేయాలనుంది.  

చాలా లాంగ్ కెరీర్ వున్న  హీరోయిన్స్ లో మీరు ఒకరు. ఈ జర్నీ గురించి ఏం చెప్తారు?

ఇదంతా బ్లెస్సింగ్ అని భావిస్తున్నాను. నేను వర్క్ ని ఎంజాయ్ చేశాను. భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించలేదు. మనకొచ్చిన ప్రాజెక్టు ఎంతవరకు న్యాయం చేయాలనే దానిమీద నా అదృష్టంతా వుంటుంది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.

కూలీ గురించి ఒక మాటలో చెప్పాలంటే?

కూలీ ఫుల్ ఎంటర్టైనర్. చాలా అద్భుతమైన యాక్షన్ ఉంది. అలాగే మంచి కథ ఎమోషనల్ కోర్ కూడా ఉంది. కచ్చితంగా ఆడియన్స్ అందరు చాలా ఎంజాయ్ చేస్తారు.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?

లాస్ట్ ఇయర్ అంతా కూలీతోనే బిజీగా ఉన్నాను. ఇప్పుడు కథలు వింటున్నాను. కొత్త డైరెక్టర్స్, కొత్త రైటర్స్, అందరితో కలిసి పని చేయాలనే ఆసక్తి ఉంది. తెలుగులో కొన్ని స్టోరీస్ విన్నాను. త్వరలోనే అనౌన్స్మెంట్ ఉంటుంది.

ఆల్ ది బెస్ట్

థాంక్ యూ

ఇంకా చదవండి:  ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# కూలీ     # రజనీకాంత్‌     # శ్రుతి హాసన్    

trending

View More