బాలీవుడ్ పై ఫోకస్!
1 month ago | 5 Views
'ఊహలు గుసగుసలాడే' సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది టాలీవుడ్ క్రేజీ బ్యూటీ రాశి ఖన్నా. ఈ బబ్లీ బ్యూటీ తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ కెరీర్ లో ముందుకు వెళుతోంది. యంగ్ హీరోలకు జోడీగా నటిస్తూ తన ప్రతిభను నిరూపించుకుంటోంది ఈ అమ్మడు.
అలాగే తమిళ్ లోనూ ఛాన్స్ లు అందిపుచ్చుకుంది. తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ నటించిన 'జై లవ కుశ' సినిమాలోనూ నటించింది. అయినా కానీ ఈ బొమ్మకి అంతగా అవకాశాలు రాలేదు. దాంతో నిరాశ చెందిన రాశీ .. ఇటీవలే బాలీవుడ్ లో ఓ వెబ్ సిరీస్ సైతం చేసింది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ పైనే ఈ చిన్నది ఫోకస్ పెడుతోంది. దాంతో రాశీ ఖన్నా టాలీవుడ్ కు ఇక దూరం అవడం ఖాయం అని అంటున్నారు కొందరు అభిమానులు. కానీ ఈ అమ్మడు అవకాశం వస్తే ఏ భాషలోనైనా నటించి మెప్పిస్తానంటోంది. అదీ..సంగతీ!!
ఇంకా చదవండి: ఎన్నో అందమైన జ్ఞాపకాలు..!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




