ముంబైలో డీమన్ స్లేయర్ స్క్రీనింగ్‌లో రష్మిక, టైగర్‌తో ఫ్యాన్స్ హంగామా
2 months ago | 5 Views
అనిమే అభిమానుల కోసం క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్‌మెంట్ ఇండియా నిర్వహించిన డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ ప్రత్యేక ఫ్యాన్ స్క్రీనింగ్ ముంబైలో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‌లో 250కి పైగా అభిమానులు పాల్గొనగా, ప్రత్యేక ఆకర్షణగా రష్మిక మందన్నా మరియు టైగర్ ష్రాఫ్ హాజరై అనిమే కల్చర్‌ను సెలబ్రేట్ చేశారు.
రష్మిక, టాంజిరో – నెజుకో సోదర సోదరీమణులకి ప్రేరణగా ఉండే ప్రత్యేక డ్రెస్సులో అభిమానులను అలరించగా, టైగర్ తన జెనిట్సు–ఇన్‌స్పైర్డ్ జాకెట్‌లో ఫ్యాండమ్‌ను ప్రదర్శించారు. అభిమానులతో మాట్లాడిన టైగర్, తనకు బాగా నచ్చిన సీన్ “జెనిట్సు vs కైగాకు” అని చెప్పారు. “అందరూ పడిపోయినా, జెనిట్సు మాత్రమే ప్రశాంతంగా కోటలోకి ప్రవేశించాడు” అని ఆయన గుర్తుచేశారు.
రష్మిక కూడా అభిమానులను వారి ఫేవరెట్ సీన్ గురించి అడిగింది. దీనికి పెద్ద ఎత్తున స్పందన రావడంతో “అకాజా vs గియు మరియు టాంజిరో” ఫైట్ సీక్వెన్స్‌కు థండరస్ రెస్పాన్స్ లభించింది.
భారతదేశ వ్యాప్తంగా విడుదల:
డీమన్ స్లేయర్: ఇన్ఫినిటీ క్యాసిల్ టికెట్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.
750కి పైగా స్క్రీన్లలో విడుదల – భారతదేశంలో ఇప్పటి వరకు ఎప్పుడూ లేని స్థాయి రిలీజ్.
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 12, 2025
భాషలు: జపనీస్ (ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో), ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు.
భారతదేశంలోనే అతిపెద్ద అనిమే థియేట్రికల్ రిలీజ్‌గా నిలిచే ఈ ఫిల్మ్‌ను తప్పక థియేటర్స్‌లో చూడండి.
ఇంకా చదవండి: ఆహా ఓటీటీ "తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4"లో గెస్ట్ గా పాల్గొని సందడి చేసిన జెనీలియా
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




