వేణు దర్సకత్వంలో ఎల్లమ్మ: ఆలస్యం సమస్యలు పెరుగుతున్నాయా?
6 days ago | 5 Views
నటుడు, ‘బలగం’ దర్శకుడు వేణు తన తదుపరి సినిమాగా 'ఎల్లమ్మ’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఏ ముహూర్తంలో మొదలెట్టారో తెలీదు కానీ.. ఒక అడుగు ముందుకు వేస్తే.. రెండడుగులు వెనక్కి వేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. డిసెంబరులో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని భావించారు. అయితే ఇప్పుడు అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ముందు ఈ కథని హీరో నానికి చెప్పారు. ఆ తరవాత నితిన్ ఓకే అన్నారు. నితిన్ పక్కకు వెళ్లిపోవడంతో చాలామందికి ఈ కథ వినిపించారు. చివరికి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఫిక్సయ్యాడన్న వార్తలొచ్చాయి. అయితే.. ఎంతవరకూ హీరో ఎవరన్న విషయంలో క్లారిటీ రాలేదు. హీరోయిన్ పరిస్థితి కూడా అంతే. ముందు ఈ కథని సాయి పల్లవికి వినిపించారు. తను ఓకే అనేసింది. కానీ ఆ తరవాత పరిస్థితులు మారాయి.
సాయి పల్లవి కూడా సైలెంట్ అయిపోయింది. ఆ తరవాత కీర్తి సురేష్ దగ్గరకు వెళ్లింది. హీరోలు మారుతున్నా.. హీరోయిన్‌గా కీర్తినే అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి కీర్తి కూడా బయటకు వచ్చేసింది. ఈ విషయాన్ని కీర్తీ ధృవీకరించింది కూడా. తను కథానాయికగా నటించిన ‘రివాల్వర్ రీటా’ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చారు కీర్తి. ఈ సందర్భంగా కలిసిన మీడియా ‘ఎల్లమ్మ’లో మీరు నటిస్తున్నారా?’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకి కీర్తి కొంచెం తడబడింది. దీనికి నేరుగా ‘నో’ అంటూ ఈ సినిమాలో తాను చేయడం లేదని క్లారిటీ ఇచ్చేసింది. దాంతో.. ‘ఎల్లమ్మ’కు సంబంధించి మరో వికెట్ డౌన్ అయ్యిందనుకోవాలి. ఇప్పుడు హీరో ఫిక్స్ అయినా.. హీరోయిన్ కోసం వేట మొదలెట్టాలన్నమాట.
ఇంకా చదవండి: వానర టీజర్ లాంచ్: మంచు మనోజ్ ప్రశంసలతో అవినాష్ డ్యూయల్ డెబ్యూ సక్సెస్!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఎల్లమ్మ # ఎల్లమ్మ




