హీరోగా దర్శకుడు  బాబ్జీ తనయుడు  సన్నీ అఖిల్ !

హీరోగా దర్శకుడు బాబ్జీ తనయుడు సన్నీ అఖిల్ !

4 months ago | 5 Views

తెలుగు  సినీ  పరిశ్రమలోని నిర్మాతలు  తమ తనయులను  హీరోలుగా పరిచయం చేస్తూ  సినిమాలు 

తీసేవారు  గతంలో.....!

ఆ  తర్వాత  హీరోలు తమ తనయులను  హీరోలుగా పరిచయం  చేయడం మొదలు పెట్టారు....!

ఇప్పుడు  దర్శకులు  ఆ  బాటలో  తమ  కార్యాచరణ మొదలుపెట్టారు.....

కాకపోతే  హీరోలుగానే  అని గిరి  గీసుకోకుండా తమ బిడ్డలకు ఏ విభాగంలో  అభిలాష ఉందో , అభినివేశం ఉందో  గమనించి  ఆ వైపుగా 

తమ  వారసులను  నడిపేందుకు , నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు...!!

మొన్నామధ్య  ఎన్ కౌంటర్ శంకర్  తన కుమారుడి  చేతికి మెగా ఫోన్ ఇచ్చి  అతి త్వరలో తన బిడ్డ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమవుతుందని ప్రకటిస్తే.....ఇప్పుడు  తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా  గుర్తింపు తెచ్చుకున్న  నల్లపూసలు బాబ్జీ  తన కుమారుడు   '' సన్నీ అఖిల్'' ను  హీరోగా తెలుగు తెరకు పరిచయం చేస్తున్నట్లు  ప్రకటించారు...!!


ప్రకటించడమే  కాదు ఆల్రెడీ  తన  కుమారుడిని  హీరోగా పరిచయం చేస్తూ  ''పోలీస్ వారి హెచ్చరిక '' అను చిత్రాన్ని  రూపొందించేశారు...!

తూలికా  తనిష్క్  క్రియేషన్స్ పతాకం పై  బెల్లి జనార్థన్  నిర్మిస్తున్న  ఈ చిత్రం  ఈనెల 18 వ తేదీన  రెండు తెలుగు రాష్ట్రాలలో  విడదల కానుంది....!!

ఎవరైనా  ఒక  కొత్త  హీరో వెండి తెరకు  పరిచయం అవుతున్నాడంటే   సహజంగా ఆ  సినిమా టీనేజ్  లవ్ స్టోరీ అయి  ఉంటుంది.....!

ఆ  హీరో  కాలేజీ  గోయింగ్  స్టూడెంట్  అయి  ఉంటాడు...!

అందమైన  కాస్ట్యూమ్స్ ధరించి అందమైన  అమ్మాయిలపై  వలలు విసురుతూ తిరుగుతుంటాడు.....

ప్రేమ గీతాలు పాడుతూ పార్క్ లలో  లేదా  ఖరీదైన  విదేశీ లొకేషన్ లలో  పరిభ్రమిస్తుంటాడు.....

సందర్భాన్ని బట్టి  తమ ప్రేమకు  అడ్డొచ్చే  విలన్ లతో ఫైట్  చేస్తుంటాడు....!!

అటువంటి కొలతలతో , అటువంటి  పాత్రలతోనే  ఏ కొత్త  హీరోనయినా వెండితెరకు  పరిచయం చేస్తుంటారు...ప్రేక్షకుల మధ్యకు తీసుకొస్తుంటారు ...!

అయితే  కొత్తగా  వెండితెరకు హీరో  కార్డ్ తో పరిచయం  అవుతున్న''సన్నీ అఖిల్''

మాత్రం  ఇందుకు  విరుద్ధంగా ఒక  విభిన్న పాత్ర  ద్వారా ప్రేక్షకుల  ముందుకు వస్తున్నాడు....!!

ఈ  వ్యవస్థ తయారు చేసిన  పిచ్చోడి  పాత్రలో ....

నూటికి  నూరు శాతం తనలోని  నటనాశక్తిని , నటించే శక్తిని  బాహ్య ప్రపంచం  ముందు  ఆవిష్కరించుకునే  అరుదైన , అద్భుతమైన పాత్రలో  ''సన్నీ అఖిల్ ''   ఈ సినిమా నటించారు.....!!

ఇంతవరకు  సినిమా ప్రాంగణం లోకి  తొలి అడుగులు వేసిన   ఏ నూతన కథానాయకుడు  ఇటువంటి  చాలెంజ్ రోల్ తో ,

ఇటువంటి  డీ గ్లామర్  పాత్రతో ప్రేక్షకులకు పరిచయం కావడానికి సాహసించ లేదు....!

బాల నటుడిగా  పసితనంలోనే రంగ స్థలాన్ని ముద్దాడిన ''సన్నీ అఖిల్''  థియేటర్ ఆర్టిస్ట్ గా  అనేక  ప్రదర్శనలు ఇచ్చిన అనుభవాన్ని భుజాన మోస్తూ సినిమా తల్లి ప్రాంగణం లోకి అడుగుపెట్టాడు....!

అందుకేనేమో  ''నేను  కమల్ హాసన్ గారిలాగా  ఒక గొప్ప నటుడి గా ఎదగడాన్ని  గమ్యం గా పెట్టుకున్నాను ....

నువ్వు  హీరోవా అని ఎవరైనా నన్ను  ప్రశ్నిస్తే  నేను విభిన్న నటుడిని .... అంతే'' అంటున్నాడాయన....!

విశేషం ఏమిటంటే  సన్నీ అఖిల్    హీరోగా  నటించిన తొలి చిత్రం  విడుదల కాకముందే  రెండో  చిత్రం లో కూడా  హీరోగా నటించేశాడు..

గతంలో  ప్రేయసి రావే ..., హనుమంతు వంటి  సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన  చంద్ర మహేష్  తాజాగా  రూపొందిస్తున్న 

''పిఠాపురంలో  అలా  మొదలైంది..'' చిత్రంలో కూడా  హీరోగా  నటించాడు..!

ఈ చిత్రం కూడా  షూటింగ్ పూర్తి చేసుకుని  ప్రస్తుతం  డబ్బింగ్  జరుపుకుంటుంది...!

త్వరలో ఆ సినిమా కూడా విడుదల కు సిద్ధం అవుతుంది....!!!

మరో  రెండు చిత్రాల  కథలు వింటున్నాడాయన....!!

బెస్ట్ ఆఫ్ లక్  న్యూ హీరో ...!!!
ఇంకా చదవండి: శివుడు, విష్ణువుల అవతారం ఈ 'వీరమల్లు'
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

trending

View More