జులై 27న  ధనుష్ 'మిస్టర్ కార్తీక్'  రీ రిలీజ్

జులై 27న ధనుష్ 'మిస్టర్ కార్తీక్' రీ రిలీజ్

4 months ago | 5 Views

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో ధనుష్ హీరోగా రీచా గంగోపాధ్యాయ హీరోయిన్ గా నటించిన చిత్రం మయక్కమ్ ఎన్న. తెలుగులో ఈ చిత్రం మిస్టర్ కార్తీక్ గా 2016 లో విడుదలై రొమాంటిక్ లవ్ స్టోరీగా మంచి విజయం సాధించింది. జివి. ప్రకాష్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచింది.  ధనుష్ పుట్టినరోజు సందర్భంగా మిస్టర్ కార్తీక్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. జులై 27న ఈ చిత్రాన్ని భారీగా థియేటర్స్ లో రీ రిలీజ్ చేస్తున్నారు.

మిస్టర్‌ కార్తీక్‌' మళ్లీ వస్తున్నాడు | Dhanush Mr Kartik Re-release On July  27th | Sakshi

ఓం శివగంగా ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి కాడబోయిన లతా మండేశ్వరి సమర్పణలో నిర్మాత కాడబోయిన బాబురావు ఈ సినిమాను తెలుగులో రీ రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు శ్రీ రాఘవ కొన్ని హృదయానికి దగ్గరగా ఉండే సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కిస్తారు, అలా ఈ మిస్టర్ కార్తీక్ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే అనేక ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఇటీవల తమిళంలో ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించింది. ఇదే స్థాయిలో తెలుగులో సక్సెస్ కానుంది ఈ మూవీ.
ఇంకా చదవండి: మెగాస్టార్ చిరంజీవి-నయనతార లతో కేరళలో కీలక సన్నివేశాలు & డ్యూయెట్ సాంగ్ షూటింగ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

trending

View More