పూర్తిస్థాయి దర్శకుడిగా నిలవలేను: బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు
5 months ago | 5 Views
‘సితారే జవిూన్ పర్’ అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చి మనసులను కదిలించారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఆమిర్ ఖాన్. విమర్శకుల ప్రశంసలు అందుకుంటోన్న ఈ సినిమా విజయం తర్వాత ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తనకు నటన అంటే ఎంతో ఇష్టమని తెలిపారు. అలాగే దర్శకత్వం వైపు వెళ్లకపోవడానికి గల కారణాన్ని వివరించారు. ఆమిర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఏకైక సినిమా ‘తారే జవిూన్ పర్’. హిట్ టాక్‌ను సొంతం చేసుకొని ఆయనకు పేరు తెచ్చిన ఆ సినిమా తర్వాత ఆయన దర్శకత్వం వహించలేదు. తాజాగా ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘పూర్తిగా దర్శకుడిగా మారకపోవడానికి ఏకైక కారణం నటనపై నాకున్న ఇష్టమే. ఈ పరిశ్రమలో దర్శకత్వం, నిర్మాణం రెండూ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒకవేళ నేను దర్శకత్వం వైపు వెళ్తే నటన బోరింగ్‌గా అనిపిస్తుంది. బోర్ కొట్టిన పనిని నేను చేయలేను. కాబట్టి నటన మానేస్తాను. ‘తారే జవిూన్ పర్’కు కూడా అనుకోని పరిస్థితుల్లో దర్శకత్వం వహించాను.
అప్పుడు నేనున్న పరిస్థితులు అలా ప్రేరేపించాయి అని చెప్పారు. ఇక లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తాను నటించేది సూపర్ హీరో సినిమా అని ఆమిర్ తెలిపారు. ‘లోకేశ్ ఎంతో ప్రతిభావంతుడు ఆయనతో కలిసి వర్క్ చేసేందుకు ఎదురుచూస్తున్నాను. ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లడానికి సమయం పడుతుంది. నేను రాజ్‌కుమార్ హిరాణీ సినిమా పూర్తిచేశాక ఇందులో నటిస్తాను. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో దీన్ని ప్రారంభించే అవకాశాలున్నాయి’ అని చెప్పారు. ఇక ఆమిర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జవిూన్ పర్’ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చింది. రాష్ట్రపతి ద్రౌపదీముర్ము కూడా దీన్ని వీక్షించి ప్రశంసించారు. రాష్ట్రపతి భవన్‌లో ఆమె కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. మానసిక దివ్యాంగులు తమకున్న సమస్యను అధిగమించి ఎలాంటి విజయాన్ని అందుకున్నారన్నది ఇందులో హృద్యంగా చూపించారు.
ఇంకా చదవండి: "అవాస్తవాలను నమ్మవద్దు, అసత్యాలను వ్యాప్తి చేయవద్దు: శశివదనే ఫేమ్ కోమలి ప్రసాద్ సూచన"
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఆమిర్ ఖాన్ # బాలీవుడ్




