'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5' గ్రాండ్ లాంఛ్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5' గ్రాండ్ లాంఛ్ అనౌన్స్ చేసిన ఆహా ఓటీటీ

15 days ago | 5 Views

తన సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 5 గ్రాండ్ లాంఛ్ ను అనౌన్స్ చేసింది ఆహా. ఏడాదిలోనే ఐదో సీజన్ కు చేరుకోవడం ఈ ప్రోగ్రాం సక్సెస్ ను ప్రూవ్ చేస్తోంది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, నటుడు జీవన్ హోస్ట్ లుగా వ్యవహరిస్తున్నారు. 


ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5' లో ఐదు జంటలు ప్రేరణ - కావ్య,  యాదమ్మ రాజు - దీపికా రంగరాజు,  అఖిల్ సార్థక్ - మానస్, పాండు - యష్మి గౌడ, టేస్టీ తేజ - సౌందర్య తమ సరదా మాటలతో రుచికరమైన వంటలతో పోటీ పడబోతున్నారు. ఈ నెల 20వ తేదీ రాత్రి 7 గంటలకు 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5' ఫస్ట్ ఎపిసోడ్ 'స్వీట్ అండ్ సాల్ట్' థీమ్ తో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు, ఆహాలో 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 5' సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది.
ఇంకా చదవండి: IFFI 56లో నందమూరి బాలకృష్ణకు అపూర్వ గౌరవం: 50 ఏళ్ల ఐకానిక్ ప్రయాణానికి స్వర్ణ సన్మానం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సుమతీ శతకం     # అమర్‌దీప్ చౌదరి     # సాయిలీ చౌదరి    

trending

View More