సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. 'పోలీస్ కంప్లెయింట్' మూవీ నుంచి వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ విడుదల
6 months ago | 5 Views
హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్త కాన్సెప్ట్
మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైన నటి వరలక్ష్మి శరత్ కుమార్. బ్లాక్ బస్టర్ సినిమాలు చేసి స్టార్ రేంజ్ కు చేరిన వరలక్ష్మి శరత్ కుమార్.. తాజాగా తెలుగులో 'పోలీస్ కంప్లెయింట్' మూవీ చేస్తోంది. ఈ మూవీలోని వరలక్ష్మి శరత్ కుమార్ ఫస్ట్ లుక్ ను సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాలో పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో పాటు, తొలిసారి ఆద్యంతం వినోదాన్ని కలిగించే పాత్రలో వరలక్ష్మి నటించడం విశేషం.
ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ మీద స్పెషల్ సాంగ్ షూట్ చేసామని, అది సినిమాకే మెయిన్ హైలెట్ అని ఈ సందర్భంగా నిర్మాతలు తెలిపారు.
ఈ చిత్రాన్ని ఎమ్మెస్కె ప్రమిదశ్రీ ఫిలిమ్స్, శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా సంస్థల సంయుక్త బ్యానర్లలో సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, అఘోర (తెలుగు, తమిళం), ఆప్త, పౌరుషం, రాఘవ రెడ్డి, ఆదిపర్వం వంటి వినూత్న చిత్రాలను రూపోందించిన దర్శకుడు సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు. నవీన్ చంద్ర, కృష్ణ సాయి, రాగిణి ద్వివేది, రవిశంకర్, ఆదిత్య ఓం ,
అమిత్, దిల్ రమేష్, రాజశ్రీ నాయర్, సింగపూర్ బాలకృష్ణ, దుగ్గిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీహర్ష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. "సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ప్రధాన పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను లాంచ్ చేశాం. 'చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ' అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. మనం చేసే ప్రతి చర్యకి ఫలితంగా అదే తిరిగి మనకే వస్తుందని కాన్సెప్ట్ తో, హారర్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సరికొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది." అని చెప్పారు.
నిర్మాతలు సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్ మాట్లాడుతూ.., "వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తున్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది. ఈ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ మీద చేసిన స్పెషల్ సాంగ్ అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈ సినిమాను భారీగా రూపొందిస్తున్నాం. యాక్షన్, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళవించి ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించబోతున్న ఈ చిత్రానికి “పోలీస్ కంప్లెయింట్” అనే టైటిల్ ఫిక్స్ చేశాం. దర్శకుడు సంజీవ్ మేగోటి రచన, దర్శకత్వం బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు." అని చెప్పారు.
ఈ సినిమాలో వరలక్ష్మి, నవీన్ చంద్రలతో పాటు ప్రముఖ నటులు శరత్ లోహితాశ్వ, పృథ్వీ (యానిమల్), శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమినీ సురేష్, జబర్దస్త్ నవీన్, బేబీ తనస్వి (పొట్టేలు ఫేమ్) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే సీనియర్ నటులంతా సీరియస్ పాత్రల్లో అలరించనున్నారు.
టెక్నికల్ విభాగాలు:
సినిమాటోగ్రఫీ: ఎస్.ఎన్. హరీష్
ఎడిటర్: ఆర్.ఎం. విశ్వనాథ్
మ్యూజిక్: ఆరోహణ సుధీంద్ర, సుధాకర్ మారియో, సంజీవ్ మేగోటి
పాటల రచయితలు: సాగర్ నారాయణ, సంజీవ్ మేగోటి, చింతల ప్రసన్న రాములు
ఆర్ట్ డైరెక్టర్: మురళీధర్ కొండపనేని
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, రవితేజ
కొరియోగ్రఫీ: సన్ రేస్ (సూర్యకిరణ్)
కాస్ట్యూమ్ డిజైనర్: నల్లపు సతీష్
మేకప్-స్టైలింగ్: విజయ్-శేఖర్
నిర్మాణ బాధ్యతలు:
నిర్మాతలు: సింగపూర్ బాలకృష్ణ , మల్లెల ప్రభాకర్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: బిజినేపల్లి రాజశేఖర్ రెడ్డి
ప్రొడక్షన్ కంట్రోలర్: టి. సతీష్ బాబు
ప్రొడక్షన్ మేనేజర్లు: రమేష్, కొల్ల గంగాధర్
పిఆర్ఓలు: కడలి రాంబాబు, అశోక్ దయ్యాల
ఇంకా చదవండి: ఊహించని రీతిలో 'మిరాయ్' టీజర్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




