'మిస్టీరియస్'కు యూ/ఏ సర్టిఫికెట్

'మిస్టీరియస్'కు యూ/ఏ సర్టిఫికెట్

9 days ago | 5 Views

మహి కోమటిరెడ్డి దర్శకత్వంలో అశ్లీ క్రియేషన్స్ పై జయ్ వల్లందాస్ నిర్మిస్తున్న 'మిస్టీరియస్'  సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా వున్నది. ఈ సందర్బంగా దర్శకుడు మహి కోమటిరెడ్డి మాట్లాడుతూ ఒక కొత్త స్క్రీన్ ప్లే తో పూర్తిగా సస్పెన్స్ తో వున్న ఈ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుడిని ఆద్యంతం ఒక కొత్త అనుభూతికి లోను చేస్తుందని చెప్పారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని  డిసెంబర్ 12 వ తేదీ రోజున ప్రపంచవ్యాప్తంగా 150 థియేటర్స్ లో విడుదల చేయాలనీ అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని నిర్మాత జయ్ వల్లందాస్ చెప్పారు. మా సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా సహానిర్మాత  ఉషా, శివానీ మాట్లాడుతూ..  'సినిమాని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. టీజర్ అందరికీ నచ్చడం సంతోషంగా ఉంది.


ఈ సినిమాలో రోహిత్, మేఘన రాజపుట్, అభిద్ భూషణ్, రియా కపూర్, కన్నడ నటుడు బాలరాజ్ వాడి, శ్రీనివాస్ భోగిరెడ్డి, ఆకునూరి గౌతమ్, జబర్దస్త్ రాజమౌళి, జబర్దస్త్ నవీన్ మరియు లక్కీ ఇందులో ప్రధాన భూమికను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి  కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మహి కోమటిరెడ్డి, నిర్మాత: జయ్ వల్లందాస్ (యూఎస్ ఏ ), పాటలు- సంగీతం: ఎం.ఎల్ రాజా, కెమెరా- ఎడిటింగ్: పరవస్తు దేవేంద్ర సూరి (దేవా), ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రామ్ ఉప్పు,  పీ ఆర్వో : శ్రీపాల్ చోల్లేటి.

ఇంకా చదవండి: మైత్రి మూవీ మేకర్స్ ద్వారా “చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్” రిలీజ్  

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మిస్టీరియస్     # రోహిత్ సహాని    

trending

View More