అరుళ్ నిథి–మమతా మోహన్‌దాస్ జంటగా ‘మై డియర్ సిస్టర్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది

అరుళ్ నిథి–మమతా మోహన్‌దాస్ జంటగా ‘మై డియర్ సిస్టర్’ ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది

18 days ago | 5 Views

అరుళ్ నిథి–మమత మోహన్‌దాస్ ప్రధాన పాత్రల్లో “మై డియర్ సిస్టర్” చిత్రాన్ని అద్భుతమైన విజువల్ ప్రొమోతో ప్రకటించారు. ఈ అన్‌స్క్రిప్టెడ్ టగ్-ఆఫ్-వార్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్యాషన్ స్టూడియోస్ ఎప్పటిలానే విభిన్న జానర్స్‌లో కుటుంబం మొత్తం చూడగలిగే నాణ్యమైన సినిమాలను అందిస్తూ తమ ప్రత్యేకతను మరొకసారి చాటుకుంది. అన్నాచెల్లెళ్ళ బంధం ఎన్నాళ్లుగానో ముఖ్యమైన భావోద్వేగ అంశం. పాసా మలర్ నుంచి వేదాళం వరకూ అన్నాచెల్లెల్ల అనుబంధం తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తూనే ఉంది.

ఈ ఎమోషన్ ని మరోసారి ముందుకు తీసుకువెళ్తూ, ప్యాషన్ స్టూడియోస్ “మై డియర్ సిస్టర్” పేరుతో ఓ మనసుని తాకే  భావోద్వేగపూరితమైన కథను అందిస్తోంది. ఈ చిత్రాన్ని ప్యాషన్ స్టూడియోస్‌ సుధన్ సుందరం , గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్  మణీష్ షా కలిసి నిర్మిస్తున్నారు. ఎన్నంగా సార్ ఉంగా సట్టంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రభు జయరామ్ ఈ చిత్రానికి దర్శకుడు.


కంటెంట్ బేస్డ్ పాత్రలతో ప్రత్యేకత సాధించిన అరుళ్ నిథి, మల్టీ టాలెంటెడ్ మమత మోహన్‌దాస్  అన్నాచెల్లెళ్ళుగా కనిపించబోతున్నారు. వీరి అనుబంధం సినిమా భావోద్వేగానికి కేంద్ర బిందువుగా ఉండనుంది.

ఇటీవల బైసన్ తో సంగీత ప్రపంచంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నివాస్ ప్రసన్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. “మై డియర్ సిస్టర్”లో మొత్తం ఏడు పాటలు ఉండగా—ఇవన్నీ సంగీత ప్రేమికులను ఆకట్టుకునేలా వుంటాయి.

దర్శకుడు ప్రభు జయరామ్ మాట్లాడుతూ..“ఈ చిత్ర కథానాయకుడు ‘పచ్చై కృష్ణన్’ పురుషాధిక్యత గల వ్యక్తి, మరొకవైపు అతని అక్క ‘నిర్మలాదేవి’ నిబద్ధత కలిగిన ఫెమినిస్టు. ఈ ఇద్దరి మధ్య ఉండే సిద్ధాంత ఘర్షణే కథకు ప్రధాన సారం. అరుళ్ నిథి, మమత మోహన్‌దాస్‌ల మధ్య షూటింగ్ సెట్లో జరిగే చిన్నచిన్న సరదా సంఘటనల నుంచే ఈ విజువల్ ప్రొమోలు అలరించాయి. ఆ సహజమైన, సరదా క్షణాల్ని  ప్రమోషనల్ కంటెంట్‌లో కలిపి, సినిమాలో వారి పాత్రల మధ్య ఉండే భావోద్వేగాల్ని  ఆకర్షణీయంగా చూపించాం.  

నిర్మాత సుధన్ సుందరం  మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ వినూత్నమైన, ప్రాధాన్యం ఉన్న పాత్రల కోసం ప్రయత్నించే నటులతో పని చేయడం మాకు గౌరవం. స్క్రిప్ట్ ఎంపికలో అరుళ్ నిథి చూపించే నాణ్యత, అతని ఒరిజినాలిటీకి ఉన్న నిబద్ధత ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. అనౌన్స్ మెంట్ వీడియో సినిమా టోన్, సారాంశాన్ని ప్రత్యేకంగా చూపిస్తుంది. గోల్డ్‌మైన్స్ టెలిఫిలిమ్స్ మణీష్ షాతో చేస్తున్న ఈ కలయిక మాకు ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. హిందీ ప్రాంతాల్లో తమిళ సినిమాకి మరింత చేరువ కల్పించడంలో ఆయన అత్యంత కీలకంగా పనిచేశారు. నిర్మాతలుగా, ఈ చిత్రం వినోదాన్ని అందించడమే కాకుండా భావోద్వేగపరంగా కూడా ప్రేక్షకులతో అనుసంధానం అవుతుందని మేము నమ్ముతున్నాం

ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్నాయి.ఈ రోజు విడుదలైన ఫస్ట్ లుక్ లో అన్నాచెల్లెల్లిద్దరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చిన తీరు అందరినీ ఆకట్టుకుంది.  

నటీనటులు: అరుళ్ నిథి, మమతా మోహన్‌దాస్, అరుణ్‌పాండియన్, మీనాక్షి గోవిందరాజన్

సాంకేతిక సిబ్బంది

 రచన & దర్శకత్వం - ప్రభు జయరామ్

నిర్మాతలు - సుధన్ సుందరం, మనీష్ షా

ప్రొడక్షన్ హౌస్ - ప్యాషన్ స్టూడియోస్ & గోల్డ్ మైన్స్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎ. కుమార్

DOP - వెట్రివేల్ మహేంద్రన్

ఎడిటర్ - వెంకట్ రాజన్

ఆర్ట్ డైరెక్టర్ - కె అరుసామి

సంగీతం - నివాస్ కె ప్రసన్న

కో డైరెక్టర్ - కపిల్ దేవ్. M & ఆశిష్. బి

సాహిత్యం - ఉమా దేవి, మోహన్ రాజేన్, విఘ్నేష్ శ్రీకాంత్, జెగన్ కవిరాజ్, ప్రభు జయరామ్

స్టంట్ - గణేష్

కొరియోగ్రాఫర్ - శంకర్ ఆర్

స్టిల్స్ - ఆకాష్ బాలాజీ

కాస్ట్యూమ్స్ - దినేష్ మనోహరన్

DI కలరిస్ట్ - జాన్ శ్రీరామ్

VFX సూపర్‌వైజర్ - ఫాజిల్

DI & VFX స్టూడియో - పిక్సెల్ లైట్స్

సౌండ్ డిజైన్ - జైసన్ జోస్, డేనియల్ జెఫెర్సన్

డబ్బింగ్ ఇంజనీర్ - ఎన్ వెంకట పరి

DUB, SFX & మిక్స్ -ఫోర్ ఫ్రేమ్స్  

PRO - వంశీ శేఖర్

పబ్లిసిటీ డిజైన్ – కన్నదాసన్ DKD

ఇంకా చదవండి: '12A రైల్వే కాలనీ’లో నా పాత్ర మరవలేనిది – కామాక్షి భాస్కర్ల”

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అరుళ్ నిథి     # మమతా మోహన్‌దాస్    

trending

View More