మ్యాడ్‌నెస్ ఆరంభం! ప్రీ-లుక్ కట్టిపడేస్తోంది.. జూన్ 6న ఫస్ట్ లుక్
6 months ago | 5 Views
బన్నీ వాస్ వర్క్స్ తో కలిసి నవతరం నిర్మాణ సంస్థలు సప్త అశ్వ క్రియేటివ్స్ మరియు వైరా ఎంటర్టైన్మెంట్స్ ఒక ఆసక్తికర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి కట్టిపడేసే ప్రీ-లుక్ పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారి, ట్రేడ్ తో పాటు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్ పై బన్నీ వాస్ తొలిసారిగా సినిమాను సమర్పిస్తుండటం.. ఈ ప్రాజెక్ట్ పై నమ్మకాన్ని మరింత బలపరుస్తోంది. ఈ చిత్ర నిర్మాతలలో ఒకరైన భాను ప్రతాప గతంలో బన్నీ వాస్ తో కలిసి తండేల్ కి పని చేసి, బ్లాక్ బస్టర్ ను అందించారు. ఈ ద్వయం 'ఆయ్', 'సింగిల్' వంటి సినిమాలతో తమ విజయ పరంపరను కొనసాగిస్తూ, ఈ ప్రాజెక్ట్ పై అంచనాలను పెంచుతున్నారు. 'హాయ్ నాన్న' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందించిన వైరా ఎంటర్టైన్మెంట్స్ సంస్థ చేతులు కలపడం ఈ ప్రాజెక్ట్ కి అదనపు బలాన్ని చేకూరుస్తుంది. తాజాగా ఆవిష్కరించబడిన ఆసక్తికరమైన ప్రీ-లుక్ పోస్టర్.. ఉత్సుకతను రేకెత్తించడంతో పాటు, నవ్వులను చిందించేలా ఉంది. ఎరుపు రంగు టోపీలు, నీలిరంగు ముసుగులు ధరించి వరుసగా నిల్చొని ఉన్న కొందరు వ్యక్తులతో కూడిన ఈ పోస్టర్.. ఫన్, మిస్టరీ, మ్యాడ్ నెస్ తో రోలర్‌కోస్టర్‌ను సూచిస్తుంది. జూన్ 6న ఫస్ట్ లుక్ ని విడుదల చేయనున్నట్లు పోస్టర్ లో ప్రకటించిన నిర్మాతలు.. సరికొత్త వినోదాత్మక చిత్రాన్ని అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
ఈ చిత్రంతో విజయేంద్ర ఎస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప, డా. విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకి సోమరాజు పెన్మెత్స సహ నిర్మాత. ఆర్.ఆర్. ధృవన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా సిద్ధార్థ్ ఎస్.జె, ఎడిటర్‌గా పీకే, ఆర్ట్ డైరెక్టర్‌గా గాంధీ నడికుడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రాజీవ్ కుమార్ రామా, కాస్ట్యూమ్ డిజైనర్‌గా శిల్పా టంగుటూరు వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన కథన శైలితో వినోదం యొక్క సరికొత్త రుచిని అందించడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరంగా రూపొందించిన ప్రీ-లుక్ పోస్టర్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఫస్ట్ లుక్ విడుదలైన తర్వాత ఈ చిత్రంపై అంచనాలు మరో స్థాయికి వెళ్ళడం ఖాయమని చెప్పవచ్చు.
జూన్ 6న ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ప్రేక్షకుల ఎదురు చూపులకు తగిన ఫలితం అన్నట్టుగా నటీనటులను ఆవిష్కరిస్తూ ఉండే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అసలుసిసలైన మ్యాడ్ నెస్ ను అందించనుంది.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# మ్యాడ్‌నెస్ # బన్నీ




