అక్టోబర్ 31 నుంచి ZEE5లో తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ స్ట్రీమింగ్
1 month ago | 5 Views
ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్‌లను ప్రేక్షకులకు అందిస్తోంది ఇండియాలోని టాప్ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో ఒకటైన ZEE5. ఈ లిస్టులో త్వరలోనే ఓ తెలుగు సిరీస్ చేరనుంది. అదే.. ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ . అక్టోబర్ 31 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వంటి సక్సెస్‌ఫుల్ సిరీస్‌లను అందించిన సౌతిండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందిస్తోంది. పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు.
టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల ఇందులో ప్రసాద రావుగా నటించారు. ఉదయ భాను ముఖ్య పాత్రను పోషించింది. ఇక ఓటీటీ రైజింగ్ స్టార్స్ అయిన వసంతిక ఇందులో స్వాతి పాత్రలో నటించింది. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో తండ్రైన రాజీవ్ కనకాల తన కూతురు స్వాతి కనిపించటం లేదని వెతుకుతుంటాడు. తండ్రికి ఏం చేయాలో తెలియక అన్వేషణ చేస్తుంటాడు. ఈ క్రమంలో నిజానికి దగ్గరయ్యే కొద్ది తనకు తెలిసే రహస్యాలు.. మోసాలు.. వెనుక దాగిన ఊహించని నిజాలు ఏంటి? ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం మధ్య ఉండే సన్నని సరిహద్దులు కనిపించకుండా పోతాయి. బాధ, భావోద్వేగం కలగలిసిన ఈ ప్రయాణం ప్రేక్షకులను మెప్పించనుంది. ఈ సందర్భంగా...
తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ ‘‘మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా జీ 5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది. దీన్ని సస్పెన్స్‌తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొని పెడుతుంది. రాజీవ్ కనకాల, ఉదయభాను వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు. పోలూరు కృష్ణ, సౌతిండియన్ స్క్రీన్స్ ఈ సిరీస్‌ను మనసుకి హత్తుకునేలా, ప్రభావవంతంగా రూపొందించారు’’ అన్నారు.

నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ నెరేషన్‌తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్‌తో నడిచే కథతో రూపొందింది. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలోని బలమైన బంధాలు, ప్రేమను ఇది ఆవిష్కరిస్తుంది’’ అన్నారు.
నటి ఉదయభాను మాట్లాడుతూ ‘‘‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గానే కాదు.. బలమైన ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది. ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అలాగే ఆసక్తికరమైన కథనంతో సిరీస్ బ్యాలెన్స్‌డ్‌గా మెప్పిస్తుంది. ఇదే యూనిక్ కంటెంట్‌గా మెప్పిస్తుంది’’ అన్నారు.
అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఎమోషనల్ థ్రిల్లర్ ఆఫ్ ది ఇయర్ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’ను జీ5లో మిస్ కావద్దు.
ZEE5 గురించి...
జీ5 భారతదేశపు అత్యంత పెద్దదైన ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. ప్రపంచ వ్యాప్తంగా మల్టీలింగ్వుల్ స్టోరీటెల్లర్‌గా ప్రసిద్ధి పొందింది. సౌత్ ఏషియన్ కంటెంట్‌తో మిలియన్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్) నుంచి శాఖగా మొదలైంది జీ5. అత్యద్భుతమైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్రరీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షలకు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాషల్లో (హిందీ, ఇంగ్లిష్, బెంగాలీ, మలయాళం, తెలుగు, తమిళ్, మరాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజరాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్ మూవీస్, టీవీ షోస్, మ్యూజిక్, కిడ్స్ షోస్, ఎడ్‌టెక్, సినీ ప్లేస్, న్యూస్, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్షకులను రంజింపజేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావడంతో జీ5 12 భాషల్లో అత్యద్భుతమైన కంటెంట్‌ని ప్రేక్షకులకు అందించగలుగుతోంది.
ఇంకా చదవండి: కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ సరసన దీప్శిఖ
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




