నవంబర్ 6న 'వృషభ' గర్జన: మోహన్ లాల్ పాన్-ఇండియా యాక్షన్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్!
1 month ago | 5 Views
మలయాళ సూపర్‌స్టార్..కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియన్ లెవెల్‌లో స్పెషల్ క్రేజ్ ఉంటుంది. అన్ని భాషల ఆడియెన్స్ మోహన్‌లాల్ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు. ఆయన ప్రస్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియన్ మూవీ ‘వృషభ’లో హీరోగా నటిస్తున్నారు. కన్నెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్ బ్యానర్లపై ‘వృషభ’ చిత్రాన్ని శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సి.కె. పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, ప్రవీర్ సింగ్, విశాల్ గుర్నాని, జూహి పరేఖ్ మెహతా నిర్మిస్తున్నారు.
హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేషన్స్ భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. మలయాళ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా రూపొందుతోన్న ‘వృషభ’ సినిమాకు నంద కిషోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రెస్టీజియస్ మూవీని నవంబర్ 6న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా గ్రాండ్ లెవల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..
నిర్మాత ఏక్తా కపూర్ మాట్లాడుతూ ‘‘ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీగా రూపొందిస్తోన్న ‘వృషభ’ సినిమాను నవంబర్ 6న విడుదల చేస్తున్నామని తెలియజేయటానికి సంతోషిస్తున్నాం. ఇది నా హృదయానికి ఎంతో దగ్గరైన కథ. బలమైన భావోద్వేగాలు, లార్జర్ దేన్ లైఫ్ డ్రామాతో ఇండియన్ సినిమాను గొప్పగా ఆవిష్కరిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించటానికి సిద్ధంగా ఉన్నాం’’ అన్నారు.
చిత్ర దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ ‘‘నవంబర్ 6న ‘వృషభ’ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలియజేయటానికి ఎంతో ఆనందంగా ఉంది. వృషభ సినిమాతో ఓ చరిత్రను క్రియేట్ చేయబోతున్నాం. బలమైన భావోద్వేగాలతో పాటు అద్భుతమైన విజువల్స్‌తో సినిమాను రూపొందించాం. బంధాలు, త్యాగాల కలయికగా రూపొందిన ఈ సినిమా ఆడియెన్స్‌కు గొప్పగా కనెక్ట్ అవుతుంది. ఇదొక ప్రత్యేకమైన, సంక్లిష్టమైన కథ. దీనికి ప్రాణం పోయటానికి ఎంటైర్ టీమ్ ఎంతగానో కష్టపడ్డారు. నవంబర్ 6న సినిమాను చూసే ప్రేక్షకులు ఓ గొప్ప అనుభూతికి లోనవుతారు’’ అన్నారు.
ఇటీవల విడుదలైన టీజర్‌ను గమనిస్తే మోహన్‌లాల్ అందులో యోధుడైన రాజు పాత్రలో కనిపిస్తారు. విధి పిలిస్తే ..రక్తమేస్పందించాలనే బలమైన సందేశాన్ని ఆయన పాత్ర ద్వారా అందించారు. రీ బర్న్ లవ్.. ఎ లవ్ సో స్ట్రాంగ్, ఇట్ డిఫైస్ డెత్ అనే ఎమోషనల్ ట్యాగ్ లైన్ ప్రేమ గొప్పతనం, అశాంతి, శాశ్వతమైన బంధాలపట్ల ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. భూత కాలానికి, వర్తమాన కాలాన్ని చూపించిన టీజర్‌తో ప్రేక్షకులకు మరింత ఆసక్తి పెరిగింది.
మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది, నయన సారిక తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి రసూల్ పూకుట్టి సౌండ్ డిజైన్ చేశారు. ఎస్.ఆర్.కె, జనార్ధన మహర్షి, కార్తీక డైలాగ్స్ రాసిన ఈ చిత్రానికి పీటర్ హెయిన్స్, స్టంట్ సిల్వ, నిఖిల్ యాక్షన్ కొరియోగ్రపీ చేశారు.
యాక్షన్, డ్రామా, అద్భుతమైన విజువల్స్ కలయికగా ఉన్న కథను ఎపిక్ యాక్షన్ సినిమాటిక్ జర్నీగా రూపొందించారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే అనుబంధాన్ని తెలియజేసే చిత్రమిది. మలయాళం, తెలుగు భాషలలో ఒకేసారి చిత్రీకరించబడిన ఈ చిత్రం హిందీ, కన్నడ భాషలలో కూడా కలిపి ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 6న రిలీజ్ అవుతుంది.
ఇంకా చదవండి: రొమాంటిక్ కామెడీతో 'ప్రేమంటే'
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




