సూపర్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా ఫిల్మ్ 'మిరాయ్' స్పెక్టక్యూలర్ అడ్వెంచర్ టీజర్ రిలీజ్
6 months ago | 5 Views
హనుమాన్ సినిమాతో దేశవ్యాప్తంగా అలరించిన సూపర్ హీరో తేజ సజ్జా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మాణంలో, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'మిరాయ్' తో వస్తున్నారు. మిరాయ్ టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. ఈ ఎపిక్ ఫాంటసీ విజువల్ వండర్ టీజర్ దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.
'జరగబోయేది మారణ హోమం. శిథిలం కాబోతోంది అశోకుడి ఆశయం.. కలియుగంలో పుట్టిన ఏ శక్తీ దీన్ని ఆపలేదు'అనే సాధువు వాయిస్ తో మొదలౌతుంది. ది బ్లాక్ స్వోర్డ్ (మనోజ్ మంచు)గా ఎంట్రీ ఇస్తాడు. తిరుగులేని శక్తికలిగి వినాశన మార్గాన్ని మొదలుపెడతాడు. కానీ ఈసారి, జోక్యం చేసుకునేది దేవతలు కాదు, వారి ఆయుధం 'మిరాయ్'. 9 బుక్స్.. 100 క్వశ్చన్స్.. 1 స్టిక్… బిగ్ అడ్వెంచర్” అంటూ సూపర్ యోధగా తేజ సజ్జా ఎంట్రీ అదిరిపోయింది. అతను తన విధి గురించి నిజాన్ని తెలుసుకుంటాడు, తనలో దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తాడు. ఈ చిత్రం ఇప్పటివరకు భారతీయ తెరలపై రాని ఒక ప్రత్యేకమైన, చాలా తాజా కథాంశాన్ని ప్రజెంట్ చేస్తోంది.
యంగెస్ట్ పాన్-ఇండియా స్టార్‌గా ప్రశంసలు అందుకున్న తేజ సజ్జా అండర్‌డాగ్-టర్న్డ్-సూపర్ యోధగా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మాగ్నెటిక్ స్క్రీన్ ప్రజెన్స్ హై యాక్షన్ సీక్వెన్స్‌లతో అదరగొట్టాడు.
మనోజ్ మంచు డార్క్ పవర్స్ కలిగిన యాంటీహీరోగా అద్భుతంగా నటించాడు. తన ఇంటెన్స్ యాక్టింగ్ టెర్రిఫిక్ గా వుంది. రితికా నాయక్, శ్రియ శరణ్, జయరా, జగపతి బాబు పోషించిన కీలక పాత్రలలో ఆకట్టుకున్నారు.
దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ తో ఒక అద్భుతమైన కథను విజువల్ వండర్ గా అందించాడు. రాముడు నడుస్తున్నప్పుడు వానరాలు భక్తితో నమస్కరించే టీజర్ లాస్ట్ మూమెంట్ గూస్ బంప్స్ తెప్పించింది.
కార్తీక్ కెమరా వర్క్ ప్రతి ఫ్రేమ్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేసింది, గౌర హరి అడ్రినలిన్-చార్జ్డ్ స్కోర్ ని అందించి మరో స్థాయికి తీసుకెళ్తుంది. దర్శకుడు స్క్రీన్‌ప్లేను కూడా రాశారు, మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. శ్రీ నాగేంద్ర తంగాల ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్, సుజిత్ కుమార్ కొల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్.
కార్తికేయ 2, జాట్ తో విజయాల్ని అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మద్దతుతో మిరాయ్ పాన్-ఇండియాలో మరో మ్యాసీవ్ మూవీ కాబోతోంది. నిర్మాణ విలువలు వరల్డ్ క్లాస్ లో వున్నాయి. VFX , సినిమాటిక్ కాన్వాస్ చాలా గ్రాండియర్ గా వున్నాయి.
ఇప్పటికే టీజర్‌తో భారీ హైప్ క్రియేట్ చేసిన మిరాయ్, సెప్టెంబర్ 5న థియేటర్లలో తుఫానులా సందడి చేయబోతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 8 భాషలలో 2D, 3D ఫార్మాట్‌లలో విడుదల కానుంది.
తారాగణం: సూపర్ హీరో తేజ సజ్జ, మనోజ్ మంచు, రితికా నాయక్, శ్రియ శరణ్, జయరామ్, జగపతి బాబు
సాంకేతిక సిబ్బంది:
దర్శకుడు: కార్తీక్ ఘట్టమనేని
నిర్మాతలు: టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి
సంగీతం: గౌర హరి
ఆర్ట్ డైరెక్టర్: శ్రీ నాగేంద్ర తంగాల
రచయిత: మణిబాబు కరణం
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# తేజ సజ్జా # హనుమాన్ # మిరాయ్




