నాని ఫెరోషియస్ అవతార్ లో స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్
4 months ago | 5 Views
నేచురల్ స్టార్ నాని మోస్ట్ ఎవైటెడ్ గ్లోబల్ యాక్షనర్ 'ది ప్యారడైజ్' లో ఇంతకు ముందు ఎన్నడూ చేయని ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నారు. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్.ఎల్.వి. సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నిర్మిస్తున్నారు. రా స్టేట్మెంట్, రెండు పవర్ ఫుల్ ఫస్ట్-లుక్ పోస్టర్లతో ఈ చిత్రం ఇప్పటికే సంచలనం సృష్టించింది. తాజాగా బిహైండ్ ది సీన్స్ 'స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్' గ్లింప్స్ ని రిలీజ్ చేశారు మేకర్స్. జైల్ బ్యాక్ డ్రాప్ లో సాగే స్పార్క్ ఆఫ్ ప్యారడైజ్ వీడియోలో, రామోజీ ఫిలిం సిటీలో 15 రోజుల పాటు షూట్ చేసిన పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ కి ఎక్సైటింగ్ గ్లింప్స్ కనిపించాయి. కత్తులు పట్టుకున్న ఖైదీలు చుట్టుముట్టినప్పటికీ, నాని పాత్ర ఒంటరిగా, చేతిలో ఆయుధం లేకుండా, ఏమాత్రం భయపడకుండా, సీట్లో కూర్చొని ధైర్యంగా వారిని సవాలు చేస్తూ కనిపించడం అదిరిపోయింది. రెండు జడలు, ముఖం మీద గాట్లు, రఫ్ & టఫ్ లుక్‌తో నాని పవర్ ఫుల్ గా కనిపించారు. చుట్టూ గందరగోళం జరుగుతున్నా, సీట్లో కూర్చోని, కత్తులు పట్టుకున్న గుంపుని కూల్ గా గమనిండం ఫెరోషియస్ గా వుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఒదెల బోల్డ్ విజన్ ని ఈ వీడియో ప్రజెంట్ చేస్తోంది. క్యారెక్టర్ డిజైన్ నుంచి ప్రతి ఫ్రేమ్ వరకూ తన బ్రిలియన్స్ ని చూపించారు. సుధాకర్ చెరుకూరి ప్రొడక్షన్ వ్యాల్యూస్ అద్భుతంగా వున్నాయి. సినిమాకి రా, రియలిస్టిక్ టోన్‌ని రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తుంది. ప్రతి ఫ్రేమ్‌కి థ్రిల్‌ని జోడించి, పుల్స్ పెంచే మ్యూజిక్ అందించారు.
రాఘవ్ జుయల్ కీలక పాత్రలో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. బలమైన క్యారెక్టర్స్‌తో కూడిన కథ ప్రేక్షకులకు విజువల్ స్పెక్టకిల్‌తో పాటు స్ట్రాంగ్ కంటెంట్ అందించడానికి రెడీ అవుతోంది.
ది ప్యారడైస్ 2026 మార్చి 26న థియేటర్లలోకి రానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతూ ఇండియన్ సినిమాలో మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామాలలో ఒకటిగా నిలుస్తోంది.
తారాగణం: నాని, రాఘవ్ జుయల్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
DOP: CH సాయి
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
ఆడియో: సారెగమ మ్యూజిక్
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ఇంకా చదవండి:27న రానున్న 'కన్యా కుమారి'
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




