సాయి దుర్గ తేజ్ బ్లాక్ బస్టర్ ‘రిపబ్లిక్’కు నాలుగేళ్లు పూర్తి
2 months ago | 5 Views
నాలుగు సంవత్సరాల క్రితం ‘రిపబ్లిక్’ మూవీ వచ్చి అందరిలోనూ ఎన్నో ఆలోచనల్ని రేకెత్తించింది. దేవా కట్టా దర్శకత్వంలో సాయి దుర్గ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీని రాజకీయాలు, అవినీతి, సమాజనంలోని అసమానతల నేపథ్యంలో తెరకెక్కించారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు.. సమాజాన్ని ప్రతిబింబించే భావోద్వేగ చిత్రం. నటుడిగా సాయి దుర్గ తేజ్ స్థానాన్ని సుస్థిరం చేసిన చిత్రంగా ‘రిపబ్లిక్’ నిలుస్తుంది. వ్యవస్థాగతంగా కుళ్ళిపోయిన సమాజంలో విధి నిర్వహణలో ఉన్న IAS అధికారిగా సాయి దుర్గ తేజ్ అసమానమైన నటనను కనబర్చారు.
‘రిపబ్లిక్’ మూవీ వచ్చి నాలుగేళ్లు అవుతోంది. ‘రిపబ్లిక్’ విడుదలకు కొన్ని వారాల ముందు, సాయి దుర్గ తేజ్ ప్రమాదానికి గురి అవ్వడం, ప్రమోషన్స్‌కి అందుబాటులో లేకపోవడం, క్లిష్టకాలంలో విడుదలైన ఈ చిత్రం అందరి ప్రశంసల్ని అందుకుంది. ఏప్రిల్ 2023న విడుదలైన విరూపాక్ష అతని కెరీర్‌లో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.ఆ మూవీ 100 కోట్లకు పైగా వసూలు చేసి ఓ చరిత్రగా సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో నిల్చింది. ‘BRO’ మూవీతో తన గురువు, ఆరాధ్యుడైన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకుని సాయి దుర్గ తేజ్ కెరీర్‌లో మరో మైలురాయిని అందుకున్నారు.

ఈ సినిమాలు సాయి దుర్గ తేజ్ స్పార్క్ తగ్గలేదని నిరూపించాయి. ప్రతి సినిమా ఒక మైలు రాయిలా మారాయి. రెండున్నర సంవత్సరాల అవిశ్రాంత కృషి తర్వాత సాయి దుర్ఘ తేజ్ ‘సంబరాల ఏటి గట్టు’తో తనని తాను మరింత కొత్తగా ఆవిష్కరించుకునేందుకు సిద్దమవుతున్నారు. ఈ పాన్-ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం సాయి దుర్గ తేజ్ తన శరీరాకృతిని మార్చుకున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ మీద రోహిత్ కెపి దర్శకత్వంలో రానున్న ఈ మూవీని 125 కోట్ల బడ్జెట్‌తో భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదలవుతోంది.
సాయి దుర్గ తేజ్ పుట్టినరోజు సందర్భంగా (అక్టోబర్ 15) ‘అసుర ఆగమన’ అంటూ ‘సంబరాల ఏటి గట్టు’ టీజర్ గ్లింప్స్ ను ‘కాంతారా: చాప్టర్ 1’తో పాటుగా స్క్రీన్లలో ప్రదర్శించనున్నారు. ఈ టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచేలా ఉండబోతోందని యూనిట్ చెబుతోంది.
ఇంకా చదవండి: న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ మోషన్ పోస్టర్ విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




