రియలిస్టిక్ లవ్‌స్టోరీ 'ఉసురే' ట్రైలర్ విడుదల
4 months ago | 5 Views
యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్ అరుణాసలం, జననీ కునశీలన్ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్ డి.గోపాల్ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్. సీనియర్ హీరోయిన్ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్‌ను చూస్తుంటే ఇదొక సహజమైన, వైవిధ్యమైన ప్రేమకథలా అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం ఎంతో రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ప్రముఖ హీరోయిన్ రాశి నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుందని అర్థమౌతుంది. యథార్థ సంఘటనల ప్రేరణగా రూపొందిన ఈ ప్రేమకథ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుందని, ముఖ్యంగా నేటి యువతకు ఈ సినిమా ఎంతో బాగా నచ్చుతుందని తెలుస్తోంది. ఇక
దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ '' ట్రైలర్‌కు ఎంతో మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా హీరో, హీరోయిన్ నటన, వారి మధ్య వచ్చే సంభాషణలు ఎంతో రియల్‌స్టిక్‌గా ఉన్నాయని అందరూ ప్రశంసిస్తున్నారు. ఇదొక వైవిధ్యమైన ప్రేమకథ. ఎంతో రియలిస్టిక్ అప్రోచ్‌తో ఈ ప్రేమకథ అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సమాజంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. రొమాన్స్, కామెడి, డ్రామా గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రతి అంశం ఎంతో ఆస్తకికరంగా, ఉత్కంఠగా ఉంటుంది.కొత్తదనం కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది' అన్నారు.
నటీనటులు
టీజయ్ అరుణాసలం
రాశి
ఆదిత్య కతిర్
తంగదురై
పావల్ నవగీతన్
క్రేన్ మనోహర్
సెంథిల్ కుమారి తదితరులు నటించిన ఈ చిత్రానికి
దర్శకుడు: నవీన్ డి గోపాల్
నిర్మాత: మౌళి ఎం రాధా కృష్ణ
సినిమాటోగ్రాఫర్: మార్కీ సాయి
ఆర్ట్ డైరెక్టర్: సౌందర్ నల్లసామి
ఎడిటర్: మణిమారన్
సంగీత దర్శకుడు: కిరణ్ జోజ్
కాస్ట్యూమ్ డిజైనర్: ముతుల్ హఫీజ్
మేకప్: శశికుమార్
స్టంట్ మాస్టర్: రామ్‌కుమార్
పోస్టర్ డిజైనర్: శైను మాష్
డాన్స్ మాస్టర్: భారతి
గీత రచయిత: వెంగి
ఇంకా చదవండి: U/A సర్టిఫికేట్ పొందిన 'హరి హర వీరమల్లు' చిత్రం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఉసురే # టీజయ్ అరుణాసలం # జననీ కునశీలన్




