పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' చిత్రం నుండి అద్భుతమైన గీతం 'గన్స్ ఎన్ రోజెస్' విడుదల
2 months ago | 5 Views
మరో పది రోజుల్లో థియేటర్లలో 'ఓజీ' తుఫాను
ఇటీవల 'ఓజీ' చిత్రం నుండి విడుదలైన 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తుఫాను నుండి అభిమానులు ఇంకా బయటకు రాకముందే, 'గన్స్ ఎన్ రోజెస్' అనే మరో సంచలన గీతంతో 'ఓజీ' చిత్ర బృందం తిరిగి వచ్చింది. ఈ గీతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోంది.
సంగీత సంచలనం తమన్ ఎస్ స్వరపరిచిన ఈ పాట, శ్రోతలను 'ఓజీ' యొక్క ఉత్కంఠభరితమైన, యాక్షన్-ప్యాక్డ్ ప్రపంచంలోకి లోతుగా తీసుకెళుతుంది. తమన్ తనదైన స్వరకల్పనతో మరో అగ్ని తుఫానుని సృష్టించారు. ఉరుములను తలపించే బీట్స్, పదునైన అమరికలతో మలిచిన 'గన్స్ ఎన్ రోజెస్' గీతం.. చిత్ర కథ యొక్క తీవ్రత మరియు స్థాయిని సంపూర్ణంగా సంగ్రహిస్తుంది. థమన్ యొక్క అత్యున్నత సంగీత నైపుణ్యం ఈ గీతాన్ని.. 'ఓజీ' ప్రపంచం యొక్క నాడి, శక్తి మరియు చీకటిని ప్రతిబింబించే గొప్ప ధ్వని అనుభవంగా మార్చింది. ప్రతి గమనిక, ప్రతి లయ ఈ చిత్రంపై అభిమానుల ఆసక్తిని, అంచనాలను రెట్టింపు చేసేలా ఉంది.
'ట్రాన్స్ ఆఫ్ ఓమి' యొక్క అద్భుతమైన విజయం తర్వాత విడుదలైన ఈ 'గన్స్ ఎన్ రోజెస్' గీతం.. సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకొని వెళ్ళింది. ఈ గీతం 'ఓజీ' ప్రపంచంలోకి దూసుకెళ్లి.. దాని గందరగోళం, భావోద్వేగాలు మరియు భారీ యుద్ధాలను అన్వేషిస్తుంది. ఇది సినిమా గుర్తింపులో ఒక అంతర్భాగంగా మారింది. ఇది కేవలం పాట కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన శక్తివంతమైన పాత్ర గంభీర యొక్క క్రూరమైన ప్రపంచం మరియు అతని చుట్టూ ఉన్న ప్రమాదకరమైన శక్తులను పరిచయం చేసే ఒక గ్లింప్స్.
సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానున్న ఈ సినిమాకి ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో.. ప్రేక్షకుల్లో ఉత్సాహం నెలకొంది. అభిమానులు ఇప్పటికే సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమవుతున్నారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్ర ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలో రానుంది. 'ఓజీ' ట్రైలర్ మరో భారీ సంచలనాన్ని సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
ప్రస్తుతం ఎక్కడా చూసినా 'ఓజీ' పేరు మారుమోగిపోతోంది. 2025లో ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాలలో ఒకటని అందరూ దీనిని అభివర్ణిస్తున్నారు. 'ఓజీ' చిత్రం నుండి ఇప్పటిదాకా విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని, సామాజిక మాధ్యమాల్లో సంచలనం సృష్టించాయి. 'గన్స్ ఎన్ రోజెస్' గీతం కూడా అదే బాటలో పయనిస్తూ సంచలనం సృష్టిస్తోంది.
దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని ఒక సినిమాటిక్ తుఫానుగా రూపొందిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గంభీరగా గర్జించనున్న 'ఓజీ' చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి వంటి అద్భుతమైన తారాగణం ఉంది. రవి కె చంద్రన్ మరియు మనోజ్ పరమహంస అద్భుతమైన విజువల్స్, నవీన్ నూలి పదునైన ఎడిటింగ్, తమన్ అద్భుతమైన సంగీతంతో ఈ చిత్రం థియేటర్లలో తుఫాను సృష్టించడానికి సిద్ధంగా ఉంది.
అభిమానులు, ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ 'ఓజీ' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా స్థాయిని, సినిమాపై రోజురోజుకి పెరిగిపోతున్న అంచనాలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. విడుదల దగ్గర పడుతున్న వేళ, అగ్నికి ఆజ్యం పోసినట్టుగా 'గన్స్ ఎన్ రోజెస్' గీతం విడుదలై, సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేయడమే కాకుండా.. 2025 లో అత్యంత ఎదురుచూస్తున్న సినిమాటిక్ ఈవెంట్‌గా 'ఓజీ' స్థానాన్ని పటిష్టం చేసింది.
బాక్సాఫీస్ గర్జనకు కౌంట్‌డౌన్ మొదలైంది. త్వరలోనే 'ఓజీ' తుఫాను చూడబోతున్నాం.
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్
దర్శకత్వం: సుజీత్
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్
ఇంకా చదవండి: ప్రముఖ దర్శకులు వీరశంకర్, వీఎన్ ఆదిత్య, సముద్ర చేతుల మీదుగా ఘనంగా "యంగ్ అండ్ డైనమిక్" మూవీ ట్రైలర్ లాంఛ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




