రెబెల్ స్టార్ ప్రభాస్ 'ఫౌజీ నుంచి పోస్టర్ రిలీజ్
1 month ago | 5 Views
రెబెల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ #ప్రభాస్ హను కాన్సెప్ట్ పోస్టర్, ప్రీ-లుక్ తో భారీ అంచనాలను సృష్టించింది. మేకర్స్ ఈ రోజు టైటిల్ ని రివల్ చేశారు. సక్సెస్ ఫుల్ పాన్-ఇండియా బ్యానర్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో టి-సిరీస్ గుల్షన్ కుమార్ , భూషణ్ కుమార్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి 'ఫౌజీ' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. ఫౌజీ టైటిల్ ప్రభాస్ సైనికుడి పాత్రను సూచిస్తుంది. 1940 నేపథ్యంలో సాగే ఈ కథలో కాలిపోయిన బ్రిటిష్ జెండా తిరుగుబాటుకు సంకేతంగా కనిపిస్తోంది. చుట్టూ వ్యాపించిన అగ్నిజ్వాలలు, అందులో దాగి ఉన్న సంస్కృత శ్లోకాలు, కోడ్ లాంటి చిహ్నాలు ఈ కథలోని మిథాలజికల్, హిస్టారికల్ అంశాలను సూచిస్తున్నాయి. ముఖ్యంగా మహాభారతంలోని కర్ణుడి ప్రతిరూపంగా హీరోను చూపించే తీరు అద్భుతం. పోస్టర్‌లో ఉన్న శ్లోకాలు చెబుతున్న భావం గమనిస్తే.. అతను పద్మవ్యుహాన్ని ఛేదించిన అర్జునుడిలా, పాండవుల పక్షాన నిలిచే ధర్మయోధుడు. గురువులేని యోధుడు అయిన ఏకలవ్యుడిలా, సహజసిద్ధమైన శౌర్యం కలవాడు.
బ్రాహ్మణుడి జ్ఞానం, క్షత్రియుడి ధర్మం రెండూ అతనిలో వున్నాయి. ప్రభాస్‌ను క్లోజప్ షాట్‌లో చూపించిన తీరు అద్భుతం. అతని కళ్ళలో ఉన్న ఇంటెసిటీ, ఒక యోధుడి ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తాయి. “A Battalion Who Walks Alone” అనే ట్యాగ్‌లైన్ దేశం కోసం ఒంటరిగా పోరాడే సైనికుడి కథని సూచిస్తోంది. “ఫౌజీ” టైటిల్ పోస్టర్ అంచనాలకుమించి వుంది. ఎమోషన్‌కి, గ్రాండ్యూర్‌కి పేరుపొందిన హను రాఘవపూడి, ప్రభాస్‌ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పవర్ ఫుల్ అవతార్ లో చూపించబోతున్నారు. ప్రభాస్ సరసన హీరోయిన్‌గా ఇమాన్వీ నటిస్తోంది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ లు మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సినిమాటోగ్రఫీని సుదీప్ చటర్జీ (ISC) నిర్వహిస్తుండగా, సంగీతాన్ని విషాల్ చంద్రశేఖర్ అందిస్తున్నారు. అనిల్ విలాస్ జాధవ్ ప్రొడక్షన్ డిజైనర్, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. పవర్ ఫుల్ టైటిల్, గ్రేట్ విజువల్ ప్రెజెంటేషన్, టెక్నికల్ టాలెంట్ అన్నింటి కలయికతో “ఫౌజీ” ప్రభాస్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచే పాన్ ఇండియా చిత్రం అవుతుంది.
ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
తారాగణం: ప్రభాస్, ఇమాన్వి, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, జయప్రద, భాను చందర్
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: హను రాఘవపూడి
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
సహ నిర్మాత (T-సిరీస్) : శివ చనన
ప్రెసిడెంట్ (టి-సిరీస్) : నీరజ్ కళ్యాణ్
DOP: సుదీప్ ఛటర్జీ ISC
సంగీతం: విశాల్ చంద్రశేఖర్
ప్రొడక్షన్ డిజైనర్: అనిల్ విలాస్ జాదవ్
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
సాహిత్యం: కృష్ణకాంత్
కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్
కాస్ట్యూమ్ డిజైనర్లు: శీతల్ ఇక్బాల్ శర్మ, టి విజయ్ భాస్కర్
VFX: RC కమల కన్నన్
పబ్లిసిటీ డిజైనర్లు: అనిల్-భాను
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
ఇంకా చదవండి: ఇప్పటివరకు తెలుగు తెరపై ఎవ్వరు చూపించని పాయింట్ తో వస్తున్న " విద్రోహి"
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!




