సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా  'పోలీస్ వారి హెచ్చరిక'ట్రైలర్ విడుదల

సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా 'పోలీస్ వారి హెచ్చరిక'ట్రైలర్ విడుదల

4 months ago | 5 Views

అభ్యుదయ  దర్శకుడు బాబ్జీ దర్శకత్వంలో  బెల్లి జనార్థన్ నిర్మాతగా తూలికా  తనిష్క్ క్రియేషన్స్  పతాకంలో రూపొందిన "పోలీస్ వారి హెచ్చరిక"  ట్రైలర్ ను ప్రముఖ సినీ పెద్దల సమక్షంలో లాంచ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి కిషన్ సాగర్, నళినీ కాంత్ సినిమాటోగ్రాఫర్స్ గా పనిచేయగా గజ్వేల్ వేణు  ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. శివ శర్వాణి ఈ చిత్రానికి ఎడిటింగ్ వర్క్ చేశారు. 

ఈ సందర్భంగా కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. మనమంతా ఇక్కడికి వచ్చామంటే కారణం బాబ్జి మీద ఉన్న గౌరవం. చిత్ర బృందం అందరికీ ఆల్ ద బెస్ట్. అలాగే ఆర్మీ నుండి వచ్చిన నిర్మాత జనార్ధన్ గారితో కలిసి క్రమశిక్షణతో ఈ సినిమాను చేసి ఉంటారు అనుకుంటున్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

నటి ఇంద్రజ మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నమస్కారం. నేను ఈ ఈవెంట్ కు బాబ్జి గారి కోసం ఈ కార్యక్రమానికి వచ్చాను. నా ప్రతి పుట్టిన రోజుకు నన్ను విష్ చేసే సుధాకర్ గారికి ధన్యవాదాలు. జనార్ధన్ గారికి ఈ సినిమాతో మంచి విజయం రావాలి అని కోరుకుంటున్నాను. సినిమా విజయం సాధించేందుకు మీడియా వారు అండగా నిలబడాలని కోరుకుంటున్నాను" అన్నారు. 


నటుడు శుభలేఖ సుధాకర్ మాట్లాడుతూ... "ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారం. సాధారణంగా చిన్ననాటి నుండి మనల్ని పెద్దవారు ఏదో ఒక విషయంలో హెచ్చరిస్తూ ఉంటారు. దానిని మనం మంచికి తీసుకుని ముందుకు వెళ్తే జీవితం ప్రశాంతంగా ఉంటుంది. పోలీసు వారు ఏదైనా హెచ్చరించినప్పుడు దానిని పాటిస్తే అది మనకే మంచిది. ఈ సినిమాలో అన్ని కోణాలు ఉన్నాయి. ఈ సినిమాకు అందరి ఆశీస్సులు ఉండాలి. సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

దర్శకుడు సముద్ర మాట్లాడుతూ... "ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి ఒక ఆదరణ లభిస్తుందని కోరుకుంటున్నాను. సినిమాలో చాలా మంచి ఆర్టిస్టులు నటించారు. మంచి కథతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు బాబ్జి. జులై 18వ తేదీన ప్రేక్షకులు ముందుకు రానున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను" అన్నారు. 

నిర్మాత బెల్లి జనార్ధన్ మాట్లాడుతూ... "పోలీస్ వారి హెచ్చరిక చిత్ర టైలర్ లంచ్ ఈవెంట్ కు వచ్చిన అందరికీ నా నమస్కారం. నేను జీవితంలో ముగ్గురు నమ్ముకున్నాను. తల్లిదండ్రులను, భారతదేశాన్ని అలాగే ఇప్పుడు కళామతల్లిని. నేడు నన్ను కళామతల్లి నిలబెడుతుంది అని నమ్ముతున్నాను. జూలై 18వ తేదీన సినిమాలు అందరూ చూసి మంచి విజయాన్ని అందిస్తారని కోరుకుంటున్నాను" అన్నారు. 

దర్శకుడు బాబ్జి మాట్లాడుతూ... "ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నమస్కారం. సినిమాల కోసం పనిచేసేవారు తాము చేసిన సినిమా విడుదలైన ప్రతిసారి పుడుతూనే ఉంటారు. సినిమా కోసమే పుట్టామని భావిస్తాము. జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వస్తుంది. అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను" అంటూ ముగించారు. 

తారాగణం :  సన్నీ అఖిల్, అజయ్ ఘోష్, రవి కాలే, షాయాజీ షిండే, శుభలేఖ సుధాకర్, కాశీ విశ్వనాథ్, జబర్దస్త్ వినోద్, జబర్దస్త్ పవన్, జబర్దస్త్ శాంతి స్వరూప్, హిమజ, శంకరాభరణం తులసి, జయ వాహిని, మేఘనా  ఖుషి  తదితరులు. 

సాంకేతిక నిపుణులు :  దర్శకుడు : బాబ్జీ, నిర్మాత : బెల్లి జనార్థన్, బ్యానర్ : తూలికా  తనిష్క్ క్రియేషన్స్, సంగీతం :  గజ్వేల్ వేణు 

కెమెరా  :  కిషన్ సాగర్, నళినీ కాంత్, ఎడిటర్  :  శివ శర్వాణి, సహ నిర్మాత : ఎన్.పి సుబ్బా రాయుడు, పిఆర్ఓ : మధు విఆర్ 

డిజిటల్ మార్కెటింగ్ : డిజిటల్ దుకాణం
ఇంకా చదవండి: ఆగస్టు 2 వ వారంలో Mr. సోల్జర్ ( ఫ్రమ్ మిలటరీ మాధవరం) చిత్రం విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

trending

View More