'పాంచ్ మినార్': కుటుంబమంతా నవ్వుకునే క్రైమ్ కామెడీ – రాజ్ తరుణ్

'పాంచ్ మినార్': కుటుంబమంతా నవ్వుకునే క్రైమ్ కామెడీ – రాజ్ తరుణ్

15 days ago | 5 Views

యంగ్ ట్యాలెంటెడ్ రాజ్ తరుణ్ హీరోగా రామ్ కడుముల దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పాంచ్ మినార్’. రాశి సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. గోవింద రాజు ప్రజెంట్ చేస్తున్న ఈ చిత్రాన్ని కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్ పై మాధవి, MSM రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కి  మంచి రెస్పాన్స్ వచ్చింది. నవంబర్ 21న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో రాజ్ తరుణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

పాంచ్ మినార్ ఎప్పుడు మొదలైంది? ఈ కథ ఎలా ఉండబోతుంది ?

-సినిమాని ఈ ఏడాదిలోనే మొదలుపెట్టాం. ఇది ప్రాపర్ క్రైమ్ కామెడీ. కథ నుంచి బయటికి వెళ్లకుండా జానర్ కి తగ్గట్టు ప్రతి సిచువేషన్ లోనూ మంచి ఫన్ ఉంటుంది. స్క్రీన్ ప్లే చాలా ప్రత్యేకంగా ఉంటుంది. నాకు కథ వినగానే చాలా నచ్చింది. నిర్మాతలు సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సమకూర్చారు. మేము అడిగిన ఆర్టిస్టులని ఇచ్చారు. సినిమా మేము అనుకున్న దాని కంటే చాలా బెటర్ గా వచ్చింది.

పాంచ్ మినార్ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి?  

-ఈ సినిమాలో ఒక కీలక మలుపులో వినిపించే పదం అది. దాంతో కథ ఇంకో మలుపు తిరుగుతుంది. వినడానికి  చాలా క్యాచిగా ఉండే పదం కావడంతో టైటిల్ గా పెట్టాం. అంతేగాని పాంచ్ మినార్ అనేది ఒక ఫిజికల్ ఎంటీటీ కాదు.  

ఈ కథ, మీ క్యారెక్టర్ గురించి ఒక్క లైన్ లో చెప్పాలంటే?  


-ఉద్యోగం సంపాదించే క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించాలనుకునే ఓ కుర్రాడు ఎలాంటి సిచువేషన్ లో ఇరుక్కున్నాడు అనేది కథ. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎంత నలిగిపోతుంటే చూసే వాళ్ళకి అంత నవ్వొస్తుంది. ఇది కంప్లీట్ గా ఫిక్షనల్ స్టోరీ.

గతకొంత కాలంగా మీ నుంచి వస్తున్న సినిమాలు అనుకున్న రీచ్ సాదిస్తున్నాయా?  

-ఇప్పటివరకు నేను చేసిన సినిమాల ప్రతి కథలో ఒక కొత్తదనం ఉంటుంది. ఏదో కొత్త పాయింట్ చెప్పారు అనే ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాల్లో కూడా అలాంటి ఒక కొత్తదనం ఉంది.

-నా గత కొన్ని సినిమాల్లో అనుకున్నంత రీచ్ కాలేదు. అయితే దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఈ సినిమా మాత్రం తప్పకుండా ఆడియన్స్ కి రీచ్ అవుతుంది. నాకు నా కెరియర్ విషయంలో ఎలాంటి తొందరపాటు లేదు.  నేను గత ఏడాదిన్నరగా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అవి ఒక్కొక్కటిగా వస్తున్నాయి.

ఇది క్రైమ్ కామెడీ కదా.. మిగతా క్రైమ్ కామెడీ సినిమాలు కి ఎంత డిఫరెంట్ గా ఉంటుంది?  

-జానర్ క్రైమ్ కామెడీ నే కానీ ఇది వైలెంట్ ఫిలిం కాదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసే సినిమాలా ఉంటుంది. ఇందులో మర్డర్ లాంటివి ఉండవు. మోసం చేయడం కూడా క్రైమ్ కిందకి వస్తుంది. అలాంటి ఒక క్రైమ్ చుట్టూ తిరిగే సినిమా ఇది. ఫ్యామిలీ అందరూ కూర్చుని హాయిగా నవ్వుకుంటూ చూడొచ్చు. సినిమా అంతా చాలా మంచి ఫన్ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందా అనే ఎక్సైట్మెంట్ తో చూస్తారు.

రాశి సింగ్ క్యారెక్టర్ గురించి

-రాశి తెలుగు అమ్మాయి కాదు కానీ కష్టపడి తెలుగు నేర్చుకుంది.తన ప్రతి డైలాగు చాలా చక్కగా పలుకుతుంది. ఈ క్యారెక్టర్ లో తను అద్భుతంగా పెర్ఫామ్ చేసింది.

మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గురించి

-శేఖర్ చంద్రతో ఇది నాకు నాలుగో సినిమా. తను నాకు చాలా హిట్ ఆల్బమ్స్ ఇచ్చారు. ఈ సినిమాలో తన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

నవంబర్ 21న చాలా సినిమాలు ఉన్నాయి కదా.. ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నారా?

-అన్ని సినిమాలు ఆడాలి. అన్ని సినిమాలో ఆడినప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది. సినిమా బావుంటే ఆడియన్స్ ఎన్ని సినిమాలు చూడడానికైనా ఇష్టపడతారు. బాగున్న సినిమాలన్నీ చూస్తారు.

డైరెక్టర్ గురించి?  

-ఆయన చాలా సైలెంట్ గా ఉంటారు. కానీ మైండ్ లో చాలా క్లియర్ గా ఉంటారు. క్రైమ్ కామెడీ ఇంత క్లియర్ గా రాయడం అనేది మామూలు విషయం కాదు. జోనర్ నుంచి బయటికి రాకుండా స్క్రీన్ ప్లే ని చాలా అద్భుతంగా రాశారు. అలాగే నటీనటుల నుంచి పెర్ఫార్మెన్స్ కూడా అంతే పర్ఫెక్షన్ తో రాబట్టుకున్నారు.

నిర్మాతల గురించి

-మాధవి గారు చాలా పాషనేట్ ప్రొడ్యూసర్. కంటెంట్ నమ్మే ప్రొడ్యూసర్. సినిమా అవుట్ ఫుట్ పట్ల చాలా హ్యాపీగా ఉన్నారు. తను చాలా ఇన్స్పిరేషన్ పర్సన్. అలాగే గోవింద్ గారు షూటింగ్ సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకున్నారు. సినిమాకి కావలసిన ప్రతిదీ సమకూర్చారు.

మీ జర్నీ పట్ల హ్యాపీగా ఉన్నారా ?

-చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కడో వైజాగ్లో చిన్న కెమెరాలతో షార్ట్ ఫిలిమ్స్ చేసుకునే నేను 20 ఫీచర్ ఫిలిమ్స్ చేశాను. ఇంతకంటే ఏం కావాలి. ఫిలిం మేకింగ్ ప్రాసెస్ ని నేను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా బెటర్ సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాను.

మీరు డైరెక్షన్ కూడా చేస్తారని విన్నాం?  

-నేను కచ్చితంగా డైరెక్షన్ చేస్తాను. అయితే అది ఇప్పుడే కాదు. డైరెక్షన్ చేయాలంటే ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకోవాలి. దానికి సంబంధించిన ప్రిపరేషన్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి కొంత టైం పడుతుంది.

మీ నుంచి కొత్తగా రాబోయే సినిమాలు ఎలా ఉండబోతున్నాయి  ?

-నిన్న ఓపెనింగ్ చేసిన సినిమా మంచి థ్రిల్లర్. రామ్ భజరంగ్ ఇప్పటివరకు నేను చేసిన సినిమాలో హై యాక్షన్ ఉంటుంది. తెలుగు తమిళ్ లో చేస్తున్న సినిమా కూడా డిఫరెంట్ జానర్ సినిమా.

ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ
ఇంకా చదవండి: ట్రెండ్ సెట్టింగ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా "కిల్లర్" సర్ ప్రైజ్ చేస్తుంది - 'ఫైర్ అండ్ ఐస్' సాంగ్ లాంఛ్ లో డైరెక్టర్ పూర్వజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


trending

View More