13న నవీన్ చంద్ర “అందాల రాక్షసి” రీ రిలీజ్
6 months ago | 5 Views
ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన కల్ట్ క్లాసిక్ హిట్ 'అందాల రాక్షసి' మరోసారి అలరించడానికి సిద్ధమైంది. ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది.నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 10, 2012 న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
భిన్నమైన ప్రేమ కథ, లోతైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు హను రాఘవపూడి. రధన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ గా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మ్యాజిక్ మళ్లీ బిగ్ స్క్రీన్ పై ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇంకా చదవండి: రెగ్యులర్ షూటింగ్ లో చిరంజీవి #మెగా157 చిత్రం
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# అందాల రాక్షసి # నవీన్ చంద్ర




