35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో కీలక పాత్రతో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో కీలక పాత్రతో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

6 days ago | 5 Views

స్వప్న సినిమాస్ ఎల్లప్పుడూ కొత్తదనం ఉన్న కథలకు ప్రాధాన్యమిస్తూ, విభిన్నమైన కథాంశాలు, అద్భుతమైన క్రియేటివ్, కాస్టింగ్‌ సెలెక్షన్స్ తో ముందుకు సాగుతోంది. వారి తాజా చిత్రం 'ఛాంపియన్' జీ స్టూడియోస్‌ సమర్పణలో రూపొందుతున్న పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా. అనంది ఆర్ట్ క్రియేషన్స్ , కాన్సెప్ట్ ఫిలిమ్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కూడా స్వప్న సినిమాస్ తమ ప్రత్యేకతని కొనసాగిస్తోంది. యంగ్ ఛాంప్ రోషన్  హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సంచలనం అనశ్వర రాజన్ తెలుగు సినిమాల్లోకి అడుగుపెడుతుంది. జాతీయ అవార్డు గ్రహీత  ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహిస్తున్నారు.

మేకర్స్ ఎక్సయిటింగ్ అప్డేట్ ఇచ్చారు. 80వ దశకంలో తన నటనతో ప్రేక్షకులను అలరించిన నందమూరి కల్యాణ్ చక్రవర్తి కం బ్యాక్ ఇస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి లంకేశ్వరుడు సినిమాలో ప్రత్యేక పాత్ర చేసిన తర్వాత ఆయన దీర్ఘ విరామం తీసుకున్నారు. దాదాపు 35 ఏళ్ల తర్వాత ఆయన మళ్లీ తెరపై కనిపించబోతున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యం నుంచే స్వప్న సినిమాస్ ఆయన్ను మళ్ళీ స్క్రీన్ పైకి చూపించడానికి ప్రయత్నించింది.  ఇప్పుడు చాంపియన్ కథ, అందులోని ఆయన పాత్రకు ఉన్న డెప్త్ కల్యాణ్ చక్రవర్తిని ఇంప్రెస్ చేశాయి.  కళ్యాణ్ చక్రవర్తి రియలిస్టిక్, కథకు కీలకమైన రాజి రెడ్డి పాత్రలో కనిపిస్తారు. అతని ప్రజెన్స్ ఈ సినిమా ఎమోషన్స్, డ్రామాకి మరింత డెప్త్ ని తీసుకురానుంది.  

ఫస్ట్-లుక్ పోస్టర్ లో గ్రే హెయిర్, స్టన్నింగ్ ఎక్స్ ప్రెషన్ తో,  ఇంటెన్స్ అవతార్ లో కనిపించారు. బ్యాక్ డ్రాప్ లోఉత్సాహభరితమైన వేడుక కథలోని కీలకమైన మూమెంట్ సూచిస్తోంది.


మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఫస్ట్ సింగిల్ గిర గిర గింగాగిరే రిలీజ్ తో ఇటీవల సంగీత ప్రమోషన్లు బ్లాక్ బస్టర్ నోట్ లో ప్రారంభమయ్యాయి. రామ్ మిరియాల పాడిన ఉత్సాహభరితమైన సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంది. రోషన్, అనస్వర రాజన్ జోడి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.

పాట,  ముందుగా విడుదలైన గ్లింప్స్ రెండింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ కోసం అంచనాలు పెరుగుతున్నాయి.

తోట తరణి ప్రీ-ఇండిపెండెన్స్ కాలాన్ని అద్భుతమైన డీటెయిల్స్‌తో రిక్రియేట్ చేశారు, ఆర్. మధీ కెమెరా వర్క్ ఆ ప్రపంచంలోకి మనల్ని లీనం చేస్తుంది. ఈ చిత్రానికి ఎడిటింగ్ బాధ్యతలను లెజెండరీ కోటగిరి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నారు.

ఛాంపియన్ ఈ క్రిస్మస్ డిసెంబర్ 25న గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: రోషన్, అనశ్వర రాజన్, నందమూరి కళ్యాణ్ చక్రవర్తి

సాంకేతిక సిబ్బంది:

ప్రొడక్షన్ బ్యానర్స్: స్వప్న సినిమా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, కాన్సెప్ట్ ఫిల్మ్స్

ప్రెజెంట్స్: జీ స్టూడియోస్

దర్శకత్వం: ప్రదీప్ అద్వైతం

DOP: ఆర్ మదీ

సంగీతం: మిక్కీ జె మేయర్

ప్రొడక్షన్ డిజైనర్: తోట తరణి

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు

PRO: వంశీ-శేఖర్
ఇంకా చదవండి: స్టార్ హీరో కార్తి'అన్నగారు వస్తారు' ట్రైలర్ రిలీజ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!


# ఛాంపియన్    

trending

View More