23న నాగ చైతన్య బర్త్ డేకు రానున్న 'ఎన్.సి-24'  టైటిల్,  ఫస్ట్ లుక్

23న నాగ చైతన్య బర్త్ డేకు రానున్న 'ఎన్.సి-24' టైటిల్,  ఫస్ట్ లుక్

13 days ago | 5 Views

యువ సామ్రాట్ నాగ చైతన్య నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్ ఎన్.సి-24తో థ్రిల్ చేయబోతున్నారు. ఈ చిత్రానికి విరూపాక్షతో సంచలన విజయాన్ని అందుకున్న కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర  ఎల్.ఎల్.పి (ఎస్.వి.సి.సి), సుకుమార్ రైటింగ్స్ ప్రతిష్టాత్మక బ్యానర్లపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సుకుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.  మీనాక్షి చౌదరి  కథానాయికగా నటిస్తున్నారు. లాపతా లేడీస్ ఫేమ్ స్పార్ష్ శ్రీవాస్తవ కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమా మేకర్స్ తాజాగా విడుదల చేసిన స్ట్రైకింగ్ అండ్  ఇమర్సివ్ బి.టి.ఎస్ మేకింగ్ వీడియో సినిమా భారీ స్కేల్, విజన్, అంబిషన్‌ను  చూపించింది. విడుదలైన వెంటనే ఈ గ్లిమ్ప్స్ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సినిమా కోసం జరుగుతున్న కృషి, క్రియేటివ్ వర్క్ అద్భుతంగా కనిపిస్తోంది. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర కుమార్ తంగాల ఎకరాల విస్తీర్ణంలో వందలాది టెక్నీషియన్స్ కష్టపడి నిర్మించిన భారీ సెట్ విజువల్ ఎక్స్‌లెన్స్‌ను ప్రతిబింబిస్తోంది. వీడియోలో నాగ చైతన్య ఫిజికల్, యాక్షన్ ట్రైనింగ్ కట్టిపడేసింది. ఇంటర్నేషనల్ యాక్షన్ కొరియోగ్రాఫర్ జుజి మాస్టర్ పర్యవేక్షణలో ఆయన చేసిన ట్రైనింగ్, పాత్ర కోసం తీసుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా వున్నాయి. మేకింగ్ గ్లిమ్ప్స్‌లో అనేకమంది ఆర్టిస్టులు, పెర్ఫార్మర్లు పాల్గొన్న భారీ సీన్స్ ఆకట్టుకున్నాయి. 


సినిమా ఎలాంటి ఎపిక్ కాన్వాస్ మీద తీర్చిదిద్దబడుతోందో స్పష్టమవుతుంది. అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. మ్యూజిక్ వీడియోకు మరింత మిస్టరీ, ఇంటెన్సిటీని జోడించి, సినిమా ఏ రకం ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుందో ముందుగానే అనుభూతి కలిగిస్తోంది. నవంబర్ 23న నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా టైటిల్,  ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నట్లు టీమ్ అధికారికంగా ప్రకటించింది. ఈ అప్‌డేట్ ఇప్పటికే అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న రివీల్స్‌లో ఒకటిగా మారింది. గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆసక్తికరమైన కాన్సెప్ట్, పవర్‌ఫుల్ టెక్నికల్ టీమ్, డెడికేటెడ్ లీడ్ క్యాస్ట్‌తో, ఎన్.సి-24 మిథికల్ థ్రిల్లర్ జానర్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్లే ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. నాగ చైతన్య కెరీర్‌లో అత్యంత భారీ, అంబిషస్, హై బడ్జెట్ సినిమాల్లో ఎన్.సి-24 ఒకటిగా నిలుస్తోంది. మిథ్‌కు రూటెడ్ థ్రిల్లర్‌గా, యూనిక్  నారేటివ్ ఫ్రేమ్‌వర్క్‌,  హై-ఇంటెన్సిటీ స్టోరీటెల్లింగ్‌తో మునుపెన్నడూ లేని అనుభూతిని అందించబోతోంది. ప్రస్తుతం హైదరాబాదులో యాక్షన్ షెడ్యూల్ జరుగుతోంది. అందులో ప్రధాన నటీనటులూ పాల్గొంటున్నారు.

తారాగణం: నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్ష్ శ్రీవాస్తవ, సాంకేతిక సిబ్బంది: దర్శకత్వం: కార్తీక్ దండు, నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ బి, బ్యానర్స్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర - సుకుమార్ రైటింగ్స్, సమర్పణ: బాపినీడు

సంగీతం: అజనీష్ బి లోక్‌నాథ్, సినిమాటోగ్రాఫర్: రాగుల్ డి హెరియన్, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీ నాగేంద్ర తంగాల, ఎడిటర్: నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరసింహా చారి చెన్నోజు, మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

ఇంకా చదవండి: "రాజు వెడ్స్ రాంబాయి" క్లైమాక్స్ షాకింగ్: కిరణ్ అబ్బవరం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# నాగ చైతన్య     # ఎన్.సి-24    

trending

View More