ఘనంగా "మిస్టర్ రాము" మూవీ ఆడియో రిలీజ్ ఈవెంట్
3 months ago | 5 Views
బొంత రాము హీరోగా నటిస్తున్న సినిమా "మిస్టర్ రాము". ఈ చిత్రంలో అజయ్ ఘోష్ విలన్ గా నటిస్తున్నారు. జబర్దస్త్ అప్పారావు మరో కీ రోల్ పోషించారు. ఈ చిత్రాన్ని రేణుక దేవి ఫిలింస్ బ్యానర్ పై బొంత రాము నిర్మించారు. అజయ్ కౌండిన్య దర్శకత్వం వహించారు. త్వరలో "మిస్టర్ రాము" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమా ఆడియో ఫంక్షన్ కు వచ్చిన మీ అందరికీ థాంక్స్. ఆడియో రిలీజ్ ఈవెంట్ కి ఇంతమంది వచ్చారంటే మీరంతా సినిమాను తప్పకుండా సక్సెస్ చేస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ అజయ్ కౌండిన్య నాకు బాగా పరిచయం. ఈ చిత్రంలో మంచి రోల్ చేసే అవకాశం ఇచ్చారు. మిస్టర్ రాము చిత్రంలో అజయ్ ఘోష్ గారు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. ఈ సినిమాకు హృదయ్ ముగ్దల్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. చరణ్ కెమెరా పనితనం కూడా హైలైట్ అవుతుంది. మిస్టర్ రాము చిత్రాన్ని మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్, హీరో బొంత రాము మాట్లాడుతూ - నాకు హీరోగా నటించాలని కల ఉండేది. దర్శకుడు అజయ్ కౌండిన్య నాకు ఈ సబ్జెక్ట్ చెప్పినప్పుడు కథ నచ్చి తప్పకుండా చేద్దామని ముందుకు వచ్చాను. ఈ చిత్రంలో ఆటో డ్రైవర్ రోల్ లో నటించాను. మిస్టర్ రాము తో పాటు నేను, డైరెక్టర్ అజయ్ కౌండిన్య కాంబినేషన్ లో మరో 9 చిత్రాలు చేయబోతున్నాం. మొత్తం మా కాంబినేషన్ లో 10 సినిమాలు రాబోతున్నాయి. మిస్టర్ రాము సినిమా రిలీజైన వెంటనే మా కొత్త సినిమాను ప్రకటిస్తాం. మాకు సపోర్ట్ చేస్తున్న నా స్నేహితులు, సన్నిహితులు అందరికీ థాంక్స్. అన్నారు.
దర్శకుడు అజయ్ కౌండిన్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాను మెసేజ్, ఎంటర్ టైన్ మెంట్ అంశాలు కలిపి రూపొందించాం. మా ప్రొడ్యూసర్ రాము ఈ చిత్రంలో హీరోగానూ నటించారు. ఆటో డ్రైవర్ క్యారెక్టర్ లో ఆయన నటన ఆకట్టుకుంటుంది. పుష్ప సినిమా విలన్ అజయ్ ఘోష్ గారు మా మీద అభిమానంతో ఈ చిత్రంలో విలన్ గా నటించారు. అలాగే జబర్దస్త్ అప్పారావు గారు అడిగిన వెంటనే నటించేందుకు ఒప్పుకున్నారు. ఆస్పత్రిలో చిన్నపిల్లల కిడ్నాప్స్ నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమా రూపకల్పన సమయంలో హీరో, ప్రొడ్యూసర్ రాము దగ్గర నుంచి ఎంతో సపోర్ట్ లభించింది. నేను చిత్ర పరిశ్రమలో ఎన్నో ఇబ్బందులు పడి నిలబడ్డాను. చిన్న చిత్రాలకు ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ ఉండటం లేదు. చిన్న చిత్రాలు కూడా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాలి. అలా పేరు తెచ్చుకునే సినిమాల్లో దర్శకుడిగా నా మూవీస్ కూడా ఉండాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటి అవంతిక మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో నేను ఓ స్పెషల్ సాంగ్ చేశాను. ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. నేను చేసిన స్పెషల్ సాంగ్ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.
హీరోయిన్ సంధ్య మాట్లాడుతూ - మిస్టర్ రాము సినిమాలో డైరెక్టర్ అజయ్ గారు నాకు హీరోయిన్ గా అవకాశం ఇవ్వడం సంతోషంగా ఉంది. నేను ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఆశించానో అలాంటి మంచి క్యారెక్టర్ ఈ చిత్రంలో నాకు దక్కింది. మా మిస్టర్ రాము మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు
మ్యూజిక్ డైరెక్టర్ హృదయ్ ముగ్దల్ మాట్లాడుతూ - మిస్టర్ రాము చిత్రంలో సాంగ్స్ కంపోజ్ చేయడమే కాదు పాటలు కూడా రాశాను. మీకు పాటలు బాగా నచ్చాయని ఆశిస్తున్నా. పాయ పాయ అనే సాంగ్ హైదరాబాద్ వాసులకు బాగా నచ్చుతుంది. ఈ సినిమా పాటలతో పాటు మూవీని కూడా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నటీనటులు - బొంత రాము, సంధ్య, అజయ్ ఘోష్, జబర్దస్త్ అప్పారావు, అవతింక, తదితరులు
టెక్నికల్ టీమ్
బ్యానర్ - రేణుక దేవి ఫిలింస్
నిర్మాత - బొంత రాము
రచన, దర్శకత్వం - అజయ్ కౌండిన్య
మ్యూజిక్ - హృదయ్ ముగ్దల్
కెమెరా - చరణ్
ఇంకా చదవండి: ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆరోగ్య డైట్ ఫౌండర్ పూడి మహాలక్ష్మయ్య (లక్ష్మణ్ )
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




