మోహ‌న్‌లాల్ పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 18న రిలీజ్

మోహ‌న్‌లాల్ పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ టీజ‌ర్ సెప్టెంబ‌ర్ 18న రిలీజ్

2 months ago | 5 Views

కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ సినిమా అంటే మాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో స్పెష‌ల్‌ క్రేజ్ ఉంటుంది.  అన్ని భాష‌ల ఆడియెన్స్ మోహ‌న్‌లాల్‌ సినిమాల కోసం ఎదురుచూస్తుంటారు.  

ప్ర‌స్తుతం మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్ ఇండియ‌న్ మూవీ వృష‌భ‌లో హీరోగా న‌టిస్తున్నారు మోహ‌న్‌లాల్‌. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ మూవీపై అనౌన్స్‌మెంట్ నుంచే ఎక్స్‌పెక్టేష‌న్స్‌ భారీ స్థాయిలో ఏర్ప‌డ్డాయి. మ‌ల‌యాళ సినీ చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాల్లో ఒక‌టిగా రూపొందుతోన్న వృష‌భ‌ సినిమాకు నంద కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

వృష‌భ  సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మోహ‌న్‌లాల్ గుడ్‌న్యూస్ వినిపించారు.  వృష‌భ టీజ‌ర్‌ను సెప్టెంబ‌ర్ 18న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించారు. "యుద్ధాలు, భావోద్వేగాలు, గ‌ర్జ‌న" అంటూ మోహ‌న్‌లాల్ చేసిన ట్వీట్‌ వైర‌ల్ అవుతోంది. రోర్ ఆఫ్ వృష‌భ‌, ది వ‌ర‌ల్డ్ ఆఫ్ వృష‌భ అంటూ ఈ ట్వీట్‌లో మోహ‌న్‌లాల్ పేర్కొన్నారు.  ఈ ట్వీట్ తోనే టీజ‌ర్‌ను ఎప్పెడెప్పుడూ చూడాలా అనే ఇంట్రెస్ట్‌ను ఫ్యాన్స్‌లో క్రియేట్ చేశారు మోహ‌న్‌లాల్‌.

ట్వీట్‌తో పాటు మోహ‌న్‌లాల్ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటుంది. త్రిశూలం ఆకారంలో ఉన్న క‌త్తి, డాలు ప‌ట్టుకొని ఇంటెన్స్‌ లుక్‌లో  ఈ పోస్ట‌ర్‌లో మోహ‌న్ లాల్ క‌నిపిస్తున్నారు.  యోధుడిగా ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో మోహ‌న్‌లాల్ వృష‌భ సినిమాలో క‌నిపించ‌బోతున్న‌ట్లు పోస్ట‌ర్ చూస్తుంటే తెలుస్తోంది. టీజ‌ర్‌తోనే వృష‌భ‌ ఏ రేంజ్‌లో ఉండ‌బోతుంద‌న్న‌ది ఆడియెన్స్‌కు చూపించ‌బోతున్నారు మేక‌ర్స్‌.  అభిమానుల అంచ‌నాల‌కు ఎన్నో రెట్లు మించి ఈ సినిమా ఉండ‌బోతుంది.


 ఇండియ‌న్ సినిమాల్లోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా వృష‌భ తెర‌కెక్కుతోంది. కాన్సెప్ట్‌, గ్రాండియ‌ర్ విజువ‌ల్స్‌, మ్యూజిక్‌తో ప్రేక్ష‌కుల‌కు స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియ‌న్స్‌ను అందిస్తుంది. టెక్నిక‌ల్‌గా హై స్టాండ‌ర్ట్స్‌లో ఉంటుంది.  త‌రాల పాటు నిలిచిపోయే శ‌క్తివంత‌మైన క‌థాంశంతో ద‌ర్శ‌కుడు నంద‌కిషోర్ వృష‌భ సినిమాను రూపొందిస్తున్నారు.తండ్రీ కొడుకుల అనుబంధం హృద‌యాల‌కు హ‌త్తుకుంటుంది.

  మైథాల‌జీ ఎలిమెంట్స్‌తో పాటు యాక్ష‌న్‌, డ్రామా,  స‌స్పెన్స్ ఇలా అన్నిక‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో విజువల్ వండ‌ర్‌గా వృష‌భ ఉండ‌బోతుంది.   కంప్లీట్ యాక్ట‌ర్ మోహ‌న్‌లాల్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిపోయే సినిమా అవుతుంది. మోహ‌న్‌లాల్‌ లుక్‌, ఆహార్యం, యాక్టింగ్ ... గ‌త సినిమాల‌కు మంచి  ఉంటాయి. వృష‌భ‌లో మోహ‌న్‌లాల్ న‌ట విశ్వ‌రూపాన్ని ఆడియెన్స్ చూస్తారు.

కనెక్ట్ మీడియా, బాలాజీ టెలిఫిలిమ్స్‌తో క‌లిసి అభిషేక్ వ్యాస్ స్టూడియోస్ వృష‌భ సినిమాను నిర్మిస్తోంది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్, సికె పద్మ కుమార్, వరుణ్ మాథుర్, సౌరభ్ మిశ్రా, అభిషేక్ ఎస్ వ్యాస్, విశాల్ గుర్నానీ, జూహీ పరేఖ్ మెహతా వంటి దిగ్గ‌జ నిర్మాత‌లు వృష‌భ సినిమాలో భాగ‌మ‌య్యారు.

వృష‌భ మూవీ పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో నాలుగు భాష‌ల్లో రిలీజ్ అవుతోంది. మ‌ల‌యాళం, తెలుగు భాష‌ల్లో ఏక‌కాలంలో వృష‌భ సినిమా చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. హిందీ, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి: 'కిష్కింధపురి' సక్సెస్ ఆనందాన్ని ఇచ్చింది. నా క్యారెక్టర్ కి వచ్చిన రెస్పాన్స్ వెరీ మెమరబుల్: శాండీ మాస్టర్

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# మోహ‌న్‌లాల్     # వృష‌భ    

trending

View More