"మిరాయ్" నాకు పర్పెక్ట్ కమ్ బ్యాక్ మూవీ, అవేంజర్స్ లో థానోస్ లా "మిరాయ్"లో బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది - మంచు మనోజ్
2 months ago | 5 Views
రాకింగ్ స్టార్ మంచు మనోజ్ "మిరాయ్" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో ఆయన బ్లాక్ స్వార్డ్ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించారు. ఈ నెల 12న "మిరాయ్" సినిమా పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ వైజాగ్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్ స్పీచ్ హైలైట్ గా మారింది.
మంచు మనోజ్ మాట్లాడుతూ - వైజాగ్ తో నాకు ఎంతో అనుబంధం ఉంది. శ్రీ, రాజు భాయ్, బిందాస్, నేను మీకు తెలుసా, వేదం వంటి నా చిత్రాలన్నీ వైజాగ్ లోనే షూటింగ్ చేశాం. "మిరాయ్" ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నగరంలోనే జరుపుకోవడం సంతోషంగా ఉంది. నాకోసం ఈవెంట్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. నా సినిమాలు ఆడినా ఆడకున్నా మీరు నన్ను ఎప్పుడూ లవ్ చేస్తూనే ఉన్నారు. నేను చెట్టు పేరు చెప్పి అమ్ముకోవడానికి నేను కాయ, పండు కాదు. నా కెరీర్ లో గ్యాప్ వచ్చినప్పుడు నన్ను ఇష్టపడేవారంతా ఎప్పుడు నెక్ట్స్ మూవీ చేస్తారని అడిగేవారు. వాళ్ల కోసం ఎలాంటి సినిమా చేయాలనే ఒత్తిడికి లోనయ్యా. కొన్ని ప్రాజెక్ట్స్ నాకు నచ్చితే ప్రొడ్యూసర్స్ కు నచ్చేవి కావు అలా ఏదీ సరైన మూవీ మెటీరియలైజ్ కాలేదు. అలాంటి టైమ్ లో కార్తీక్ ఘట్టమనేని మిరాయ్ స్టోరీ చెప్పాడు. ఇంత గొప్ప ప్రాజెక్ట్ నా దగ్గరకు తీసుకొచ్చినందుకు అతనికి పాదాభివందనం చేయాలనిపించింది. కానీ నాకంటే చిన్నవాడు. నా కమ్ బ్యాక్ మూవీకి "మిరాయ్" కరెక్ట్ అని అప్పుడే ఫిక్స్ అయ్యాను. అవేంజర్స్ లో థానోస్ లా ఈ చిత్రంలో నా బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ఆకట్టుకుంటుంది. నాకూ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ కు కొన్ని దగ్గరి పోలికలు ఉన్నాయి.
నాలాగే బ్లాక్ స్వార్డ్ కు కూడా కుల మతాలు తెలియవు. ఎవరైనా సాటి మనిషిని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోడు. ఈ కథ ప్రకారం 9 పుస్తకాలు దొరికేవరకు ఎదురు ఎవరు వచ్చినా నరికేస్తా వెళ్తాడు. నటుడు ఏ పాత్ర చేశాడు అనేది ముఖ్యం కాదు ఎంతగా ప్రేక్షకుల్ని మెప్పించాడు అనేది ముఖ్యం. బాహుబలిలా ఒక మంచి చిత్రం చేస్తే అందులో నటించిన అందరికీ పేరొస్తుంది. స్క్రిప్ట్ ను, ప్రాజెక్ట్ ను నమ్మి విశ్వప్రసాద్ గారు అన్ కాంప్రమైజ్డ్ గా "మిరాయ్" సినిమాను నిర్మించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో కూడా నేనే డబ్బింగ్ చెప్పాను. తేజ సజ్జ కష్టపడే హీరో. మిరాయ్ కు ఇంకా అనేక సీక్వెల్స్ చేయాలని కోరుకుంటున్నా. ఈ సినిమా చేసేప్పుడు డైరెక్టర్ కార్తీక్ నాతో చెప్పాడు, అన్నా మీ చేతికి తొమ్మిది పుస్తకాలు వస్తే నెక్ట్స్ మీరు శ్రీరాముడితో తలపడాల్సిఉంటుంది అన్నాడు. నేను రాముడి భక్తుడిని ఆయనతో తలపడటమేంటి అని భయపడ్డా. 9 పుస్తకాలు మీ చేతికి వస్తే బ్లాక్ స్వార్డ్ రావణాసురుడు అవుతాడు. అప్పుడు శ్రీరాముడితో పోటీ పడాల్సివస్తుంది. పురణాల నుంచి ఎంతో విషయం సేకరించి ఈ స్క్రిప్ట్ చేశాడు డైరెక్టర్ కార్తీక్. మాతో పాటు ఈ నెలలోనే నేను ప్రేమించే మా పవర్ స్టార్ ఓజీ కూడా థియేటర్స్ లోకి వస్తోంది. అలాగే బెల్లంకొండ సాయి కిష్కిందపురి రిలీజ్ అవుతోంది. అన్ని చిత్రాలు విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
ఇంకా చదవండి: శర్వానంద్ విజనరీ బ్రాండ్ ఓంఐ లాంచ్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




