హైదరాబాద్‌లో కలిసిన మెగాస్టార్ 'మన శంకరవరప్రసాద్ గారు' - పూరి-విజయ్ సేతుపతి టీమ్స్
2 months ago | 5 Views
హైదరాబాద్ ఫిల్మ్ స్టూడియోలో ఇద్దరు పవర్‌హౌస్ స్టార్‌లు కలుసుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కలుసుకున్న మూమెంట్ రెండు యూనిట్లకూ ఎనర్జీని నింపింది. చిరంజీవి ప్రస్తుతం హైదరాబాద్‌లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో మన శంకరవర ప్రసాద్ గారు కోసం ఒక కలర్ ఫుల్ పాట చిత్రీకరణలో ఉన్నారు. మెగాస్టార్, నయనతారలపై ఈ సాంగ్ షూట్ చేస్తున్నారు. అదే కాంప్లెక్స్‌లోని సమీపంలోని విజయ్ సేతుపతి పూరి జగన్నాధ్ కలిసి చేస్తున్న హై-ఆక్టేన్ మూవీ షూటింగ్ జరుగుతోంది.
ఇందులో టబు కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇలా రెండు టీమ్‌లు కలుసుకోవడంతో హార్ట్‌వార్మింగ్ క్రాస్‌ఓవర్‌గా మారిపోయింది. షూటింగ్ మధ్యలో స్టార్స్ కలుసుకోవడంతో సెట్‌లో మరింత ఎనర్జీ పెరిగింది. విజువల్ కాంట్రాస్ట్ కూడా ఫ్యాన్స్‌కి విజువల్ ఫీస్ట్ గా మారింది. చిరంజీవి స్టైలిష్ సూట్‌లో చరిస్మాటిక్ గా కనిపిస్తే, విజయ్ సేతుపతి తన సిగ్నేచర్ స్టైల్‌లో లుంగీ లుక్‌తో కూల్‌గా కనిపించారు. ఫోటోలో చిరంజీవి – విజయ్ సేతుపతి తో పాటు డైరెక్టర్స్ అనిల్ రావిపూడి, పూరి జగన్నాథ్, అలాగే చార్మీ కౌర్, బ్రహ్మాజీ, విటివి గణేష్ కూడా హ్యాపీ స్మైల్స్‌తో కనిపించారు.
నయనతార, టబు ప్రెజెన్స్ కూడా ఆ మూమెంట్‌కి స్టార్ స్టడెడ్ ఆరా యాడ్ చేసింది. ‘మన శంకర వర ప్రసాద్ గారు’ 2026 సంక్రాంతికి గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతుంటే, విజయ్ సేతుపతి – పూరి జగన్నాథ్ యాక్షన్ ఎంటర్టైనర్ 2026 ఆరంభంలో థియేటర్లలోకి రావడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఇంకా చదవండి: మంచు లక్ష్మి ‘దక్ష’ ట్రైలర్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు.. సెప్టెంబర్ 19న సినిమా విడుదల
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




