మెగాస్టార్ చిరంజీవి 70వ పుట్టిన రోజు సందర్భంగా "త్రిశెంకినీ" టైటిల్ విడుదల
3 months ago | 5 Views
ఎన్. బి. జె. ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఎన్ బిక్కునాథ్ నాయక్ నిర్మిస్తున్న సినిమా "త్రిశెంకినీ". ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు రంజిత్ కుమార్. పలువురు నూతన నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ లాంఛ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ హాస్య నటుడు బాబు మోహన్ అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో..
నటుడు బాబుమోహన్ మాట్లాడుతూ - మెగాస్టార్ చిరంజీవి అన్నగారి బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మెగాస్టార్ గారు మరిన్ని గొప్ప విజయాలు సాధించాలి, తన నటన, డ్యాన్సులతో మనల్ని అలరించాలని కోరుకుంటున్నా. అలాగే మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా త్రిశెంకినీ సినిమా టైటిల్ లాంఛ్ చేసుకోవడం సంతోషంగా ఉంది. మెగాస్టార్ చిరంజీవి అన్నగారి మీద దేవుడు ఎంత ఆశీర్వాదం చూపించాడో, అంతే ఈ సినిమా మీద, మీ మీద చూపించాలని కోరుతున్నా. ఈ సినిమా మంచి విజయం సాధించాలి, మీరంతా సపోర్ట్ చేయాలి అన్నారు.
నిర్మాత ఎన్. బిక్కునాథ్ నాయక్ మాట్లాడుతూ - ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నాకు సినిమాలంటే ప్యాషన్. కృష్ణ గారి అభిమానిని. గతంలో పాటలు కూడా రాశాను. ఓ చిత్ర రూపకల్పనకు ప్లాన్ చేశాం. రంజిత్ గారితో పరిచయం ఏర్పడింది. త్రిశెంకినీ సినిమా గురించి చెప్పినప్పుడు తప్పకుండా మనం ట్రావెల్ చేద్దామని చెప్పాను. అలా ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకు వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో ఓ సరికొత్త మూవీ చేశాం. మా మూవీకి మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. అన్నారు.
నటుడు, దర్శకుడు రంజిత్ కుమార్ మాట్లాడుతూ - నేను చిరంజీవి గారి అభిమానిని. మాది తిరుపతి. చదువుకునే రోజుల నుంచి ఆయన సినిమాలు క్రమం తప్పకుండా చూస్తుంటేవాళ్లం. నేను ఏ ఊరిలో ఉన్నా అక్కడ తప్పకుండా మెగాస్టార్ గారి బర్త్ డే సెలబ్రేట్ చేస్తుంటాను. ఈ రోజు ఆయన బర్త్ డే సందర్భంగా మా త్రిశెంకినీ సినిమా టైటిల్ లాంఛ్ చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రంలో జై జై మెగాస్టార్ అనే పాట రూపొందించాం. ఆ పాట మెగాభిమానులు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. కాపీ రైట్ లేదు. మీ అందరి ఆశీర్వాదంతో మా సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు.
అతిథిగా వచ్చిన డా.రాజేంద్ర మాట్లాడుతూ - త్రిశెంకినీ సినిమా టైటిల్ లాంఛ్ కు వచ్చిన అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సరికొత్తగా ఉంటుంది. ఇలాంటి మూవీని మీరు ఇప్పటిదాకా చూసి ఉండరు. అంత కొత్తగా డైరెక్టర్ రంజిత్ కుమార్ గారు ఈ సినిమాను రూపొందించారు. ఆయన కాలేజ్ లెక్చరర్ గా ఎంతోమంది విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. ఇప్పుడు సినిమా మాధ్యమం ద్వారా కళారంగానికి సేవ చేయాలని ముందుకొచ్చారు. ఈ త్రిశెంకినీ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా అన్నారు.
నటీనటులు : రంజిత్ కుమార్, పలువురు నూతన నటీనటులు
టెక్నికల్ టీమ్:
బ్యానర్ : ఎన్.బి.జె ప్రొడక్షన్స్
నిర్మాత : ఎన్ బిక్కునాథ్ నాయక్
రచన, దర్శకత్వం : రంజిత్ కుమార్
మ్యూజిక్ : వీఆర్ కే
కెమెరా, ఎడిటింగ్, వీఎఫ్ఎక్స్ : విశ్వక్ స్టూడియో
పీఆర్ఓ: చందు రమేష్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# త్రిశెంకినీ # చిరంజీవి




