ఘనంగా 'లిటిల్ హార్ట్స్' విజయోత్సవ వేడుక
2 months ago | 5 Views
మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన "లిటిల్ హార్ట్స్" సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను అద్భుతంగా ప్రమోట్ చేసి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ బన్నీ వాస్ తన బీవీ వర్క్స్, వంశీ నందిపాటి తన వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై వరల్డ్ వైడ్ గ్రాండ్ గా థియేట్రికల్ గా రిలీజ్ చేశారు. "లిటిల్ హార్ట్స్" సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందుతూ, సూపర్ హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
ఈటీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాకు మంచి టాక్ వస్తోంది. ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. టికెట్ బుకింగ్స్ భారీగా జరుగుతున్నాయి. సినిమా జెన్యూన్ గా సక్సెస్ అయితేనే మేము ఈటీవీ విన్ నుంచి సక్సెస్ మీట్స్ పెడతాం. "లిటిల్ హార్ట్స్" సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని ఇంత బాగా ఆడియెన్స్ లోకి తీసుకెళ్లింది మా బన్నీ వాస్ గారు, వంశీ నందిపాటి గారు. "లిటిల్ హార్ట్స్" సినిమా విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ బన్నీవాస్ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" లాంటి చిన్న సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందో అనే సందేహంతోనే నిన్న ఉదయం 11 గంటలకు 3 షోస్ తో ప్రీమియర్స్ స్టార్ట్ చేశాం. సాయంత్రం 7 గంటలకు 29 షోస్ పడ్డాయి. ఈ షోస్ అన్నీ దాదాపు 90 పర్సెంట్ ఫిల్ అయ్యాయి. ఇప్పుడు మల్టీప్లెక్స్ లో ఒక్క టికెట్ కూడా లేదు. మొత్తం సేల్ అయ్యాయి. రేపు శనివారం కూడా బుక్ అవుతున్నాయి. ఒక చిన్న చిత్రానికి ప్రేక్షకులు అసాధారణ విజయాన్ని అందించడం గొప్ప విషయం. మేము ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రేక్షకులు నిజం చేశారు. ఒక మంచి సినిమా అందిస్తే అది చిన్నదా పెద్దదా అని చూడకుండా సక్సెస్ చేస్తారని ప్రూవ్ చేశారు. ఈ రోజు ప్రేక్షకులు కేవలం సూపర్ హిట్ చిత్రాలకే వెళ్తున్నారు. మా మూవీకి పెరుగుతున్న షోస్, టికెట్ సేల్స్ చూస్తే "లిటిల్ హార్ట్స్" సూపర్ హిట్ సినిమా అనే చెప్పాలి. ఈటీవీ విన్ వారు ఈ సినిమాను దాదాపు 50 రోజుల వరకు ఓటీటీలోకి తీసుకురావొద్దని కోరుతున్నా. ఈటీవీ నుంచి నువ్వే కావాలి లాంటి బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. "లిటిల్ హార్ట్స్" వైల్డ్ ఫైర్ లా వెళ్తోంది. అనూహ్యమైన వసూళ్లు ఈ సినిమాకు వస్తాయి. "లిటిల్ హార్ట్స్" లాంటి చిత్రాల ద్వారానే మాకు గౌరవం పెరుగుతుంది. ప్రేమలు వంటి సినిమాలు చూశాక మన తెలుగులో అలాంటి మూవీస్ అందిస్తే తప్పకుండా ఆదరిస్తారని అనిపించేది. "లిటిల్ హార్ట్స్" తో అది నిజమైంది. ఈ సినిమాను మాకు ఇచ్చిన ఆదిత్య హాసన్ కు, ఈటీవీ విన్ వారికి థ్యాంక్స్. ఈ చిత్రాన్ని కాలేజ్ స్టూడెంట్స్ మీ ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీతో వెళ్లి చూడండి బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. మంచి కంటెంట్ తో వస్తే ఊహించనంత కలెక్షన్స్ ఇస్తామని ప్రేక్షకులు మరోసారి ప్రూవ్ చేశారు. డైరెక్టర్ సాయి మార్తాండ్ ఒక ఆంథెటిక్, ఆర్గానిక్ ఎంటర్ టైన్ మెంట్ తో మూవీని రూపొందించాడు. మౌళి అందరినీ ఆకట్టుకున్నాడు. ఒక కొత్త స్టార్ గా తనను తాను మౌళి మలుచుకోబోతున్నాడు అనిపిస్తోంది. శివానీ కూడా బాగా నటించింది. ఈ చిత్రాన్ని మాకు ఇచ్చిన ఆదిత్య హాసన్ కు థ్యాంక్స్. ఈటీవీ నుంచి నువ్వే కావాలి వచ్చింది. ఇన్నేళ్లకు మరో నువ్వే కావాలి లాంటి సక్సెస్ మాకు దక్కింది. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అంతగా "లిటిల్ హార్ట్స్" చూసి నవ్వుకున్నాం, ఆ సినిమా స్థాయి విజయం వస్తుందంటూ సోషల్ మీడియాలో అప్రిషియేషన్స్ వస్తున్నాయి. మాకు ఇలాంటి గొప్ప సక్సెస్ ఇచ్చిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. అన్నారు.
హీరో మౌళి తనుజ్ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రీమియర్స్ నుంచే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం హ్యాపీగా ఉంది. మా సినిమాను సూపర్ హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్. 3 షోస్ నుంచి ప్రీమియర్స్ మొదలై 29 షోస్ కు పెరిగాయి. ఇదంతా మా బన్నీ వాస్ గారి ప్లానింగ్. మా సినిమాను వారు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారని తెలియగానే నా సన్నిహితులు చెప్పారు మీరు రిలాక్స్ కావొచ్చు. వాళ్లు గ్రాండ్ గా రిలీజ్ చేస్తారని. బన్నీ వాస్ గారు డిస్ట్రిబ్యూషన్ లో ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు. "లిటిల్ హార్ట్స్" సినిమా ఈటీవీ విన్ వారి దగ్గరకు తీసుకెళ్లినప్పుడే చెప్పాను. ఇది థియేట్రికల్ మూవీ అని. నేను చెప్పినట్లే ఈ రోజు థియేటర్స్ లో మా సినిమాకు మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. ఇంకా మూవీ చూడని ప్రేక్షకులు "లిటిల్ హార్ట్స్" చూడండి. బాగా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ శివానీ నాగరం మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాకు ప్రీమియర్స్ నుంచి సూపర్ హిట్ టాక్ వచ్చింది. థియేటర్స్ దగ్గర రెస్పాన్స్ చాలా బాగుంది. మా మూవీని హిట్ చేసిన ఆడియెన్స్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ మధ్య కాలంలో ఇలాంటి మంచి రోమ్ కామ్ రాలేదు. మా సినిమాలోని క్యారెక్టర్స్, డైలాగ్స్, మ్యూజిక్..ఇలా ప్రతి అంశం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. సినిమా చూస్తున్న వాళ్లు ప్రతి షో తర్వాత మాకు సోషల్ మీడియా ద్వారా తమ రెస్పాన్స్ తెలియజేస్తున్నారు. కాలేజ్ స్టూడెంట్ "లిటిల్ హార్ట్స్" చిత్రాన్ని చూడాలి. మీరు బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" కథ రాశాక, కొన్ని ప్రొడక్షన్ కంపెనీస్ కు స్క్రిప్ట్ పంపాను. ఆ ప్రొడ్యూసర్స్ ఈ మధ్య రోమ్ కామ్స్ ఎవరు చూడటం లేదు అని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత ఈ కథ మౌళికి చెబితే బాగుందని, సాయి కృష్ణ అన్నకు చెప్పించారు. ఆయనకూ నచ్చింది. ఆదిత్య హాసన్ ప్రొడక్షన్ లోకి వచ్చారు. బన్నీవాస్ గారు, వంశీ గారు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలా "లిటిల్ హార్ట్స్" ఒక సక్సెస్ ఫుల్ సినిమాగా ప్రేక్షకుల ఆదరణ పొందింది. రోమ్ కామ్స్ ఎవరు చూస్తారన్న అదే ప్రొడ్యూసర్స్ ఈ రోజు మన వాళ్లకు ఫోన్ చేసి చాలా ఎంజాయ్ చేశాం సినిమా అంటున్నారు. ఈ కథ విన్న వెంటనే మౌళి, చాలా హ్యాపీగా ఉంది. నా మొదటి సినిమా రొమాంటిక్ కామెడీ ఉండాలని కోరుకున్నా. ఒక చిన్న బడ్జెట్ లో మంచి లవ్ స్టోరీ చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మాను. అది ఈరోజు నిజం కావడం సంతోషంగా ఉంది. అన్నారు.
ఈటీవీ విన్ కంటెంట్ హెడ్ నితిన్ మాట్లాడుతూ - "లిటిల్ హార్ట్స్" సినిమాకు ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ఇంత పెద్ద విజయం దక్కడం నమ్మలేకపోతున్నాం. టికెట్స్ కావాలంటూ, షోస్ పెంచాలంటూ డిమాండ్ ఏర్పడుతోంది. ఈటీవీ నుంచి నచ్చావులే అనే చిన్న సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. 17 ఏళ్ల తర్వాత మళ్లీ "లిటిల్ హార్ట్స్" తో అలాంటి పెద్ద సక్సెస్ అందుకున్నాం. చిన్న చిత్రాల్లో "లిటిల్ హార్ట్స్" హ్యూజ్ సక్సెస్ అందుకున్నట్లే. మౌళి, ఆదిత్య హాసన్, సాయి మార్తాండ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. బన్నీ వాస్ గారు, వంశీ నందిపాటి గారు ఒక పెద్ద సినిమాను ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తారో "లిటిల్ హార్ట్స్" కూడా అలాగే డిస్ట్రిబ్యూట్ చేశారు. అన్నారు.
నటీనటులు - మౌళి తనూజ్, శివానీ నాగరం, రాజీవ్ కనకాల, ఎస్ ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్, తదితరులు
టెక్నికల్ టీమ్
రచన, దర్శకత్వం - సాయి మార్తండ్
ప్రొడ్యూసర్ - ఆదిత్య హాసన్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
మ్యూజిక్ - సింజిత్ యెర్రమల్లి
సినిమాటోగ్రఫీ - సూర్య బాలాజీ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
ఆర్ట్ డైరెక్టర్ - దివ్య పవన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - వినోద్ నాగుల, మురళి పున్న
డిస్ట్రిబ్యూషన్ - బన్నీవాస్, వంశీ నందిపాటి
డిస్ట్రిబ్యూషన్ బ్యానర్స్ - బీవీ వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్
ఇంకా చదవండి: రజనీకాంత్ ‘కూలి’ సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో గ్లోబల్ ప్రీమియర్
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# లిటిల్ హార్ట్స్ # మౌళి తనూజ్ # శివానీ నాగరం # రాజీవ్ కనకాల




