ఆసక్తికరంగా  ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌

ఆసక్తికరంగా ‘సార్‌ మేడమ్‌’ టీజర్‌

4 months ago | 5 Views

దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు విజయ్‌ సేతుపతి. ఇక నిత్యామీనన్‌ అభినయ ప్రతిభ గురించి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ డ్రామాకు ‘సార్‌ మేడమ్‌’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమాకు పాండిరాజ్‌ దర్శకుడు. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది.తాజాగా ఈ చిత్రానికి సంబంధించి  టీజర్‌ను విడుదల చేశారు. భార్యభర్తల మధ్య వచ్చే అలకలు, సరదా సంఘటనలు, అనుకోని గొడవల నేపథ్యంలో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి.


టీజర్‌ చివరలో విజయ్‌ సేతుపతి గన్‌ పట్టుకొని కనిపించడం కథలోని యాక్షన్‌ ఎలిమెంట్‌పై ఇంట్రెస్ట్‌ను క్రియేట్‌ చేసింది. యోగిబాబు, ఆర్‌కే సురేష్‌, చెంబన్‌ వినోద్‌ జోస్‌, శర్వణన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, నిర్మాతలు: సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌, దర్శకత్వం: పాండిరాజ్‌.

ఇంకా చదవండి: పవన్‌ షూటింగ్‌ స్పాట్‌లో చిరు ప్రత్యక్షం

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# సార్‌ మేడమ్‌     # విజయ్‌ సేతుపతి    

trending

View More