హోంబలె ఫిల్మ్స్ సమర్పణలో, రవి బస్రూర్ రూపొందించిన వీర చంద్రహాస సెప్టెంబర్ 19న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్
2 months ago | 5 Views
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించిన మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఈనెల 19న విడుదల కాబోతున్న వీర చంద్రహాస
కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ తెలుగులో విడుదల చేస్తున్న కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్‌గా రాధాకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’, ప్రజ్వల్ దేవరాజ్ నటించిన ‘రాక్షస’ చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసిన ఆయన.. తాజాగా ‘వీర చంద్రహాస’ తెలుగు రైట్స్‌ను దక్కించుకున్నారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు.
ఇటీవల ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టించి మూడు వందల కోట్లు కలెక్షన్స్ రాబట్టిన మహావతార్ నరసింహ తర్వాత హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో విడుదల చేస్తున్న వీర చంద్రహాస చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. ఆ చిత్రం తరహాలోనే ఇది కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతుందని నిర్మాతలు అన్నారు.
కేజీయఫ్, సలార్ లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ‘వీర చంద్రహాస’ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై
ఎన్ ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మూవీ తెలుగు రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల హీరో విశ్వక్ సేన్ విడుదల చేసిన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
వీర చంద్రహాస అనేది 'మహాభారతం'లోని అశ్వమేధిక పర్వంలోని కథ. ఇది ఒక అనాథ కుర్రాడి గొప్ప కథను చెబుతుంది. పరాక్రమవంతుడు, సద్గుణవంతుడు వీర చంద్రహాసుడు అవుతాడు. సినిమా చరిత్రలో మొట్టమొదటిసారిగా యక్షగానం వెండితెరపై పూర్తి వైభవంతో రావడం ప్రేక్షకులకు గొప్ప సినిమాటిక్ ఎక్స్‌పీయెన్స్ ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత ఎమ్‌వీ రాధాకృష్ణ మాట్లాడుతూ ‘కన్నడలో విడుదలైన ‘ వీర చంద్రహాస ’ చిత్రం హిట్ టాక్‌తో పాటు మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ మూవీ తెలుగు రైట్స్ దక్కించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రానికి కూడా తెలుగు ఆడియెన్స్ బ్రహ్మారథం పడతారని ఆశిస్తున్నా. సినిమా సక్సెస్ గ్యారెంటీ అని నమ్ముతున్నా . తనదైన సంగీతంతో అందర్నీ మెప్పించిన రవి బస్రూర్ దర్శకుడిగానూ సత్తా చాటడం సంతోషంగా ఉంది. ఇటీవల విడుదలైన మహావతార్ నరసింహ చిత్రం తరహాలోనే ఈ చిత్రం కూడా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని బలంగా నమ్ముతున్నాం’ అని అన్నారు.
సంగీత దర్శకుడు, దర్శకుడు రవి బస్రూర్ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్‌గా నేను రూపొందించిన ఈ సినిమాను కన్నడ ప్రేక్షకులు బాగా ఆదరించారు. తెలుగు ఆడియెన్స్‌కు కూడా కచ్చితంగా నచ్చుతుందని భావిస్తున్నా. శివ రాజ్‌కుమార్ గారితో పాటు ఇందులో నటించిన నటీనటులంతా చాలా బాగా సపోర్ట్ చేశారు. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎమ్‌వీ రాధాకృష్ణ గారు మా చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు’ అని అన్నారు.
చిత్రం : వీర చంద్రహాస
నటీ నటులు : శివరాజ్ కుమార్, శిథిల్ శెట్టి, నాగశ్రీ జిఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ తదితరులు
సమర్పణ : హోంబలే ఫిల్మ్స్
బ్యానర్ : ఓంకార్ మూవీస్
సినిమాటోగ్రాఫర్ :కిరణ్ కుమార్ ఆర్
కథ, కథనం, దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ : రవి బస్రూర్
నిర్మాత : ఎన్ ఎస్ రాజ్‌కుమార్ - ఎమ్‌వీ రాధాకృష్ణ, జేమ్స్ డబ్యూ కొమ్ము
తెలుగు రైట్స్ : కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్(ఎమ్‌వీ రాధాకృష్ణ)
పిఆర్ఓ : భూషణ్ - హర్ష
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# రవి బస్రూర్ # వీర చంద్రహాస




