*అమ్మాయిల్లో నమ్మకాన్ని కలిగించే ‘దేవిక అండ్ డానీ’ వంటి వెబ్ సిరీస్ చేయటం నా అదృష్టంగా భావిస్తున్నాను - హీరోయిన్ రీతూవర్మ
6 months ago | 5 Views
జియోహాట్‌స్టార్, డిస్నీ+ హాట్‌స్టార్ నుంచి జియో హాట్ స్టార్‌గా పున: నిర్మితమై ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు తిరుగులేని, బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోన్న సంగతి తెలిసిందే.తాజాగా హాట్‌స్టార్ స్పెషల్స్‌లో భాగంగా, ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘దేవిక అండ్ డానీ’ అనే వెబ్ సిరీస్‌ను జూన్6 నుంచి అందిస్తుంది. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూ వర్మ, సూర్య వశిష్ట, శివ కందుకూరి, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, కోవై సరళ, సోనియా సింగ్, గోకరాజు రమణ, శివన్నారాయణ, వివా హర్ష, షణ్ముఖ్, అభినయ శ్రీ, మౌనికా రెడ్డి, ఈశ్వర్య వుల్లింగల తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. బి.కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చాగంటి దీన్ని నిర్మించారు. జూన్6 నుంచి ఈ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో...
హీరోయిన్ రీతూవర్మ మాట్లాడుతూ ‘‘వెబ్ సిరీస్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. ఔట్ ఆఫ్ ది బాక్స్ కాన్సెప్ట్ వస్తే చేద్దామనుకున్నాను. ఆ సమయంలో ‘దేవిక అండ్ డానీ’ వంటి నిజాయతీతో కూడిన కథ నా దగ్గరకు వచ్చింది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి ఓ కథను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా సుధాకర్‌గారికి థాంక్స్. ఆయన మంచి సినిమాలను, సిరీస్‌లను అందించాలనే ఉద్దేశంతో జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌ను స్టార్ట్ చేశారు. ఇంకా ఇలాంటి సిరీస్‌లు, సినిమాలను ఎన్నింటినో చేయాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ కిషోర్‌గారు చాలా సరదాగా ఉండే వ్యక్తి. ఫోకస్‌గా ఉంటారు. వెంకట్ దిలీప్‌గారు మిస్టర్ పర్‌ఫెక్ట్. ఇప్పుడు స్క్రీన్‌పై చూస్తుంటే ఆయన ఎంత గొప్పగా ఆలోచించారో అర్థమవుతుంది. మా డానీ సూర్య ఎంతో హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా ఇన్‌వాల్వ్ అయ్యి నటించాడు. సుబ్బు పాత్రలో నటించిన శివ కందుకూరి తన పాత్రలో ఒదిగిపోయారు. సుబ్బరాజుగారు, కోవైసరళగారు సహా ఎంటైర్‌టీమ్‌కు థాంక్స్. నందిని ఎంతో హార్డ్ వర్క్ చేసింది. తనకు స్పెషల్ థాంక్స్. చాలా మంది అమ్మాయిలకు చుట్టు పక్కల ఉండేవాళ్లు నువ్వు ఇది చేయలేవు అని చెప్పి డిస్కరేజ్ చేస్తుంటారు. కానీ అలాంటి వారికి ఈ సిరీస్ ఓ నమ్మకాన్ని కలిగిస్తుంది. మా సిరీస్ ‘దేవిక అండ్ డానీ’ జూన్6 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది’’ అన్నారు.
సూర్యవశిష్ట్ మాట్లాడుతూ ‘‘సాధారణంగా ఊర్లలో ఉండే అమ్మాయిలకు చాలా ఇబ్బందులుంటాయి. ఈ పని చేయాలని, ఆ పని చేయకూడదని అంటుంటారు. అలాంటివాళ్లు బయటకు వెళితే ఎలా మారుతారనే ఓ విషయాన్ని చక్కగా ‘దేవిక అండ్ డానీ’లో చూపించారు. దేవిక అనే అమ్మాయి జీవితాన్ని డానీ, సుబ్బు లాంటి పాత్రలు ఎలా మార్చాయనేది కూడా ఇందులో చూడొచ్చు. తప్పకుండా ఈ సిరీస్ అందరికీ నచ్చుతుంది. నిర్మాత సుధాకర్ అరుదైన వ్యక్తి. మా డైరెక్టర్ కిషోర్‌గారు మా ఫ్యామిలీ మెంబర్‌లా మాతో కలిసిపోయారు. సినిమాటోగ్రాఫర్ దిలీప్‌గారి ఫ్రేమింగ్, లైటింగ్ సూపర్బ్. నందినిగారు బిహైండ్ ది సీన్స్ ఎంతో కష్టపడ్డారు. ఫ్రెష్ కంటెంట్‌ను అందిస్తోన్న జియో హాట్‌స్టార్‌కి థాంక్స్. రీతూవర్మ చాలా మంచి కోస్టార్. శివ కందుకూరి అయితే నా బ్రదర్‌లా మారిపోయారు. తను అద్భుతంగా నటించాడు. డానీ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. ఆడియెన్స్‌కు అన్నీ పాత్రలు చక్కగా కనెక్ట్ అవుతాయి’’ అన్నారు.
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!




