సింగరేణి కార్మికుల నిజ జీవిత కథతో హీరో సాగర్ పాన్ ఇండియా చిత్రం.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

సింగరేణి కార్మికుల నిజ జీవిత కథతో హీరో సాగర్ పాన్ ఇండియా చిత్రం.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

2 months ago | 5 Views

'ది 100’ సినిమాతో రీసెంట్‌గా హిట్ కొట్టిన హీరో సాగర్ మరో వినూత్న ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని అలరించేందుకు రెడీ అవుతున్నారు. సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు సాగర్ ముందడుగు వేశారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.  సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో చాలా తక్కువ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.

సింగరేణి కార్మికుల దుర్భలమైన జీవితాలు, వారి కష్టాల్ని తెరపై ఆవిష్కరించేందుకు ‘జార్జి రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి ముందుకు వచ్చారు. ‘జార్జి రెడ్డి’ చిత్రంతో మేకర్‌గా జీవన్ రెడ్డికి మంచి ఇమేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోసారి తెలంగాణ నేపథ్యంలోని సింగరేణి బ్యాక్ డ్రాప్‌పై సినిమాను తెరకెక్కించేందుకు సిద్దమయ్యారు. 

సింగరేణి కార్మికుల నిజ జీవిత కథతో హీరో సాగర్ పాన్ ఇండియా చిత్రం.. త్వరలోనే  రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం - Latest Movie Updates, Film News, Movie  Reviews,Press Notes ...

సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతదేశ సినీ ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు. మైనింగ్ ప్రాంతాల కఠినమైన వాతావరణం, కార్మికుల దినచర్య, వారి త్యాగాలు వంటి అంశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని చెబుతున్నారు. దసరా సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన ప్రకటన చేశారు. ఈ మూవీలో హీరోగా సాగర్ నటించనున్నారు. ముఖ్య పాత్రలో ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నారని సమాచారం. ఈ స్పెషల్ కారెక్టర్‌ సినిమాకే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందని సమాచారం. తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకోనున్నా

స్వతాహాగా సింగరేణి కార్మికుడి కుటుంబం నుంచి వచ్చిన సాగర్..  తాను చూసిన జీవితాల్ని, పాత్రల్ని తెరపైకి తీసుకు వచ్చేందుకు శ్రమిస్తున్నారు. భారీ సెట్స్‌ (అండర్ గ్రౌండ్ బొగ్గు గని సెట్టింగ్స్‌)లో సహజత్వానికి దగ్గరగా ఉండేలా చిత్రీకరణ జరగడం ఈ సినిమా నిర్మాణ విలువలను తెలియజేస్తుంది. నవంబర్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్టుగా టీం ప్రకటించింది. చిత్రానికి సంబంధించిన ఇతర వివరాల్ని త్వరలోనే తెలియజేయనున్నారు.
ఇంకా చదవండి: పవన్ కళ్యాణ్ హీరోగా కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘పురుష:’ చిత్రీకరణ పూర్తి
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ది 100     # సింగరేణి    

trending

View More